ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;యూత్ పేస్ట్ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్, టిబి, బ్లడ్ డొనేషన్ పట్ల అవగాహన పెంపొందించడంలో భాగంగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మరియు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారి ఆదేశాల మేరకు స్కూల్ విద్యార్థులకు జాతీయస్థాయి 9 రాష్ట్రాలతో హెచ్ఐవి ఎయిడ్స్ పై నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్లో హనుమకొండ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు పోటీపడి ప్రధమ బహుమతి సాధించి హనుమకొండ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర కీర్తి పతాకాన్ని జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, అడిషనల్ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు ఫోను ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విద్యార్థులు గతంలో జిల్లాస్థాయిలో మరియు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కాంపిటీషన్ ప్రోగ్రాంలో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది.
ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులు గండి సహస్ర, నలిమెల అక్షయకు రూపాయలు 50,000 నగదు బహుమతి తో పాటు ట్రోఫీలను న్యాకో అధికారిని సుచి గౌతమ్ మరియు చత్తీస్గడ్ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ జి జే రావు చేతుల మీదుగా అందించడం జరిగింది. రీజినల్ స్థాయిలో గుర్తింపు తెచ్చినందుకుగాను జిల్లా డాప్కో టీం శ్రీమతి స్వప్నమాధురి, కమలాకర్, రామకృష్ణ రమేష్ లను, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అభినందనలు తెలియజేశారు.
Post A Comment: