ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 హనుమకొండజిల్లా  పలు జిల్లాలను కలుపుతూ ముఖ ద్వారం గా ఉన్న ఎల్కతుర్తిని ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకే  జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, సుందరీ కరణ, అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర ప్రతిపాదిత ప్రాంతాలను కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి,  హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

 ప్రతిపాదిత జంక్షన్ నిర్మాణ స్థలంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసే ప్రాంతం, ఆర్టీసీ  బస్టాండ్ ప్రాంతాన్ని మంత్రి, ఉన్నతాధికారులు పరిశీలించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా ముఖద్వారంగా ఎల్కతుర్తి మండల కేంద్రం ఉందన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధికి చర్యలు చేపట్టే విధంగా జిల్లా కలెక్టర్ తో పాటు  ఇతర శాఖల అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. స్థానిక బస్టాండ్ సెంటర్ తో పాటు  అంబేద్కర్ చౌరస్తా, హనుమకొండ, కరీంనగర్, హుస్నాబాద్, సిద్దిపేట రోడ్లను కలుపుతూ ఉన్న  ఈ ప్రాంతంలో ఎవరికి ఇబ్బందులు లేకుండా  ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా సౌలభ్యాలను, ఈ ప్రాంతంగా ఉండే వెళ్లే ప్రయాణికుల కోసం తన సూచనల మేరకు ఆహ్లాదకరమైన కూడలిగా తీర్చిదిద్దేందుకు  కుడా బాధ్యతలు చేపడుతుందన్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రాన్ని  హనుమకొండ ముఖ ద్వారం గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం  అందరూ సహకరించాలని కోరారు. అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించామని పేర్కొన్నారు. ఇందుకు  అందరు సలహాలను, సూచనలను ఇవ్వాలన్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించినట్లయితే  ఇక్కడ పారిశ్రామికంగా ఉపాధి అవకాశాలు  మరింత మెరుగుపరచడానికి అవకాశం లభిస్తుందన్నారు. ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని, ఉన్నతీకరించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కలెక్టర్, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కను నాటారు.

 ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీవోవెంకటేష్, కుడా పీవో అజిత్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: