ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీవిరమణ అనివార్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన
ఇనుగాల పాపిరెడ్డి, ఆర్ ఎస్సై , ఎండి జలాలుద్దిన్ ఏఆర్ ఎస్సై , పోరెడ్డి రాజిరెడ్డి, ఏఆర్ ఎస్సై , రాయభారపు శ్రీనివాసులు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ లు సోమవారం
పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాలులో ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహిం చారు. అనంతరం ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకుని వున్న పోలీస్ ఉద్యోగం సంపూర్ణంగా పూర్తి చేసి పదవి విరమణ పొందడం గొప్ప విషయమని పేర్కొన్నారు.పదవీ విరమణ పొందుతున్న అధికారులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని అన్నారు. అనంతరం రిటైర్ అవుతున్న పోలీసు అధికారులను ఎస్పీ పూలమాలలువేసి, శాలువాతో సత్కరించి, బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఓఎస్డీ బోనాల కిషన్, రిజర్వు ఇన్స్పెక్టర్ లు నగేష్, శ్రీకాంత్, రత్నం,కిరణ్, జిల్లా పోలీసు అధికారుల సంఘం నేత యాదిరెడ్డి, పదవి విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: