ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో సెప్టెంబర్ 27 లోగా యువ టూరిజం క్లబ్ రిజిస్ట్రేషన్ లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సూచించారు. హనుమకొండ జిల్లా టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ సమావేశం మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా టూరిజం అధికారి యం. శివాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని అన్నారు.వంగర టూరిజం ప్రాజెక్టు పనులు పూర్తి చెయ్యాలని అధికారులకు సూచించారు.టూరిజం సెక్రటరీ ఆదేశాల ప్రకారం హై స్కూల్ చదువుతున్న విద్యార్థుల నుండి ఉన్నత విద్యా వరకు అన్ని విభాగాల్లో టూరిజం క్లబ్ లు ఏర్పాటు చెయ్యాలని జిల్లా విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా టూరిజం శాఖ అధికారి యం శివాజీ మాట్లాడుతూ జిల్లాలో ఏకో టూరిజం,ఇతర ప్రాజెక్టులు అటవీ శాఖ అధికారుల సమన్వయంతో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. టూరిజం క్లబ్ లు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లు కూడా పూర్తి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్,కేంద్ర పురావస్తు శాఖ అధికారి మల్లేశం,విద్యా శాఖ అధికారి వాసంతి, ఆర్టిసి మేనేజర్ ధరం సింగ్,టూరిజం డీ ఈ యం ధనరాజ్, ఇంటర్మీడియట్ బోర్డు అధికారి గోపాల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి భిక్షపతి, నీటి పారుదల శాఖ నుండి రామ్మోహన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: