September 2024
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

స్వ‌చ్ఛ‌త‌హీసేవ కార్య‌క్ర‌మాన్ని పుర‌స్క‌రించుకొని మై భార‌త్ (నెహ్రూ యువ కేంద్ర‌) ఆధ్వ‌ర్యంలో చారిత్రాత్మ‌క పుణ్య‌క్షేత్రం వేయి స్తంబాల దేవాల‌యంలో స్వ‌చ్ఛత‌హీసేవ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మై భార‌త్ జిల్లా అధికారి అన్వేష్ చింతల నాయ‌క‌త్వంలో సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ క‌మ్యూనికేష‌న్ ఫీల్డ్ ప‌బ్లిసిటీ ఆఫీస‌ర్ శ్రీ‌ధ‌ర్ సూరునేని, కేంద్ర పురావ‌స్తు శాఖ ఉమ్మ‌డి జిల్లా అధికారి మ‌ల్లేషం ముఖ్య అతిథులుగా పాల్గొని స్వ‌చ్ఛత‌హీసేవ ర్యాలీ , వేయి స్తంబాల దేవాల‌యంలో స్వ‌చ్ఛ భార‌త్ నిర్వ‌హించ‌డంతో పాటుగా, ప‌రిశుభ్రత గురించి భ‌క్తుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ , కార్య‌క్ర‌మ కోఆర్డినేట‌ర్‌ ఎం.రాము ఆధ్వ‌ర్యంలో సుమ‌తిరెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ఫ‌ర్ ఉమెన్ విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేవాల‌య ప్రాంగ‌ణంలోని వివిధ చోట్ల స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి చెత్త‌ను శుభ్రం చేశారు. అనంత‌రం ముఖ్య అతిథుల చేతుల మీదుగా స్వ‌చ్ఛ‌త‌హీసేవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ విద్యార్థుల‌కు మై భార‌త్ యొక్క నూత‌న పుస్త‌కాలు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మై భార‌త్ జిల్లా అధికారి అన్వేష్ చింతల, సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ క‌మ్యూనికేష‌న్ ఫీల్డ్ ప‌బ్లిసిటీ ఆఫీస‌ర్ శ్రీ‌ధ‌ర్ సూరునేని, కేంద్ర పురావ‌స్తు శాఖ ఉమ్మ‌డి జిల్లా మ‌ల్లేషం , అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ , కార్య‌క్ర‌మ కోఆర్డినేట‌ర్‌ ఎం.రాము త‌దిత‌రులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పలు సమస్యలపై వినతి పత్రాలను అందజేయగా హనుమకొండ జిల్లా ఆదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు స్వీకరించారు.

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందజేసిన ఫిర్యాదులను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. 

వివిధ సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణి కార్యక్రమంలో 158 దరఖాస్తులను అందజేశారు. 

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వై.వి.గణేష్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డాక్టర్ కె.నారాయణ, సిపిఓ సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

 హనుమకొండ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)వై. వి. గణేష్ అన్నారు.

సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణ పై వివిధ శాఖల అధికారులతో కూడిన కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, విద్య, ఎక్సైజ్, నార్కోటిక్స్, రైల్వే, జీఆర్పీ , తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గత నెల రోజులుగా మత్తు పదార్థాల నియంత్రణ కు తీసుకున్న చర్యలు, తీసుకోబోతున్న చర్యలపై ఆయా శాఖల అధికారులు వివరించారు.

అనంతరం డిఆర్ఓ వై.వి. గణేష్ మాట్లాడుతూ మత్తు పదార్థాల నియంత్రణకు వాటి మూలాలను తెలుసుకొని పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశమై మత్తు పదార్థాలు నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. 

ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డిసిపి ఎస్. కె. సలీమా, డిఎంహెచ్వో డాక్టర్ లలితా దేవి, డిఐఈవో గోపాల్, పరకాల ఆర్డీవో డాక్టర్ కె. నారాయణ, నార్కోటిక్స్ డిఎస్పి సైదులు, కాజీపేట ఏసిపీ తిరుమల్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ రవి కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 
హన్మకొండ ;
 ప్రజల పిర్యాదులను చిత్తశుద్ధితో పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు16 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. భూ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలపై పిర్యాదులు రావడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి పిర్యాదులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదుదారునికి భరోసా, నమ్మకం కలిగించేలా పని విధానం ఉండాలన్నారు. అలాగే చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీవిరమణ అనివార్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన 

ఇనుగాల పాపిరెడ్డి, ఆర్ ఎస్సై , ఎండి జలాలుద్దిన్ ఏఆర్ ఎస్సై , పోరెడ్డి రాజిరెడ్డి, ఏఆర్ ఎస్సై , రాయభారపు శ్రీనివాసులు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ లు సోమవారం

 పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాలులో ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహిం చారు. అనంతరం ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకుని వున్న పోలీస్‌ ఉద్యోగం సంపూర్ణంగా పూర్తి చేసి పదవి విరమణ పొందడం గొప్ప విషయమని పేర్కొన్నారు.పదవీ విరమణ పొందుతున్న అధికారులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని అన్నారు. అనంతరం రిటైర్ అవుతున్న పోలీసు అధికారులను ఎస్పీ పూలమాలలువేసి, శాలువాతో సత్కరించి, బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఓఎస్డీ బోనాల కిషన్, రిజర్వు ఇన్స్పెక్టర్ లు నగేష్, శ్రీకాంత్, రత్నం,కిరణ్, జిల్లా పోలీసు అధికారుల సంఘం నేత యాదిరెడ్డి, పదవి విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

  విద్యార్థినులు  ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.

సోమవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల  విద్యాలయంలో విద్యార్థినులకు ఆరోగ్య కార్డుల పంపిణీ, ఆరోగ్య శిబిరాన్ని  నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థినులను ఉద్దేశించి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థినికి చదువుతోపాటు  ఆరోగ్యం, వ్యక్తిగత శ్రద్ధ ఎంతో అవసరమని అన్నారు. ప్రతి విద్యార్థిని ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పౌష్టిక ఆహారాన్ని భోజనంలో ఉండే విధంగా విద్యార్థినులు చూసుకోవాలన్నారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని , సహజ సిద్ధమైన  ఆహారపు అలవాట్లను  అలవర్చుకోవాలన్నారు. రక్తహీనత, థైరాయిడ్, తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. విద్యార్థినులకు శారీరక ఆరోగ్యంతో పాటు  మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కరోనా అనంతర పరిస్థితులలో  శారీరక, మానసిక పరిస్థితులలో  మార్పులు వస్తున్నాయని అన్నారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు విద్యార్థుల ప్రవర్తన మార్పులను గమనించి తదననుగుణంగా వైద్య సహాయాన్ని అందించాలన్నారు.  సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైందని, విద్యార్థులు సోషల్ మీడియాకు ఆకర్షితులు  కావద్దన్నారు. సోషల్ మీడియాకు  ఆకర్షితులై వ్యక్తిగత విషయాలను బహిరంగపరచకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రభుత్వం ద్వారా మనం చదువుతున్నామంటే సమాజం  చదివిస్తుందని అర్థం అని, అదే సమాజానికి విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకొని  తమ వంతు బాధ్యతగా సేవ చేయాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని  ఉన్నత స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు. మనల్ని సహాయం కోరి వచ్చే వారికి  తప్పకుండా సాయం అందించాలన్నారు. విద్యార్థినులు బాగా చదువుకొని  ఉన్నత స్థానంలో నిలబడాలన్నారు. విద్యార్థిను లకు చదువుతోపాటు  క్రీడలు కూడా ఎంతో అవసరమని  పేర్కొన్నారు. క్రీడలు మానసిక వికాసాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని అన్నారు. డిగ్రీ కళాశాలను తీసుకువచ్చేందుకు  తన వంతు కృషి చేస్తానని  హామీ ఇచ్చారు. 

ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్. నాగరాజు మాట్లాడుతూ  పాఠశాలలో చదువుకున్న రోజులు మధురస్మృతులుగా నిలిచిపోతాయని అన్నారు. హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థినులు స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలని ఉండాలన్నారు. విద్యార్థులు  చదువుకు ప్రాధాన్యత నివ్వాలని  పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు  క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని  అన్నారు. పాఠశాల విద్యార్థులు క్రికెట్,  వాలీబాల్, టెన్నికాయిట్, స్కిప్పింగ్, తదితర క్రీడా సామగ్రిని  అడిగారని, రూ. 40 వేల విలువైన  క్రీడా వస్తువులను ఈ సందర్భంగా అందజేస్తున్నట్లు తెలిపారు.  క్రీడా సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కాపాడుకోవాలన్నారు. ఉదయకాలం  సూర్యరశ్మిలో ఒక గంట పాటు ఆటల పోటీలలో పాల్గొనాలని సూచించారు. విద్యార్థినులు ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగి విజయం సాధించాలన్నారు. ప్రతి హాస్టల్లో ఒక ఫిర్యాదుల బాక్స్ ను  ఏర్పాటు చేస్తే సమస్యల పరిష్కారం కోసం  తన వంతు కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు మాట్లాడుతూ  కస్తూరిబా పాఠశాల ఇంటర్మీడియట్ వరకు ఉందని, ఈ పాఠశాలను డిగ్రీ కళాశాల స్థాయి వరకు ఎంపీ, ఎమ్మెల్యేలు తీసుకెళ్లాలని కోరారు. విద్యార్థినిలకు హెల్త్ కార్డులను పంపిణీ చేయడం మంచి ఆలోచన అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ  విద్యార్థినులు  ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు  ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం  తీసుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన హెల్త్ కార్డులను రూపొందించినట్లు తెలిపారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఈ పాఠశాలలో  

ప్రతి నెల 15 నుంచి  20వ తేదీ వరకు విద్యార్థినిల కోసం  ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరాన్ని  నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను తల్లిదండ్రులకు కూడా తెలిసే విధంగా  హెల్త్ కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినిలు  ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు. 9 కేజీబీవీలు, మూడు మోడల్ స్కూల్స్, ఒక అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు  4000 హెల్త్ కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు .

హెల్త్ కార్డులను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు,  కలెక్టర్ ప్రావీణ్య, చేతుల మీదుగా  విద్యార్థినులకు  అందజేశారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ వాసంతి, డిఎంహెచ్వో డాక్టర్  లలితా దేవి, తహసిల్దార్ విక్రమ్, ఇతర అధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;
పర్యాటకం ద్వారానే అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని హనుమకొండ జిల్లా డీపీఆర్వో భానుప్రసాద్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 పురస్కరించుకొని శుక్రవారం హరిత హోటల్ లో పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి యం శివాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భాను ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డీపీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు వున్నాయని అన్నారు.వాటి అభివృద్ధికి కృషి చేస్తూ,పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం జరుగుతున్నదని అన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ మాట్లాడుతూ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో యువ టూరిజం క్లబ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో వరంగల్ యువ టూరిజం క్లబ్ రిజిస్ట్రేషన్ లో రెండవ స్థానంలో నిలవడం గొప్ప విషయం అని అన్నారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఖిలా వరంగల్ లో హెరిటేజ్ వాక్ మరియు పర్యాటక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. గంగాదేవి పల్లిలో కూడా పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహించామని తెలిపారు. అనంతరం హరిత హోటల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పర్యాటక రంగం ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం పర్యాటక రంగం, శాంతి అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు అయిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు.అనంతరం తాడురి రేణుకా శిష్య బృందంతో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. వల్స పైడి వ్యాఖ్యాతగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హరిత హోటల్ శ్రీనివాస్, అకౌంటెంట్ కుమారస్వామి, ప్రభుత్వ మార్కజీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జీ వీ రామారావు ఏన్ ఏస్ ఏస్ కోర్డినే టర్ శ్రీనివాస్ పర్యాటక సిబ్బంది పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 
హన్మకొండ ;
 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను ధారపోసిన ప్రముఖులలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని, తెలంగాణ కోసం వారు చేసిన త్యాగం ఎంతో గొప్పదని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.
 శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో  వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి ని నిర్వహించారు. 
ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అధికారులు జ్యోతిని వెలిగించిన అనంతరం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి  పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. 
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన   ఎంపీ డాక్టర్ కడియం కావ్య  మాట్లాడుతూ  దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా తెలంగాణకు ఇంకా విమోచన రాలేదని పోరాటం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు చేయకపోవడంపై తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన త్యాగ చరిత్ర  కొండా లక్ష్మణ్ బాపూజీ దని పేర్కొన్నారు. 
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం  కొండా లక్ష్మణ్ బాపూజీ  ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. జిల్లాలోని గురుకుల హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనకు నిధులను కల్పించనున్నట్లు  పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 
బీసీ సంక్షేమ శాఖ అధికారి రామ్ రెడ్డి, కుల సంఘ నాయకులు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తు చేశారు.
సమావేశం అనంతరం  ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ  ఆశయాల సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి రవీందర్, జిల్లా అధ్యక్షుడు ఆనందం, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికిపండ్ల వేణు, కేడిసిసిబి డైరెక్టర్ కృష్ణ ప్రసాద్, శ్యాంసుందర్, తదితరులకు తో పాటు అధికారులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ

 


హన్మకొండ ;

పింగిళి ప్రభుత్వ మహిళా  కళాశాల (స్వయం ప్రతిపత్తి) హనుమకొండలో 27-09-2024 న"తెలంగాణలో 12వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు సమాజం, ఆర్థికం, సంస్కృతి"అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది.  కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ . ప్రొఫెసర్ బి.చంద్రమౌళి అధ్యక్షత వహించారు. 

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమకొండ జిల్లా కలెక్టర్  ప్రావీణ్య  సదస్సులో ప్రసంగిస్తూ తాను ఇంజినీరింగ్ చదివినప్పటికీ సామాజిక,మానవీయ శాస్త్రాలు,చరిత్ర అంటే అభిమానం ఉండేదనీ  సివిల్స్ సాధించడానికి  అవి తోడ్పడ్డాయని ఆన్నారు. సైన్స్ విద్యార్థులకు , సైన్స్ ల్యాబ్ లతోపాటు  సామాజిక శాస్త్రాలపై కూడా అవగాహన ఉండాలని సూచించారు.

కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ చంద్రమౌళి అధ్యక్షత వహించి

మాట్లాడుతూ తెలంగాణ ఉన్నత విద్యామండలిసౌజన్యంతో , కళాశాలవిద్య నేతృత్వంలో హిస్టరీ జాతీయ సదస్సు నిర్వహించడం జరుగుతున్నదనీ, సదస్సు వల్ల కళాశాలకు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కలుగుతున్నాయనీ

సదస్సును నిర్వహిస్తున్న హిస్టరీ విభాగాన్ని అభినందిస్తున్నాననీ అన్నారు.

 కార్యక్రమ సమన్వయకర్త డా.కొలిపాక శ్రీనివాస్  హిస్టరీ జాతీయ సదస్సు యొక్క ప్రాధాన్యతను తెలియ జేసి సదస్సు  రిపోర్ట్ అందించారు.

కార్యక్రమంలో ప్రొ.కె.విజయబాబు కీలకోపన్యాసం చేస్తూ 12వ శతాబ్దం నుండి 20వ శతాబ్దాల మధ్య గల తెలంగాణ సామాజిక,ఆర్థిక,సాంస్కృతిక అంశాలను వివరించారు. ఎన్.ఐ.టీ ప్రొఫెసర్ పాండురంగారావు విశిష్ట అతిథిగా విచ్చేసి రామప్ప, వేయిస్తంభాల గుడి మొదలైన పర్యాటక ప్రసిద్ధి పొందినవి ఎన్నో తెలంగాణ ప్రశస్తిని విశ్వ వ్యాప్తం చేశాయని అన్నారు.విశిష్ట అతిథి

 కెయు ఎస్ .డి. ఎల్ .సి డైరెక్టర్ ప్రొ.వి.రామచంద్రం ప్రసంగిస్తూ

 హిస్టరీ జాతీయ సదస్సు నిర్వాహకులను అభినందించారు.

ప్రాచీనమైన 3వేల సంవత్సరాల నుండి నేటి వరకు  వివిధ దేశాల, రాజుల కాలం నాటి నాణెములు,  కరెన్సీతో ప్రత్యేకమైన ప్రదర్శనను రాగి వైకుంఠాచారి ఏర్పాటు చేయగా ఇది అందరినీ అలరించింది.

ఈ సదస్సులో 80 మంది రాసిన పరిశోధక పత్ర వ్యాసాలను  ఐ ఎస్ బి ఎన్ తో సావనేర్ ను కలెక్టర్ అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.తదనంతరం అతిథులను పుష్పగుచ్చం,శాలువా,జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.వివిధ కళాశాలల నుండి వచ్చిన ఉపన్యాసకులు,పరిశోధకులు,ఔత్సాహికులు టెక్నికల్ సేష్షన్ లో 

తమ పరిశోధన పత్రాలను సమర్పించారు.కార్యక్రమంలో

వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, ఐ క్యూ ఏ సీ కోఆర్డినేటర్ డా .సురేష్ బాబు,అకడమిక్ కో ఆర్డినేటర్ డా. ఎం.అరుణ,అధ్యాపకులు  హెప్సిబా,ప్రవీణ్ కుమార్ ,డా.పద్మ,

సుజాత,మధు,రత్నమాల,సారంగపాణి,శ్రీలత,ఉదయశ్రీ,ప్రశాంతి,డాలక్ష్మీకాంతం,

రాజు, రమేశ్ కుమార్ ,రాజిరెడ్డి, రామిరెడ్డీ,

రాజేశ్వరి,మమత,బాలరాజు,లకన్ సింగ్  మరియు భోధన బోధనేతర సిబ్బంది,ఇతర కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

  స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పరిధిలోని హనుమకొండ జిల్లాకు సంబంధించిన ధర్మసాగర్, వేలేరు  మండలాల  అభివృద్ధికి అధికారులు తోడ్పడాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో  కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ధర్మసాగర్, వేలేరు మండలాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్తు, మిషన్ భగీరథ, వైద్య ఆరోగ్య, విద్య, తదితర శాఖలకు సంబంధించిన వివరాలను ఆయా శాఖల అధికారులను ఎమ్మెల్యే, కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ప్రభుత్వ భూములను సర్వే చేయాలన్నారు. ప్రభుత్వ భూముల వివరాల నివేదికను అందజేయాలన్నారు. ఈ రెండు మండలాలలో అక్రమ మైనింగ్ జరగకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడ కూడా ఆక్రమణకు గురి కాకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. భూముల సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. వేలేరు మండలానికి సంబంధించి తహసిల్దార్, మండల పరిషత్ కార్యాలయాల ఏర్పాటుకు తగిన స్థలాన్ని గుర్తించి నివేదిక అందజేయాలన్నారు. గురుకుల పాఠశాలలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన ప్రతిపాదనలను  కలెక్టర్ కు అందజేసినట్లయితే అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా నిధులను కేటాయిస్తారని  తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మెరుగైన సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటమే తన ధ్యేయమన్నారు. మిషన్ భగీరథ పథకం గురించి  స్పందిస్తూ గ్రామాలు, గ్రామాలకు అనుబంధంగా ఉన్న ఆవాసాలలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సౌకర్యం ప్రతిరోజు అందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు  నిర్వహించాలని, రాబోయే దసరా, దీపావళి పండుగల సందర్భంగా రహదారులు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ కూడా  అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండే విధంగా ఆ శాఖ అధికారులు  అప్రమత్తంగా ఉండాలన్నారు. వేలేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉన్నతీకరించడానికి తగిన ప్రతిపాదనలను కలెక్టర్కు అందజేయాలన్నారు. పెద్ద పెండ్యాల, మల్లికుదుర్ల గ్రామాలలోని ఆరోగ్య ఉప కేంద్రాలను  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చడానికి తగిన ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఈ మండలాల్లో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్  శాఖలకు సంబంధించి  నిర్వహిస్తున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ధర్మసాగర్, వేలేరు మండలాలకు వివిధ శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలు ఏవైనా సమస్యలపై వస్తే  తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. అధికారులు సమన్వయంతో నిబద్ధతతో పనిచేసి  మంచి గుర్తింపును తెచ్చుకోవాలన్నారు.

వేలేరులోని కస్తూర్బా  పాఠశాల భవనంపై  మరో అంతస్తు నిర్మాణం చేయాలని కేజీబీవీ ప్రిన్సిపల్  కోరగా వెంటనే ఎమ్మెల్యే స్పందించి వాటి నిర్మాణానికి కావాల్సిన నిధులను  అందించాలని కలెక్టర్ కు సూచించారు. దీనిపై కలెక్టర్ ప్రావీణ్య  వెంటనే స్పందించి ఎస్డీఎఫ్ నుంచి నిధులను కేటాయించి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ ధర్మసాగర్, వేలేరు మండలాల అభివృద్ధికి కావాల్సిన నిధులను  అందజేస్తానని అన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను నాణ్యతగా, వేగవంతంగా  పూర్తి చేసేందుకు చర్యలు చేపడతానని  పేర్కొన్నారు.

ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, డీఎంహెచ్వో డాక్టర్ లలితా దేవి,  డీఈవో  వాసంతి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

 నేరాల  నియoత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్‌ స్టేషన్‌లవారీగా నమోదైన కేసులు, దర్యాప్తు జరిగిన విధానం, చార్జీషీట్‌లు దాఖలు, కోర్టులో కేసులు ఏ దశలో ఉన్నాయన్న అంశాలపై ఎస్పీ   పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని  పోలీస్‌ అధికారులను ఆదేశించారు.  అనంతరం ఎస్పీ మాట్లాడుతూ  పోలీసు అధికారులు అప్రమత్తతో విధులు నిర్వర్తించాలని అన్నారు. 

 సమాజంలో పదే పదే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారితో పాటు , ప్రజలను మోసం చేసే వారి పై చట్టపరంగా కఠిన చర్యలు  తీసుకోవాలని అన్నారు. జిల్లాలో డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని, గంజాయి రవాణా, విక్రయాలపై నిఘా ఉంచాలన్నారు. దొంగతనాలు జరగకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని, నేరాలకు పాల్పడేవారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. అలాగే  ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల ఆవశ్యకత పట్ల పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించాలని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ  బోనాల కిషన్, భూపాలపల్లి, కాటారం, వర్టికల్ డీఎస్పీలు, సంపత్ రావు, రాంమోహన్ రెడ్డి, నారాయణ నాయక్, జిల్లా పరిధిలోని ఇన్స్పెక్టర్లు, ఎస్సై లు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

మహబూబాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెన్షన్ ఆక్రోష్ ర్యాలీ మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో అంబేద్కర్ సెంటర్ వద్ద జరపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టిఎస్ సిపి ఎస్ ఈయు రాష్ట్ర కార్యదర్శి ఆవునూరి రవి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలనుండి సిపిఎస్ విధానం కొనసాగిస్తూ ఇటు ఉద్యోగుల అటు ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతూ తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం విధానం లో రిటైర్డ్ అయినా వారికి కనీస పెన్షన్ ఆసరా పెన్షన్ కన్నా అద్వాన్నంగా ఉందని ,ఈ విధానం చాలా లోపభూయిష్టంగా ఉందని ఈ విధానం తక్షణమే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫ్రెండ్లీగా ఉన్న ప్రభుత్వము తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

  ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేసే ఉద్యోగులు ప్రభుత్వానికి చేతులలాంటి వాళ్ళని ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత అని గుర్తు చేశారు.

 రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీకాంత్ నాయక్ మాట్లాడుతూ పెన్షన్ బిక్ష కాదు ఉద్యోగుల హక్కు . తమ హక్కులను యాచించాల్సిరావడం దారుణమని అన్నారు. మహబూబాద్ టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు వడ్డే బోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యుపిఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు మహబూబాద్ జిల్లా టీజీవో కార్యదర్శి రఫీ రాష్ట్ర ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి ఓ పి ఎస్ విధానానికి పునరుద్ధరించాలని కోరారు.

 ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు పూసపాటి నాగ ముని ఆధ్వర్యంలో జరిగినది. పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలుపుతూ టీఎన్జీవో మరియు టీజీవో టీ పి టీ ఎఫ్,యూటీఎఫ్ నాయకులు ఈరోజు టిపిటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి. TSCPSEU జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు లక్ష్మీకాంత్, అసోసియేట్ ప్రెసిడెంట్ నాగరాజు వైస్ ప్రెసిడెంట్ విఎండి రఫీక్, హరినాయక్ జిల్లా కార్యవర్గ సభ్యులు రవీందర్ నాయక్, మేకల కుమార్,జిల్లా మహిళా కార్యవర్గ సభ్యురాలు మమత మరియు టీఎన్జీవో ట్రెజరర్ మైసరోహిత్ టీఎస్ టిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బద్రు నాయక్ బీసీలు జిల్లా అధ్యక్షులు దొంతూజు ఓంకార్ ప్రధాన కార్యదర్శి గుడిగంటి శీను మహబూబాబాద్ అధ్యక్షులు వీరన్న కేసముద్రం మండల బాధ్యులు అశోక్, భాస్కర్ కురవి మండల అధ్యక్షులు శివకుమార్ నరేష్ రామారావు బాబు సింగ్ రవీందర్ శేఖర్ వెంకటరమణ చిన్న గూడూరు మండల బాధ్యులు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 





హన్మకొండ ;

ప్రపంచ పర్యాటక దినోత్సవం  సెప్టెంబర్ 27 ను పురస్కరించుకొని జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. పర్యాటకం - శాంతి అనే అంశం పై జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యాటకం పై అవగాహన కల్పించడానికి పాఠశాల నుండి ఉన్నత విద్యా స్థాయిలో ఏకో టూరిజం క్లబ్ లను ఏర్పాటు చేశామని ,మరిన్ని విద్యా సంస్థలు రిజిస్ట్రేషన్ లు చేసుకుంటున్నాయని తెలిపారు.

 నేడు హరితా కాకతీయలో....

ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 శుక్రవారం నాడు నక్కల గుట్ట లోని హరిత హోటల్ లో  ఫుడ్ ఫెస్టివల్ తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి యం శివాజీ తెలిపారు. పర్యాటక రంగం పై అవగాహన కోసం గురువారం నాడు హెరిటేజ్ వాక్ వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యాటకం రంగంపై అవగాహన కోసం ఇప్పటికే జిల్లాలోని పలు పాఠశాలల్లో,కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టినట్లు  తెలిపారు. నేడు హరిత హోటల్ లో జరిగే కార్యక్రమాలని విజయవంతం చెయ్యాలని తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ రూల్ ప్రకారం నడుచుకోవాలని ఖాతాదారుల వద్ద కమిషన్ వసూలు చేయకూడదని హనుమకొండ  జిల్లా అదరపు కలెక్టర్ వెంకటరెడ్డి అన్నారు.

      గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో మరియు జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రూపే కార్డు ను అర్హత ఉన్న ప్రతి ఖాతాదారునికి అందజేయాలని అన్నారు. బ్యాంకర్లు అన్ని శాఖలు సమన్వయంతో అర్హత ఉన్న ప్రతివారికి బీమా పథకాలు వర్తింపజేయాలని కోరారు. 20 23-24 సంవత్సరానికి గాను 120 శాతం లక్ష్యాన్ని సాధించినందుకు బ్యాంకర్లను అభినందించారు. గత సంవత్సరంలో ప్రాధాన్యత రంగా లకి బ్యాంకుల ద్వారా 5,333 కోట్లు రూపాయలు రుణ మంజూరి జరిగింద నీ, పంట రుణాలకి 2066 కోట్లు రూపాయలు రుణ మంజూరు జరిగిందని తెలిపారు. వ్యవసాయానికి సంబంధించి అగ్రి ఇన్ఫ్రా, పీఎం ఎఫ్ ఎం ఈ వంటి పథకాలకు ప్రాచుర్యం కల్పించి రుణ మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు. పీఎంఈజీపి వంటి పథకాలు విధిగా ప్రతి బ్యాంకు శాఖ మంజూరు చేయాలని కోరారు.మహిళా శక్తి పథకం కింద ఇస్తున్న పథకాలను సబ్సిడీ అర్హత ఉన్న పథకాల ద్వారా మంజూరు చేయించాలని కోరారు. హౌసింగ్ మరియు విద్యా రుణాలు ప్రాధాన్యత రంగంలో కూడా విరివిగా ఇవ్వాలని కోరారు. 20 24 -25 సంవత్సరానికి ప్రాధాన్యత రంగాలకు జిల్లాలో 6998 కోట్ల రూపాయలు లక్ష్యం ఉన్నందువల్ల బ్యాంకర్లు త్వరగా మంజూరు చేసి జిల్లా ప్రగతికి తోడ్పడాలని సూచించారు. నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ పంట రుణాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని బ్యాంకర్లు విధిగా క్లైమ్ చేయాలని మరియు వ్యవసాయ మౌలిక వసతులు కింద రుణ మంజూరి చేయాలని సూచించారు. డ్రోన్ ది ది వంటి పథకాల కు కూడా వర్తింపజేయాలని కోరారు. ఆర్బిఐ మేనేజర్ పల్లవి మాట్లాడుతూ రుణ వితరణ సంతృప్తిగా ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకులు సమాచారాన్ని కచ్చితంగా తెలపడం లేదని దానిని సరిచేసుకోవాలని సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 20 24 -25 ని ఆవిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా లక్ష్యాన్ని అందుకోవడానికి బ్యాంకర్లు మరియు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

  ఈ కార్యక్రమంలో బ్యాంకుల అధికారులు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;





అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం ప్రీ స్కూల్స్ గా మార్పు చేసి ప్రారంభించిందని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు.

      గురువారం అయినవోలులోని అంగన్వాడీ కేంద్రాన్ని జాతీయ పోషణ మాసంలో భాగంగా సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్లు,పిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ పోషణ అభియాన్ మాసంలో భాగంగా ఇక్కడ కు రావడం జరిగిందని అన్నారు. మీ అందరికీ పిల్లలకు అందరికీ పౌష్టికాహారం పెడుతున్నారని మీరు ఏదైతే తీసుకుంటున్నారో కరెక్ట్ గా తీసుకుంటున్నారో లేదో అనే విషయం శాఖా పరంగా మాకు ఎప్పుడు సమాచారం ఇస్తుం టా రని మీరందరూ కూడా మంచి అవగాహన తో ఉండాలని, ఇక్కడ ఏర్పాటుచేసిన ప్రదర్శన చూసి ప్రతి ఒక్కరూ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే టీచర్ను అడిగి తెలుసుకోవాలని కోరారు.పిల్ల లు ఉదయం 9 గంటల వచ్చి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండి వెళ్ళినప్పుడు ఆరోజు టీచర్ ఏం చెప్పా రనేది తెలిసేది కాదు కానీ ఇప్పుడు అభ్యసన పాఠ్యాంశాలు ఇవ్వడం జరిగిందని దాని ప్రకారం ఏ గంటకు ఏం చెప్పాలి, కథలు ఎప్పుడు చెప్పా లి, పాటలు ఎప్పుడు నేర్పాలి అనేది సిలబస్ ప్రకారం నేర్పించడం జరుగుతుందని అన్నారు. ఆ సిలబస్ లో ఏముంది అనేది తల్లులుగా మీరు తెలుసుకొని పిల్లలు ఏం నేర్చుకుంటున్నారనేది చూడాలనిఅలాగే క్లాసులు చెబుతున్నారా లేదా అనేది మీరు పరిశీలిస్తుండాలని సూచించారు. అలానే రెగ్యులర్గా పిల్లలు వచ్చి ఇక్కడ ఆహారం తీసుకొని నేర్చుకుని వెళ్లాలని కూడా మా ఉద్దేశం కాబట్టి మీరు కూడా సహకరించాలని అన్నారు.

 ఎప్పుడైనా ఏ సమస్య అయినా తలెత్తితే సూపర్వైజర్ల దృష్టికి తీసుకు రావాల్సిందిగా సూచించారు. అనంతరం ఆ కేంద్రంలో ఉన్న పిల్లలకు అక్షరాభ్యాసము, అన్నప్రాసన చేశారు. ఆ సముదాయములోనే ఉన్న హై స్కూల్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు .మధ్యాహ్న భోజన పథకం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, తాసిల్దార్ , మరియు ఎంపీడీవో ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

  వీరనారి చాకలి ఐలమ్మ  పోరాట జీవితం స్ఫూర్తిదాయకమని  వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.

గురువారం  హనుమకొండ న్యూ శాయంపేట ఫంక్షన్ వద్ద  వీరనారి చాకలి ఐలమ్మ 129 వ జయంతి కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి. ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, ఇతర అధికారులు, నాయకులు పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ తెలుగు మహిళా విశ్వవిద్యాలయానికి  వీరనారి  చాకలి ఐలమ్మ పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టారని పేర్కొన్నారు. మహనీయులను భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేలా  పరిచయం చేస్తూ కార్యక్రమాలను నిర్వహించడం  చాలా సంతోషకరమన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ  చేసిన పోరాటం, ధైర్య సాహసాలు ఎప్పటికి స్ఫూర్తిగా నిలిచిపోతాయని అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషకరమైన విషయమని  పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ  పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు సాయుధ పోరాటం  చేశారని, ఒక మహిళ అయినప్పటికీ  వీరనారీగా  పోరాటం చేసిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో  ముందుకు సాగాలని ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకు వస్తున్నారని అన్నారు. 

 వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని  రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ  వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు.  వీరనారి చాకలి ఐలమ్మ  జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. చాకలి ఐలమ్మ పోరాటం ఉమ్మడి వరంగల్ జిల్లాకు  ప్రఖ్యాతలు పెట్టిన చరిత్ర  వారిది అని అన్నారు. భూమికోసం, పేదల విముక్తి కోసం పోరాటం చేసి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి అని, వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిని స్మరించుకోవడం, ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం  వారి కుటుంబానికి ఇవ్వాల్సిన గౌరవం, మహిళా విశ్వవిద్యాలయానికి పేరును పెట్టడం అభినందనీయమన్నారు. 

ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ  గొప్ప వీరనారి  చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణమన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాలను భవిష్యత్తులో ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని వీలైతే హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని  సరైన ప్రాంతంలో పెట్టినట్లయితే బాగుంటుందని   పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో  సుందరీకరణ జరుగుతున్న దృష్ట్యా  వడ్డేపల్లి చెరువు, వరంగల్ చెరువు, న్యూ శాయంపేట జంక్షన్  ప్రాంతంలో  అందరూ ఎలా ప్రతిపాదిస్తే అక్కడ విగ్రహాన్ని పెట్టి వచ్చే జయంతి నాటికి   ఘనంగా జరుపుకొందామన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి , హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్, రజక సంఘం అధ్యక్షుడు డాక్టర్ చెట్ల మచ్చేందర్, పలు వు రు అధికారులతో పాటు  స్థానిక నాయకులు,  ప్రజలు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన  ఎంపీ...

 వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా  రజక సంఘం ఉద్యోగులు ఏర్పాటుచేసిన  మెగా రక్తదాన శిబిరాన్ని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. 

రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు  ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, ఇతర అధికారులు, రజక సంఘం ఉద్యోగులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

 హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ 

 తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ,సంక్షేమ చట్టం- 2007 ప్రకారం పెండింగ్ లో ఉన్న  కేసులను ఆర్డీవోలు త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.

బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం (25/09/2024) నుండి అక్టోబర్ 1 తేదీన  నిర్వహించే అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నేపథ్యంలో అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ సంఘం ప్రతినిధులతో  సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవానికి సంబంధించి వారం రోజుల కార్యక్రమాల కార్యాచరణ వివరాల గోడ ప్రతులను కలెక్టర్ చేతుల మీదుగా  ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ వారం రోజులపాటు నిర్వహించే  అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం  సందర్భంగా వయోవృద్ధులకు సంబంధించిన  పలు కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. తల్లిదండ్రులు, వయోవృద్ధులకు సంబంధించిన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చట్టంపై అవగాహన కల్పించడానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలలో అవగాహన కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా  ఒకరోజు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుండి ఆర్టీసీ  బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించి  అవగాహన కల్పించాలన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలలో మొదటి రోజున సంబంధిత శాఖల అధికారులు, వయవృద్ధులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. గురువారం (26/09/2024)రోజున వృద్ధాశ్రమాలలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, శుక్రవారం(27/09/2024) వయోవృద్ధుల హక్కులపై  అవగాహన కల్పించడానికి ర్యాలీ, (28/09/2024) శనివారం జిల్లా స్థాయిలో అవగాహన సదస్సు, సంక్షేమం,  ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తారన్నారు, ఆదివారం(29/09/2024) నాడు గ్రామపంచాయతీ కార్యదర్శులు  వయోవృద్ధుల హక్కుల పైన  వయోవృద్ధుల సంబంధించిన చట్టాలపై  కరపత్రాల ద్వారా  అంగన్వాడి టీచర్ల ద్వారా పంపిణీ చేస్తారని చెప్పారు. సోమవారం(30/09/2024)

రోజున అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో గ్రాండ్ పేరెంట్స్ డే ను అంగన్వాడి కేంద్రాలలో  నిర్వహించాలని అన్నారు. అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం  రోజున జిల్లాస్థాయి లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనంతరం వయోవృద్ధుల హక్కులను సంరక్షిస్తామని అందరి చేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి, డీఈవో  వాసంతి, పరకాల ఆర్డీవో నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;





 ప్రముఖ ప్రజాకవి, పద్మ విభూషణ్  పురస్కార గ్రహీత కాళోజీ నారాయణరావు  పేరిట నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం  ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లను  సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.

బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కాళోజీ కళా క్షేత్రంలో నిర్మాణం పూర్తయిన వాటర్ ఫౌంటెన్, లాన్ , ఫోటో, ఆర్ట్ గ్యాలరీ, ఆడిటోరియం, ఆడిటోరియానికి సంబంధించిన ప్రొజెక్టర్ స్క్రీన్, సౌండ్ సిస్టం, విద్యుద్దీపాలు, వేదిక, కళాకారుల మేకప్ రూమ్, ర్యాంప్ లైట్స్, తదితర పనులను  కలెక్టర్ పరిశీలించి అధికారులకు, సంబంధిత నిర్మాణ సంస్థ ప్రతినిధులకు ఏర్పాట్లకి సంబంధించిన పనులపై పలు సూచనలు చేశారు.

ప్రారంభోత్సవ రోజున కార్యక్రమాల ఏర్పాట్లను గురించిన వివరాలను కూడా పిఓ అజిత్ రెడ్డి, హనుమకొండ ఆర్డిఓ  వెంకటేష్,  లను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం రోజున కార్యక్రమాల ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను చూసుకోవాలన్నారు. 

ఈ కార్యక్రమంలో కుడా ఈఈ భీమ్ రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;




హన్మకొండ జిల్లా లోని 

ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి పరిపాలన అనుమతుల పత్రాన్ని సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కు కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి అందజేశారు. 

ఎల్కతుర్తి జంక్షన్ వయ వరంగల్, మరియు సిద్దిపేట రహదారి కరీంనగర్ ని అనుసంధానం చేయడంలో ప్రధానమైనదని, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది.  

అదే విధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఎల్కతుర్తి జంక్షన్ ని నాలుగులైన్ ల రహదారిగా మార్చడంకోసం పనులు ప్రారంభించారు.  

మంత్రి  పేర్కొన్న ఎల్కతుర్తి జంక్షన్ డెవలప్మెంట్ మరియు బ్యూటిఫికేషన్ కోసం, హన్మకొండ జిల్లా కలెక్టర్ మరియు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ సదరు రహదారిని సెప్టెంబర్ 12 నాడు సందర్శించి, ఎగ్జిక్యూటివ్స్ ఇంజనీర్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ని పూర్తి నివేదిక సమర్పించమని ఆదేశించడం జరిగింది. 

సదరు ప్రాథమిక అంచనాల ఆధారంగా, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు సమర్పించిన రూ 1.53 కోట్లు  “ఎల్కతుర్తి ట్రాఫిక్ జంక్షన్ అభివృద్ధి” కోసం విడుదల చేయడం జరిగింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;




రాజీమార్గం రాజమార్గమని, పగ, ప్రతీకారాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే   బుధవారం  తెలిపారు.  ఈ నెల 28న  నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను  కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ  సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజీపడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులలో మరియు  ఇతర రాజీపడదగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు. రాజీ మార్గం రాజ మార్గమని, చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు.  పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్ళు, పోలీసులు రాజీపడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాలను, పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని  సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని ఎస్పీ  తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 
హన్మకొండ ;
 మహిళలు స్వశక్తితో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లతో ఆర్థికాభివృద్ధిని సాధించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు అన్నారు. 
మంగళవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి తహశీల్దార్ కార్యాలయం పక్కన డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి స్నేహ క్యాంటీన్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు మాట్లాడుతూ ప్రతి పురుషుడు సాధించే విజయం వెనక మహిళ కృషి ఎంతో ఉంటుందని అన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటి వరకే పరిమితమయ్యే వారని కాని నేడు మహిళలు స్వశక్తితో వివిధ రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ భారాన్ని కూడా మహిళలు మోస్తున్నారని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మహిళలు ఏర్పాటు చేసుకొని అందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని, ఇందుకు ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు. మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసిన మహిళలు ఆర్ధికాభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రతి మహిళను కోటీశ్వరురాలిని చేయడమేనని తెలిపారు. మహిళా క్యాంటీన్ నుండి ఆహారము, ఆహార పదార్థాలను తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించినట్లు తెలిపారు. అధికారులకు, స్థానికులకు ఈ క్యాంటీన్ ద్వారా నాణ్యమైన ఆహారం, ఆహార ఉత్పత్తులను అందించి మంచి పేరును సాధించాలన్నారు. 
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. క్యాంటీన్ విజయవంతంగా ముందుకు సాగాలని, భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. క్వాలిటీ, నాణ్యత ప్రమాణాలను పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ కూడా ఇక్కడి నుంచి ఆర్డర్ తీసుకొని వెళ్లే స్థాయికి ఎదగాలని అన్నారు. క్యాంటీన్ వెనుక భాగంలో కిచెన్ వాడకం కోసం కొంత ప్రాంతాన్ని వినియోగించుకోవాలన్నారు.  
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, కలెక్టర్ ప్రావీణ్య మొక్కలు నాటారు.
హసన్పర్తి టిటిడిసి లోని శిక్షణ కేంద్రం భవనంలో ఆరోగ్యమేళాను ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అందిస్తున్న వైద్య సేవలను గురించి అక్కడి వైద్యులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 
స్వచ్ఛతాహి సేవ -2024 పక్షోత్సవాలలో భాగంగా హసన్పర్తి మండలంలోని వివిధ గ్రామపంచాయతీలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే, కలెక్టర్ కాలువలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డివో నాగ పద్మజ, అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాసరావు, స్థానిక తహసిల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీవో ప్రవీణ్, ఇతర అధికారులు, మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 
హన్మకొండ;
జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో సెప్టెంబర్ 27 లోగా యువ టూరిజం క్లబ్ రిజిస్ట్రేషన్ లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సూచించారు. హనుమకొండ జిల్లా టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ సమావేశం మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా టూరిజం అధికారి యం. శివాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని అన్నారు.వంగర టూరిజం ప్రాజెక్టు పనులు పూర్తి చెయ్యాలని అధికారులకు సూచించారు.టూరిజం సెక్రటరీ ఆదేశాల ప్రకారం  హై స్కూల్  చదువుతున్న విద్యార్థుల నుండి ఉన్నత విద్యా వరకు అన్ని విభాగాల్లో టూరిజం క్లబ్ లు ఏర్పాటు చెయ్యాలని జిల్లా విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా టూరిజం శాఖ అధికారి యం శివాజీ మాట్లాడుతూ జిల్లాలో ఏకో టూరిజం,ఇతర ప్రాజెక్టులు అటవీ శాఖ అధికారుల సమన్వయంతో  ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. టూరిజం క్లబ్ లు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లు కూడా పూర్తి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్,కేంద్ర పురావస్తు శాఖ అధికారి మల్లేశం,విద్యా శాఖ అధికారి వాసంతి, ఆర్టిసి మేనేజర్ ధరం సింగ్,టూరిజం  డీ ఈ యం ధనరాజ్, ఇంటర్మీడియట్ బోర్డు అధికారి గోపాల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి భిక్షపతి, నీటి పారుదల శాఖ నుండి రామ్మోహన్       తదితర అధికారులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

  హనుమకొండ జిల్లాకు వివిధ క్రీడాంశాలలో రాష్ట్రస్థాయిలో క్రీడాకారులు అవార్డులను తీసుకురావాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.

హనుమకొండ లోని జేఎన్ఎస్ లో యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజనోత్సవాలను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

  ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు వివిధ క్రీడల్లోనూ రాణించాలన్నారు. జిల్లా స్థాయిలో రాణించిన విధంగానే రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభను చాటాలన్నారు. విద్యార్థులు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించారని పేర్కొన్నారు. సైన్స్ మేళాను కలెక్టర్ సందర్శించి సైన్స్ సంబంధిత హనుమకొండ ప్రయోగ ప్రదర్శనల గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటి గురించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సైన్స్ మేళాలో పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థులు చాలా అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించారని అన్నారు. రాష్ట్రస్థాయి సైన్స్ మేళాలో కూడా ఈ ప్రాజెక్టుల ప్రదర్శనలు విజయం సాధించాలన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడాధికారి అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న పోటీల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ. అజిజ్ ఖాన్ మాట్లాడుతూ స్వామి వివేకనంద యువతకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలన్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత పరశురాములు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

సమాజంలో పోలీసు విధులు అత్యంత బాధ్యతయుతమయినవని, ఎస్ఐలు అంకితభావంతో పనిచేసినప్పుడే విధులకు సార్ధకత లభిస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ అన్నారు.

మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్సైలకు శిక్షణలో భాగంగా 11 పోలీస్‌ స్టేషన్‌లలో పని చేసేందుకు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ లో ఉన్న ఎస్సైలు విధి నిర్వహణలో ప్రత్యేకత చాటుతూ శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషించాలని ఎస్పీ కిరణ్ ఖరే దిశా నిర్దేశం చేశారు. ఎస్సైలుగా బాధ్యతలు నిర్వహించడం కత్తిమీద సాములాంటిదని అన్నారు. శిక్షణలో చివరి ఘట్టంలో మండల స్థాయి ప్రజల మదిలో తమదైన ముద్ర వేయాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా భద్రత, నేరాలు, దొంగతనాలు అరికట్టడం, సైబర్ నేరాల నియంత్రణ పోలీసుల లక్ష్యమని, జిల్లాలో డ్రగ్స్ నిర్మూలన పైన దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు. ప్రజలు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్సై లకు ఎస్పీ సూచించారు. ఉద్యోగంలో ఎన్నో కఠిన పరిస్థితులు, సవాళ్లు ఉంటాయని వాటన్నింటిని సమర్థంగా ఎదుర్కోవాలని, నిజాయతీగా, అంకితభావంతో సేవలు అందించాలని ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, 

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే   పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్  కార్యక్రమంలో ఎస్పీ  21 మంది  బాధితుల నుంచి పిర్యాదులు స్వీకరించారు.  ఈ సందర్భంగా ఎస్పీ  బాధితుల సమస్యలపై చట్టరంగా విచారణ జరిపి  వేగవంతంగా పరిష్కరించాలని  సంబధిత సిఐ, ఎస్సై  లను  ఆదేశించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 హనుమకొండ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై అందించిన వినతులను వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులు  చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.

సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో  ప్రజావాణి కార్యక్రమాన్ని వివిధ శాఖల ఉన్నతాధికారులతో  నిర్వహించారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు.

ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ  ఆయా   శాఖల ఉన్నతాధికారులు ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించే విధంగా  కలెక్టర్ ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 139 వినతులు  వచ్చాయి.

ఈ కార్యక్రమంలో  డీఆర్వో వై. వి. గణేష్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డాక్టర్ కె. నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

హనుమకొండజిల్లా లోని   పరకాల నియోజకవర్గ పరిధిలో యువతకు, మెగా టెక్స్టైల్ పార్కు కోసం భూములిచ్చిన వారికి ఉపాధి కల్పించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.

సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖల అధికారులతో పరకాల నియోజకవర్గ పరిధిలో మెగా జాబ్ మేళా, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో సంగెం, గీసుకొండ తో పాటు ఇతర మండలాల స్థానికులకు ఉపాధి కల్పన, తదితర అంశాలపై సమన్వయ సమావేశాన్ని  నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ పరిధిలో  దరఖాస్తు చేసుకున్న వారితో పాటు టెక్స్టైల్ పార్కు కోసం భూములు ఇచ్చిన వారి నుండి మొత్తం 3836మంది ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి వివిధ సంస్థలలో ఉపాధి కల్పనకు పూర్తిస్తాయి నివేదికను అధికారులు రూపొందించాలన్నారు. ఉపాధి కల్పనపై రెండు జిల్లాల కలెక్టర్లు, అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ పరిశ్రమల్లో విడతల వారిగా ఉపాధిని కల్పంచాలన్నారు. 18 నుండి 35 ఏళ్ల వయసు వారికి ముందుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆ తదుపరి మిగతా వయసుల వారికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. 

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ వివిధ ఉపాధి అవకాశాలకు వచ్చిన దరఖాస్తులలో అర్హతలను ముందుగా పరిగణనలోకి తీసుకుని వారి జాబితాను సిద్ధం చేస్తే వివిధ సంస్థలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మార్గం సుగమమౌతుందన్నారు.

ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ  టెక్స్టైల్ పార్కులో  ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో సెట్విన్ ఎండి మన్మోహన్, పరిశ్రమలు, ఉపాధి కల్పన, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 హనుమకొండజిల్లా  పలు జిల్లాలను కలుపుతూ ముఖ ద్వారం గా ఉన్న ఎల్కతుర్తిని ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకే  జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, సుందరీ కరణ, అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర ప్రతిపాదిత ప్రాంతాలను కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి,  హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

 ప్రతిపాదిత జంక్షన్ నిర్మాణ స్థలంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసే ప్రాంతం, ఆర్టీసీ  బస్టాండ్ ప్రాంతాన్ని మంత్రి, ఉన్నతాధికారులు పరిశీలించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా ముఖద్వారంగా ఎల్కతుర్తి మండల కేంద్రం ఉందన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధికి చర్యలు చేపట్టే విధంగా జిల్లా కలెక్టర్ తో పాటు  ఇతర శాఖల అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. స్థానిక బస్టాండ్ సెంటర్ తో పాటు  అంబేద్కర్ చౌరస్తా, హనుమకొండ, కరీంనగర్, హుస్నాబాద్, సిద్దిపేట రోడ్లను కలుపుతూ ఉన్న  ఈ ప్రాంతంలో ఎవరికి ఇబ్బందులు లేకుండా  ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా సౌలభ్యాలను, ఈ ప్రాంతంగా ఉండే వెళ్లే ప్రయాణికుల కోసం తన సూచనల మేరకు ఆహ్లాదకరమైన కూడలిగా తీర్చిదిద్దేందుకు  కుడా బాధ్యతలు చేపడుతుందన్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రాన్ని  హనుమకొండ ముఖ ద్వారం గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం  అందరూ సహకరించాలని కోరారు. అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించామని పేర్కొన్నారు. ఇందుకు  అందరు సలహాలను, సూచనలను ఇవ్వాలన్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించినట్లయితే  ఇక్కడ పారిశ్రామికంగా ఉపాధి అవకాశాలు  మరింత మెరుగుపరచడానికి అవకాశం లభిస్తుందన్నారు. ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని, ఉన్నతీకరించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కలెక్టర్, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కను నాటారు.

 ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీవోవెంకటేష్, కుడా పీవో అజిత్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

ఆరోగ్య శాఖ వారి సమన్వయం తో జిల్లా లో పిహెచ్ సి  స్థాయి నుండి 0-6 సంవత్సరాల పిల్లల పోషణ లోపం గుర్తించి, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దాలని రాజమణి అన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్. కె. లలిత దేవి మాట్లాడుతూ జిల్లా లో ప్రతీ వారం  అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో అన్ని వయస్సుల వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాము అని , రక్తహీనత శిభిరాలను నిర్వహించి గర్భిణీ, బాలింతలు మరియు కిషోర బాలికలకు పరీక్షలు నిర్వహిస్తామని, జిల్లాలోని 14 మండలాల్లో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమం లో సి డి పి వో లు, పోషణ్ అభియాన్ టీం సూపర్ వైజర్లు  ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 
హన్మకొండ ;
జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలు (చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్) కనీస ప్రమాణాలు పాటించాలనీ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఏ వెంకట రెడ్డి అన్నారు, శుక్రవారం రోజున కలెక్టరెట్ మినీకాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఇన్స్పెక్షన్ కమైటీ, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం జిల్లా సంక్షేమ అధికారి బి రాజమణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హాజరైన అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు ఆశ్రయం పొందుచున్న బాల బాలికలకు వసతి, భోజనం, విద్యా, వైద్యంతో పాటు సరైన వసతులు కల్పించాలని, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోబోయే చర్యల గురించి వివిధ శాఖల టోల్ ఫ్రీ నంబర్లను డిస్ప్లే చేయాలని సూచించారు. 
ఈ నెల 23 నుండి 28 వరకు జిల్లాలోని ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలను అదనపు కలెక్టర్ మరియు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేయనున్నట్లు తెలియచేసారు.ఈ లోగా ఆయా సంస్థలు, కొత్తగా ఏర్పాటు చేయబోయే సంస్థలకు వారి కనీస ప్రమాణాలు సంతృప్తికరంగా ఉండాలని, లేనిచో ఇన్స్పెక్షన్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రాతిపదికపై తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. 
జిల్లా సంక్షేమ అధికారి బి రాజమణి మాట్లాడుతూ హెల్త్ ప్రొఫైల్స్ కు సంబంధించిన ఫార్మాట్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో రూపొందించి అన్ని సంస్థలు ఒకే విధంగా హెల్త్ ప్రొఫైల్స్ నిర్వహించుటకు సులువుగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటామని, అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంబంధిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి బాలల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటామని అన్నారు.
జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె లలితా దేవి మాట్లాడుతూ స్థానిక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల అధికారులకు సమాచారం అందించి బాలల సంరక్షణ కేంద్రాల బాల బాలికలకు హెల్త్ ప్రొఫైల్ నిర్వహించుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సందసాని రాజేంద్ర ప్రసాద్, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జి అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం మౌనిక,శిశు గృహ మేనేజర్ డి నగేష్, జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ సోషల్ వర్కర్లు జి సునీత, ఎస్ చైతన్య, కౌన్సిలర్ మాధవి, ఓఆర్డబ్ల్యు పి విజయ్ కుమార్, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 గ్రేటర్ వరంగల్ పరిధిలో నాలాలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ఈనెల 17వ తేదీన హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి నాలాలు, చెరువులు,ప్రభుత్వ భూముల ఆక్రమణల అంశాన్ని తీసుకువెళ్లారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, రెవెన్యూ, మున్సిపల్, సాగునీటి పారుదల, కుడా, టౌన్ ప్లానింగ్, ఆర్ అండ్ బి, తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నాలాలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణల గురించిన వివరాలను ఆయా శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ నగరంలో నాలాల అభివృద్ధి, విస్తరణకు ప్రణాళికల రూపకల్పన చేయడానికి సర్వే నిర్వహించాలన్నారు. చెరువులు, కుంటలకు సంబంధించి ఎఫ్ టి ఎల్ పరిధిని సర్వే చేయించాలని, చెరువులు, కుంటల ఆక్రమణలు ఏ మేరకు జరిగిందనే వివరాల నివేదికను అధికారులు అందజేయాలన్నారు. నాలాల ఆక్రమణలను ఎట్టి పరిస్థితిల్లోను ఉపేక్షించవద్దని, ఆక్రమణలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, తహసీల్దార్లు బావ్ సింగ్, కుడా పి.వో అజిత్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈ ఈ సురేష్ బాబు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 
హన్మకొండ ;
ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమకొండ  ఆదేశాల మేరకు  జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ ఆధ్వర్యంలో విద్యార్థి  పర్యాటక క్లబ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వి .రామారావు  అధ్యక్షత వహించగా, శివాజీ 
 క్లబ్ ఉద్దేశం, లక్ష్యాలను విద్యార్థులకు వివరించారు .మన దేశంలోని వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవడం ,పర్యాటక రంగం పట్ల బాలబాలికల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ క్లబ్బులను ఏర్పాటు చేస్తున్నాయన్నారు .మర్కజి పాఠశాలలోని 20 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడితో జట్టును ఏర్పాటు చేసి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు .టూరిజం క్లబ్ పిల్లలకు వివిధ పోటీలు నిర్వహించడం ,పర్యాటక ప్రాంతాలను సందర్శింపజేయడం ,మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జివి రామారావు మాట్లాడుతూ ప్రపంచంలోని కొన్ని దేశాలు పర్యాటక రంగంపై ఆధారపడి బతుకుతున్నాయన్నారు .ప్రభుత్వ ఉద్దేశం విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ పర్యాటక అధికారి వంశీ పాఠశాల  ఉపాధ్యాయులు వలస .పైడి, డాక్టర్ కే వాసు ,శ్రీనివాస్ రెడ్డి ,ఎడ్ల శ్రీనివాస్ ,వీరస్వామి, కిరణ్ కుమార్, కాంతయ్య ,రమాదేవి ,పద్మ , రజిత,సమ్మిరెడ్డి తదితర ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

హనుమకొండ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో ఆయా గ్రామ పంచాయతీల వార్డుల వారిగా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరిగిందని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు. 

బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గ్రామపంచాయతీల ఓటర్ల జాబితా, అభ్యంతరాల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా రూపకల్పన పై జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఆదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వారు గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ నోటిఫికేషన్ జారీ చేసిన క్రమంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  గురువారం మండల స్థాయిలో కూడా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏవైన అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చన్నారు. 

ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. 

ఈ సమావేశానికి హాజరైన వివిధ రాజకీయ పార్టీల  ప్రతినిధులకు ఎన్నికల నోటిఫికేషన్, ప్రచురణ,  అభ్యంతరముల స్వీకరణ విషయమై వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి  లక్ష్మీ రమాకాంత్ మాట్లాడుతూ  హనుమకొండ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు హనుమకొండ, పరకాల  ఉన్నాయన్నారు. జిల్లాలో మొత్తం 210  గ్రామపంచాయతీలు ఉండగా  వాటిలో 1986 వార్డులు ఉన్నాయన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల వారీగా మొత్తం ఓటర్లు 365828 ఉన్నారన్నారు.  గ్రామపంచాయతీ ఓటర్ల తుది జాబితా ఈనెల 28వ తేదీన ప్రచురణ ఉంటుందన్నారు. 

ఈ సమావేశంలో డిఎల్పిఓలు గంగా భవాని, షర్ఫుద్దీన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్యాంసుందర్, నిశాంత్, రజినీకాంత్, ఎండి. నేహాల్, ప్రవీణ్ కుమార్, మణి, లక్ష్మణ్, రవి, సయ్యద్ ఫైజుల్ల, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 
హన్మకొండ ;
హన్మకొండ టిటిడి జంక్షన్ వద్ద బల్దియా ఆధ్వర్యంలో రూ.50 లక్షల  వ్యయంతో నిర్మించిన జంక్షన్ ను రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మాత్యులు  కొండా సురేఖ తో కలిసి  రాష్ట్ర రెవిన్యూ సమాచార పౌర సంబంధాల గృహనిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. 
    ఈ కార్యక్రమం లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు  కడియం కావ్య నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య డా సత్య శారద, కుడా చైర్మన్ ఇనగల వెంకట్రామిరెడ్డి, కమీషనర్ డా అశ్విని తానాజీ వాకడే కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వరంగల్ బస్ స్టాండ్ సమీపంలోగల ఏస్ ఎన్ ఎం.జంక్షన్ వద్ద బల్దియా స్మార్ట్ సిటీ నిధులు రూ.60 లక్షల వ్యయం తో ఏర్పాటు చేసిన జంక్షన్ అభివృద్ది పనులను రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మాత్యులు కొండా సురేఖ తో కలిసి రాష్ట్ర రెవిన్యూ సమాచార పౌర సంబంధాల గృహనిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. 

ఈ కార్యక్రమం లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య నగర మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వర్దన్న పేట శాసనసభ్యులు కే.ఆర్ నాగరాజు జిల్లా కలెక్టర్ డా సత్య శారద కమీషనర్ డా అశ్విని తానాజీ వాకడే కార్పొరేటర్లు చింతాకుల అనిల్ కుమార్ కావేటి కవిత ఉమా దామోదర్ యాదవ్ ఓని స్వర్ణలత భాస్కర్ ప్రవీణ్ ముష్కమల్ల అరుణ సుధాకర్ గుండు చందన పూర్ణ చందర్ పోశాల పద్మ స్వామి గౌడ్ భోగి సువర్ణ సురేష్ తో పాటు బల్దియా ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర సి ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఈ ఈ శ్రీనివాస్ డి ఈ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 హనుమకొండ: హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించారని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 

మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్  లోని కాన్ఫరెన్స్ హాలులో  వరంగల్ పశ్చిమ నియోజకవర్గ  అభివృద్ధి పనులపై  సమీక్షా సమావేశాన్ని  నిర్వహించారు. 

ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం, పోచమ్మ కుంట మోడల్ గ్రేవీ యార్డ్, గ్రేటర్ వరంగల్ పరిధిలోని పార్కు స్థలాల ఆక్రమణ, రీజినల్ సైన్స్ సెంటర్  భూమి ఆక్రమణ, నాలాల ఆక్రమణలు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, వాటి పురోగతి, నిధుల కేటాయింపు, డంపింగ్ యార్డ్, కాళోజీ కళాక్షేత్రం  నిర్మాణ పనులు, ఓ ఆర్ ఆర్ పనులు, కాజీపేట ఆర్ఓబి, తదితర అంశాలపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో వెంకటేష్, కుడా పీవో అజిత్ రెడ్డి, మున్సిపల్, సాగునీటి పారుదల, ఆర్ అండ్ బి, తదితర శాఖల అధికారులతో  ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై మంత్రి సమీక్షించారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రెండో పెద్ద నగరమైన వరంగల్ ను  మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, అందుకే తనను ఈ జిల్లాకు  ఇన్చార్జిగా  బాధ్యతలను అప్పగించారని  అన్నారు. అందుకే వరంగల్ సమగ్ర అభివృద్ధికి  ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత నిస్తుందన్నారు. ఎడ్యుకేషన్, హెల్త్ అనేవి  రెండు కళ్ళలాంటివని పేర్కొన్నారు.  సమీక్షా సమావేశంలో  వరంగల్ పశ్చిమ నియోజకవర్గం తో పాటు వరంగల్ నగరాభివృద్ధి  తీసుకోవాల్సిన  చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో  సమీక్షించినట్లు పేర్కొన్నారు. నగర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి  నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులను కూడా విడుదలయ్యేందుకు కృషి చేస్తామన్నారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన వాటికి నిధులను కేటాయిస్తామన్నారు. పేదలకు పెద్దదిక్కుగా  వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి  ఉందని ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు  చుట్టుపక్కల ఉన్న జిల్లాలు , చత్తీస్గడ్  రాష్ట్రం నుంచి వైద్య సేవల కోసం నిరుపేదలు  వస్తుంటారని, అలాంటి ఆసుపత్రిలో  మందుల కొరత అనేది సహించలేనిదని అన్నారు. నిరుపేదలకు వైద్య సేవలు అందించడంలో  మందుల కొరత  రాకుండా చూసుకోవడంలో  అధికారులు ఎంత మాత్రం నిర్లక్ష్యం వహించొద్దని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో విద్య వైద్యంపై  ఎమ్మెల్యేలు  తరచుగా పర్యటించాలన్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో  వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందే విధంగా పర్యవేక్షించాలన్నారు.  అధికారులు సమన్వయంతో కృషి చేస్తే ప్రజలకు మెరుగైన సేవలు  అందించవచ్చునని అన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో ఫిర్యాదులను స్వీకరించి వాటికి సంబంధించిన నివేదికను అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు.  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు  వరద ముప్పు నుండి  ప్రజలను హనుమకొండ, వరంగల్  జిల్లాల కలెక్టర్లు, అధికారులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా  కాపాడినందుకు మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. పాత్రికేయులకు  ఇంటి స్థలాల కేటాయింపు విషయంలో  తమ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, తప్పకుండా ఇంటి స్థలాలను అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పాత్రికేయుల ఇంటి స్థలాల విషయంలో  కాలయాపన చేసిందని పేర్కొన్నారు. అలా కాకుండా  అర్హులైన వారి జాబితాను  ఆయా కమిటీలు అందిస్తే ఇంటి స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందన్నారు. ఇంటి స్థలాల విషయంలో  ఆయా యూనియన్లు  రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో ఒకసారి సమావేశమై చర్చించాలన్నారు. ఇటీవలనే హైదరాబాదులో పాత్రికేయులకు  ఇళ్ల స్థలాలను  ముఖ్యమంత్రి చేతుల మీదుగా  అందించినట్లు పేర్కొన్నారు. నాలాలపై ఎలాంటి నిర్మాణాలు ఉన్న  ఉపేక్షించవద్దని, ఎంతటి వారు ఉన్న వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నాలాలపై  నిరుపేదలు  ఉన్నట్లయితే వారికి సరైన చోట  నివాసం ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే తీసుకుంటుందని, ఎంత పెద్ద వాళ్ళు తీసుకున్న  ప్రభుత్వం ఊరుకోదన్నారు. కాళోజి కళాక్షేత్రం  నిర్మాణ పనులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని వెంటనే పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కళాక్షేత్రం  ప్రారంభోత్సవం కోసం  వచ్చే నెల రెండవ తేదీన  ముఖ్యమంత్రి పర్యటన ఉండనుందని పేర్కొన్నారు. వరంగల్ విమానాశ్రయం సంబంధించిన  వివిధ అంశాలపై  ఆర్ అండ్ బి మంత్రితో  చర్చించనున్నట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్య తలెత్తకుండా  చర్యలు చేపట్టాలన్నారు. 

 ఈ సమావేశంలో రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ మాట్లాడుతూ  వరంగల్ పై  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు నగరాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలన్నారు. ఇంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు డంపింగ్ యార్డ్ సమస్య  ప్రస్తావనకు వచ్చిందని  ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం జరగాలని అన్నారు.

ఈ సమావేశంలో నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ  కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం మరిన్ని నిధులను కేటాయించాలని అన్నారు. స్మార్ట్ సిటీ పనులను కూడా వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. నాలాల ఆక్రమణ తొలగింపు విషయంలో కార్పొరేషన్కు అనేక ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ, సాగునీటిపారుదల, ఇతర శాఖల అధికారులు సహకారం అందిస్తే నాలాల విస్తరణ పనులను  పూర్తి చేయవచ్చునని తెలిపారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ నగరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు.  వరంగల్ లో అనేక పురాతన ఆలయాలు నెలవై ఉన్నాయని, వాటి పునరుద్ధరణ పనులను పూర్తి చేసినట్లయితే  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా వరంగల్ నిలుస్తుందన్నారు. కేంద్రం నుండి వరంగల్ అభివృద్ధికి  నిధులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ  పార్కు స్థలాలు  చాలా చోట్ల కబ్జాకు గురయ్యాయని  మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. విలువైన పార్కు స్థలాల ఆక్రమణలపై  చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం అభివృద్ధికి, వసతుల కల్పనకు  ప్రత్యేక చొరవ తీసుకోవాలని  మంత్రిని కోరారు.

ఆయా జిల్లాలకు సంబంధించిన, గ్రేటర్ వరంగల్ సంబంధించిన  వివిధ అంశాలను గురించి కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, జిడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్వినీ తానాజీ  వాకడే తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా ఛైర్మన్  ఇనగాల వెంకట్రాంరెడ్డి, అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్, కుడా అధికారులు పాల్గొన్నారు.