ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 
హన్మకొండ ;
 మహిళలు స్వశక్తితో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లతో ఆర్థికాభివృద్ధిని సాధించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు అన్నారు. 
మంగళవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి తహశీల్దార్ కార్యాలయం పక్కన డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి స్నేహ క్యాంటీన్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు మాట్లాడుతూ ప్రతి పురుషుడు సాధించే విజయం వెనక మహిళ కృషి ఎంతో ఉంటుందని అన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటి వరకే పరిమితమయ్యే వారని కాని నేడు మహిళలు స్వశక్తితో వివిధ రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ భారాన్ని కూడా మహిళలు మోస్తున్నారని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మహిళలు ఏర్పాటు చేసుకొని అందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని, ఇందుకు ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు. మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసిన మహిళలు ఆర్ధికాభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రతి మహిళను కోటీశ్వరురాలిని చేయడమేనని తెలిపారు. మహిళా క్యాంటీన్ నుండి ఆహారము, ఆహార పదార్థాలను తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించినట్లు తెలిపారు. అధికారులకు, స్థానికులకు ఈ క్యాంటీన్ ద్వారా నాణ్యమైన ఆహారం, ఆహార ఉత్పత్తులను అందించి మంచి పేరును సాధించాలన్నారు. 
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. క్యాంటీన్ విజయవంతంగా ముందుకు సాగాలని, భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. క్వాలిటీ, నాణ్యత ప్రమాణాలను పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ కూడా ఇక్కడి నుంచి ఆర్డర్ తీసుకొని వెళ్లే స్థాయికి ఎదగాలని అన్నారు. క్యాంటీన్ వెనుక భాగంలో కిచెన్ వాడకం కోసం కొంత ప్రాంతాన్ని వినియోగించుకోవాలన్నారు.  
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, కలెక్టర్ ప్రావీణ్య మొక్కలు నాటారు.
హసన్పర్తి టిటిడిసి లోని శిక్షణ కేంద్రం భవనంలో ఆరోగ్యమేళాను ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అందిస్తున్న వైద్య సేవలను గురించి అక్కడి వైద్యులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 
స్వచ్ఛతాహి సేవ -2024 పక్షోత్సవాలలో భాగంగా హసన్పర్తి మండలంలోని వివిధ గ్రామపంచాయతీలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే, కలెక్టర్ కాలువలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డివో నాగ పద్మజ, అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాసరావు, స్థానిక తహసిల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీవో ప్రవీణ్, ఇతర అధికారులు, మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: