ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం ప్రీ స్కూల్స్ గా మార్పు చేసి ప్రారంభించిందని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు.
గురువారం అయినవోలులోని అంగన్వాడీ కేంద్రాన్ని జాతీయ పోషణ మాసంలో భాగంగా సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్లు,పిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ పోషణ అభియాన్ మాసంలో భాగంగా ఇక్కడ కు రావడం జరిగిందని అన్నారు. మీ అందరికీ పిల్లలకు అందరికీ పౌష్టికాహారం పెడుతున్నారని మీరు ఏదైతే తీసుకుంటున్నారో కరెక్ట్ గా తీసుకుంటున్నారో లేదో అనే విషయం శాఖా పరంగా మాకు ఎప్పుడు సమాచారం ఇస్తుం టా రని మీరందరూ కూడా మంచి అవగాహన తో ఉండాలని, ఇక్కడ ఏర్పాటుచేసిన ప్రదర్శన చూసి ప్రతి ఒక్కరూ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే టీచర్ను అడిగి తెలుసుకోవాలని కోరారు.పిల్ల లు ఉదయం 9 గంటల వచ్చి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండి వెళ్ళినప్పుడు ఆరోజు టీచర్ ఏం చెప్పా రనేది తెలిసేది కాదు కానీ ఇప్పుడు అభ్యసన పాఠ్యాంశాలు ఇవ్వడం జరిగిందని దాని ప్రకారం ఏ గంటకు ఏం చెప్పాలి, కథలు ఎప్పుడు చెప్పా లి, పాటలు ఎప్పుడు నేర్పాలి అనేది సిలబస్ ప్రకారం నేర్పించడం జరుగుతుందని అన్నారు. ఆ సిలబస్ లో ఏముంది అనేది తల్లులుగా మీరు తెలుసుకొని పిల్లలు ఏం నేర్చుకుంటున్నారనేది చూడాలనిఅలాగే క్లాసులు చెబుతున్నారా లేదా అనేది మీరు పరిశీలిస్తుండాలని సూచించారు. అలానే రెగ్యులర్గా పిల్లలు వచ్చి ఇక్కడ ఆహారం తీసుకొని నేర్చుకుని వెళ్లాలని కూడా మా ఉద్దేశం కాబట్టి మీరు కూడా సహకరించాలని అన్నారు.
ఎప్పుడైనా ఏ సమస్య అయినా తలెత్తితే సూపర్వైజర్ల దృష్టికి తీసుకు రావాల్సిందిగా సూచించారు. అనంతరం ఆ కేంద్రంలో ఉన్న పిల్లలకు అక్షరాభ్యాసము, అన్నప్రాసన చేశారు. ఆ సముదాయములోనే ఉన్న హై స్కూల్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు .మధ్యాహ్న భోజన పథకం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, తాసిల్దార్ , మరియు ఎంపీడీవో ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: