ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;హనుమకొండ జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్రంగా ఉండేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో శనివారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘము ఆదేశాల ప్రకారం ఓటర్ల జాబితా పకడ్బందీగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితా లో మార్పులు, చేర్పులు చేయడంతో పాటు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన వారికి ఓటు హక్కు కల్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. బీఎల్వోలు, అధికారులు క్షేత్ర స్థాయిలో ఓటర్ల జాబితా లో మార్పులు, చేర్పులు, నూతన ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, ఓటరు ఫోటో గుర్తింపు, తదితర వివరాలు సమగ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. ఓటర్ల జాబితా కు సంబంధించిన ఏవైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలన్నారు. ఓటర్ల జాబితా కు సంబంధించిన పలు విషయాలపై ఈ సందర్భంగా చర్చించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, హనుమకొండ ఆర్డివో రమేష్, వివిధ మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.
Post A Comment: