ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ రూల్ ప్రకారం నడుచుకోవాలని ఖాతాదారుల వద్ద కమిషన్ వసూలు చేయకూడదని హనుమకొండ  జిల్లా అదరపు కలెక్టర్ వెంకటరెడ్డి అన్నారు.

      గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో మరియు జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రూపే కార్డు ను అర్హత ఉన్న ప్రతి ఖాతాదారునికి అందజేయాలని అన్నారు. బ్యాంకర్లు అన్ని శాఖలు సమన్వయంతో అర్హత ఉన్న ప్రతివారికి బీమా పథకాలు వర్తింపజేయాలని కోరారు. 20 23-24 సంవత్సరానికి గాను 120 శాతం లక్ష్యాన్ని సాధించినందుకు బ్యాంకర్లను అభినందించారు. గత సంవత్సరంలో ప్రాధాన్యత రంగా లకి బ్యాంకుల ద్వారా 5,333 కోట్లు రూపాయలు రుణ మంజూరి జరిగింద నీ, పంట రుణాలకి 2066 కోట్లు రూపాయలు రుణ మంజూరు జరిగిందని తెలిపారు. వ్యవసాయానికి సంబంధించి అగ్రి ఇన్ఫ్రా, పీఎం ఎఫ్ ఎం ఈ వంటి పథకాలకు ప్రాచుర్యం కల్పించి రుణ మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు. పీఎంఈజీపి వంటి పథకాలు విధిగా ప్రతి బ్యాంకు శాఖ మంజూరు చేయాలని కోరారు.మహిళా శక్తి పథకం కింద ఇస్తున్న పథకాలను సబ్సిడీ అర్హత ఉన్న పథకాల ద్వారా మంజూరు చేయించాలని కోరారు. హౌసింగ్ మరియు విద్యా రుణాలు ప్రాధాన్యత రంగంలో కూడా విరివిగా ఇవ్వాలని కోరారు. 20 24 -25 సంవత్సరానికి ప్రాధాన్యత రంగాలకు జిల్లాలో 6998 కోట్ల రూపాయలు లక్ష్యం ఉన్నందువల్ల బ్యాంకర్లు త్వరగా మంజూరు చేసి జిల్లా ప్రగతికి తోడ్పడాలని సూచించారు. నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ పంట రుణాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని బ్యాంకర్లు విధిగా క్లైమ్ చేయాలని మరియు వ్యవసాయ మౌలిక వసతులు కింద రుణ మంజూరి చేయాలని సూచించారు. డ్రోన్ ది ది వంటి పథకాల కు కూడా వర్తింపజేయాలని కోరారు. ఆర్బిఐ మేనేజర్ పల్లవి మాట్లాడుతూ రుణ వితరణ సంతృప్తిగా ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకులు సమాచారాన్ని కచ్చితంగా తెలపడం లేదని దానిని సరిచేసుకోవాలని సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 20 24 -25 ని ఆవిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా లక్ష్యాన్ని అందుకోవడానికి బ్యాంకర్లు మరియు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

  ఈ కార్యక్రమంలో బ్యాంకుల అధికారులు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: