ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లాకు వివిధ క్రీడాంశాలలో రాష్ట్రస్థాయిలో క్రీడాకారులు అవార్డులను తీసుకురావాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.
హనుమకొండ లోని జేఎన్ఎస్ లో యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజనోత్సవాలను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు వివిధ క్రీడల్లోనూ రాణించాలన్నారు. జిల్లా స్థాయిలో రాణించిన విధంగానే రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభను చాటాలన్నారు. విద్యార్థులు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించారని పేర్కొన్నారు. సైన్స్ మేళాను కలెక్టర్ సందర్శించి సైన్స్ సంబంధిత హనుమకొండ ప్రయోగ ప్రదర్శనల గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటి గురించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సైన్స్ మేళాలో పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థులు చాలా అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించారని అన్నారు. రాష్ట్రస్థాయి సైన్స్ మేళాలో కూడా ఈ ప్రాజెక్టుల ప్రదర్శనలు విజయం సాధించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడాధికారి అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న పోటీల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ. అజిజ్ ఖాన్ మాట్లాడుతూ స్వామి వివేకనంద యువతకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత పరశురాములు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: