ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;అమ్మాయిలు అన్ని రంగాల్లో అబ్బాయిలకు ధీటుగా రాణిస్తున్నారని విద్యా ఉపాధిలో ముందున్నారని అందు వలన ఇంకా అమ్మాయిలంటే వివక్ష తగదని లింగ నిర్ధారణ ద్వారా పుట్ట బోయే బిడ్డ అమ్మాయని తెలుసుకుని అబార్షన్ కు పాల్పడే డాక్టర్లు, ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం గర్బ ధారణ పూర్వ గర్భస్థ పిండ (లింగ నిర్ధారణ) పరీక్షల నియంత్రణ చట్టం అమలులో భాగంగా జిల్లా అప్రాప్రియేట్ అథారిటీ సమావేశం సిక్తా పట్నాయక్
జిల్లా కలెక్టర్, హనుమకొండ అధ్యక్షతన జరిగినది. జిల్లా లో చట్ట అమలు తీరును, చేపట్టిన అవగాహన కార్యక్రమాలు మరియు పి.హెచ్.సి ల వారీగా అమ్మాయిల జననాలను సమీక్షించడo జరిగింది.
జిల్లాలో అమ్మాయిల జననాలు తక్కువగా నమోదవుతున్న ప్రాంతాలలో ప్రత్యేక కార్యక్రమాలు,
అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అదే విధముగా స్కానింగ్ పరీక్షలు దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,
అక్రమంగా అబార్షన్ లు నిర్వహిస్తున్న ఆసుపత్రుల పైన మరియు స్కానింగ్ సెంటర్ ల పైన
నిఘా మరియు పర్యవేక్షణ లు పెంచాలని ఎన్జీవో లు భాద్యత తీసుకొవాలని, గ్రామం జిల్లాలోని కళాజాత బృందాలను ఉపయోగించుకొని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, పోలీస్ డిపార్టుమెంటు వారి సహకారం తీసుకోవాలని, మహిళా సమాఖ్య సభ్యుల మీటింగ్ జరిగినప్పుడు మీటింగ్లలో పి సి పి ఎన్ డి టి చట్టంపై అవగాహన కల్పించాలని సిక్తా పట్నాయక్, జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
శ్రీదేవి సెకండ్ అడిషనల్ ఫ్యామిలీ కోర్టు జడ్జ్ మాట్లాడుతూ మహిళా కళాశాలలో అమ్మాయి లకు అన్ని ఆరోగ్య అంశాల తో పాటు చట్టం పై అవగాహన కల్పించాలని, చూడగానే అర్థమయ్యే రీతిలో బొమ్మల ద్వారా సంక్షిప్త సమాచారంతో చట్టంపై అవగాహన కల్పించాలని, స్పెషల్ డ్రైవ్ ద్వారా బృందాలుగా ఏర్పడి ఆసుపత్రిల లో ఆకస్మిక తనిఖీ చేయాలని జిల్లాలోని ఆర్ఎంపీలతో సమావేశాలు ఏర్పాటు చేసి చట్టం గురించి , లింగ వివక్షత గురించి, చట్టము దుర్వినియోగ పరిచితే వేసే శిక్షల గురించి తెలియజేయాలని ఆమె పేర్కొన్నారు.
ఈ సమావేశంలో హనుమకొండ డిఎంహెచ్‌ఓ డాక్టర్.బి. సాంబశివ రావు, డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ డాక్టర్. ఎండి. యాకూబ్ పాషా, జిల్లా సంక్షేమ అధికారి మధురిమ, ఆర్ కృష్ణ మూర్తి మారి ఎన్జీవో, జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి, డిప్యూటీ డెమో కే. ప్రసాద్ , స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ హెచ్ టి యు నుండి మల్లేష్, వెంకన్న పాల్గొన్నారు.
Post A Comment: