ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గా ఏ. నరేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. పోలిసు శాఖలో 1991 సంవత్సరంలో ఎస్సై గా ఎంపికయిన అదనపు ఎస్పీ నరేష్ కుమార్, మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ లో ఎస్సై గా విధులు నిర్వహించారు.ఎస్సై గా రాయకల్ , కోరుట్ల, వేములవాడ, కరీంనగర్ రూరల్ లో పనిచేసి 2006 లో సీఐగా పదోన్నతి పొంది, సీఐడీ వరంగల్, టేకులపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, జగిత్యాల, ఖానాపూర్ సీఐ గా విధులు నిర్వర్తిస్తూ, 2017 లో డిఎస్పీ గా పదోన్నతి పొందారు. డిఎస్పీ గా మహబూబాబాద్, మామునూర్ ఏసిపి గా విధులు నిర్వర్తిస్తూ, 2023 లో అదనపు ఎస్పిగా ప్రమోషన్ పొంది , సీఐడీ వరంగల్ అదనపు ఎస్పీగా పనిచేస్తూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గా బదిలీపై రావడం జరిగింది. అదనపు ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన ఏ. నరేష్ కుమార్ కు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Post A Comment: