ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య  పథకాలను అర్హులైన లబ్ధిదారుల చెంతకు తీసుకు వెళ్ళడమే కాకుండా, కొత్త లబ్ధిదారుల గుర్తింపు లో భాగంగా అవగాహన నిమిత్తం ఈనెల 16 నుండి జనవరి 26 వరకు జిల్లా వ్యాప్తంగా 

"వికసిత్ భారత్ సంకల్ప యాత్ర" అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ  తెలిపారు.

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహణ విషయమై శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. 

కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు మౌలిక సదుపాయాలైన పారిశుద్ధ్యం, ఆర్థిక సహాయం, ఎల్పీజీ కనెక్షన్లు, ఇండ్లు, ఆహార భద్రత, పౌష్టికాహారం, వైద్యం, విద్య ,స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య అందించడంలో భాగంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, ఇందులో భాగంగా నిర్దేశించిన, అర్హత ఉన్న లబ్ధిదారులకు ఈ కార్యక్రమాలన్ని చేరేలా అలాగే కొత్త లబ్ధిదారులను గుర్తించి వారికి అవగాహన కల్పించేందుకుగాను ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. 

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నవంబర్ 15 నుండి జనవరి 26 వరకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.

ఇందులో భాగంగా జిల్లాకు మూడు ప్రచార వాహనాలను కేటాయించడం జరిగిందని , ఈ వాహనాలు ప్రతిరోజు  గ్రామాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలను వీడియో ద్వారా ఆయా గ్రామాల ప్రజలకు తెలియజేస్తారన్నారు. 

కేంద్ర ప్రభుత్వ  పథకాలైన ఆయుష్మాన్ భారత్, పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, దీన్ దయాల్ అంత్యోదయ అన్న యోజన, పిఎం ఆవాస్ యోజన, పిఎం ఉజ్వల్ యోజన, పిఎం విశ్వకర్మ ,పీఎం కిసాన్ సమ్మాన్ ,కిసాన్ క్రెడిట్, పోషణ అభియాన్, హార్ ఘర్ జల్ జీవన్ మిషన్, జన్ ధన్ యోజన, స్వామిత్వ, అటల్ పెన్షన్ యోజన, పీఎం ప్రణాం, నానో ఫర్టిలైజర్ తదితర పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారని, అంతేగాక కొత్త లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమాన్ని చేపడతారని తెలిపారు.

జిల్లాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు విజయవంతం చేసేందుకు సహకారం అందించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అమలు తీరుపై  హనుమకొండ జిల్లా కలెక్టర్  సిక్తా పట్నాయక్ ను కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ

హీనా ఉస్మాన్ శనివారం కలెక్టర్ ఛాంబర్ లో కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. హనుమకొండ జిల్లాకు కేటాయించిన  యాత్రకు సంబంధించిన మూడు ప్రచార రథాలను  వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గీసుకొండ మండలం గంగాదేవి పల్లిలో  ప్రచార యాత్ర  జరగగా హీనా ఉస్మాన్  అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: