ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు.
బుధవారం కాజీపేట మండలం కడిపికొండ శివారులో ఉన్న కేంద్రీయ విద్యాలయం లో 15వ వార్షిక క్రీడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడులకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వెల్కమ్ బ్యాండ్ లతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడుతు క్రీడల్లో గెలుపు ఓటములు సహజం అనీ అన్నారు. క్రీడల్లో సమిష్టిగా సాగుతూ దానితి పాటు చదువుల్లోనూ క్రమశిక్షణ తో రాణిస్తూ జీవితం లో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలన్నారు.
క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల మానసిక, శారీరక శక్తి పెరగడంతో పాటు, సమగ్రత టీమ్ స్పిరిట్ , సాంఘిక బాధ్యతను తీసుకోవడం, నాయకత్వ లక్షణాలు మెరుగు పడుతాయన్నారు. యోగా, మెడిటేషన్, క్రీడలు బో ధనలో తప్పని సరి కావాలని టీచర్ లకు సూచించారు.విద్యార్థులు క్రీడల్లో చక్కని ప్రదర్శన చేసారు అని, కేంద్రియ విద్యాలయ అభివృద్ధి కి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ శుభాషిణి, శ్రీనివాస్, కవిత వెంకన్న విద్యార్థుల తల్లీ దండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: