ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సమాజంలో పోలీసు విధులు అత్యంత బాధ్యతయుతమయినవని, ఎస్ఐలు అంకితభావంతో పనిచేసినప్పుడే విధులకు సార్ధకత లభిస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ అన్నారు.
మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్సైలకు శిక్షణలో భాగంగా 11 పోలీస్ స్టేషన్‌లలో పని చేసేందుకు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ లో ఉన్న ఎస్సైలు విధి నిర్వహణలో ప్రత్యేకత చాటుతూ శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషించాలని ఎస్పీ కిరణ్ ఖరే దిశా నిర్దేశం చేశారు. ఎస్సైలుగా బాధ్యతలు నిర్వహించడం కత్తిమీద సాములాంటిదని అన్నారు. శిక్షణలో చివరి ఘట్టంలో మండల స్థాయి ప్రజల మదిలో తమదైన ముద్ర వేయాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా భద్రత, నేరాలు, దొంగతనాలు అరికట్టడం, సైబర్ నేరాల నియంత్రణ పోలీసుల లక్ష్యమని, జిల్లాలో డ్రగ్స్ నిర్మూలన పైన దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు. ప్రజలు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్సై లకు ఎస్పీ సూచించారు. ఉద్యోగంలో ఎన్నో కఠిన పరిస్థితులు, సవాళ్లు ఉంటాయని వాటన్నింటిని సమర్థంగా ఎదుర్కోవాలని, నిజాయతీగా, అంకితభావంతో సేవలు అందించాలని ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు.
Post A Comment: