ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం ప్రతిపత్తి) హనుమకొండలో 27-09-2024 న"తెలంగాణలో 12వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు సమాజం, ఆర్థికం, సంస్కృతి"అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ . ప్రొఫెసర్ బి.చంద్రమౌళి అధ్యక్షత వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సదస్సులో ప్రసంగిస్తూ తాను ఇంజినీరింగ్ చదివినప్పటికీ సామాజిక,మానవీయ శాస్త్రాలు,చరిత్ర అంటే అభిమానం ఉండేదనీ సివిల్స్ సాధించడానికి అవి తోడ్పడ్డాయని ఆన్నారు. సైన్స్ విద్యార్థులకు , సైన్స్ ల్యాబ్ లతోపాటు సామాజిక శాస్త్రాలపై కూడా అవగాహన ఉండాలని సూచించారు.
కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ చంద్రమౌళి అధ్యక్షత వహించి
మాట్లాడుతూ తెలంగాణ ఉన్నత విద్యామండలిసౌజన్యంతో , కళాశాలవిద్య నేతృత్వంలో హిస్టరీ జాతీయ సదస్సు నిర్వహించడం జరుగుతున్నదనీ, సదస్సు వల్ల కళాశాలకు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కలుగుతున్నాయనీ
సదస్సును నిర్వహిస్తున్న హిస్టరీ విభాగాన్ని అభినందిస్తున్నాననీ అన్నారు.
కార్యక్రమ సమన్వయకర్త డా.కొలిపాక శ్రీనివాస్ హిస్టరీ జాతీయ సదస్సు యొక్క ప్రాధాన్యతను తెలియ జేసి సదస్సు రిపోర్ట్ అందించారు.
కార్యక్రమంలో ప్రొ.కె.విజయబాబు కీలకోపన్యాసం చేస్తూ 12వ శతాబ్దం నుండి 20వ శతాబ్దాల మధ్య గల తెలంగాణ సామాజిక,ఆర్థిక,సాంస్కృతిక అంశాలను వివరించారు. ఎన్.ఐ.టీ ప్రొఫెసర్ పాండురంగారావు విశిష్ట అతిథిగా విచ్చేసి రామప్ప, వేయిస్తంభాల గుడి మొదలైన పర్యాటక ప్రసిద్ధి పొందినవి ఎన్నో తెలంగాణ ప్రశస్తిని విశ్వ వ్యాప్తం చేశాయని అన్నారు.విశిష్ట అతిథి
కెయు ఎస్ .డి. ఎల్ .సి డైరెక్టర్ ప్రొ.వి.రామచంద్రం ప్రసంగిస్తూ
హిస్టరీ జాతీయ సదస్సు నిర్వాహకులను అభినందించారు.
ప్రాచీనమైన 3వేల సంవత్సరాల నుండి నేటి వరకు వివిధ దేశాల, రాజుల కాలం నాటి నాణెములు, కరెన్సీతో ప్రత్యేకమైన ప్రదర్శనను రాగి వైకుంఠాచారి ఏర్పాటు చేయగా ఇది అందరినీ అలరించింది.
ఈ సదస్సులో 80 మంది రాసిన పరిశోధక పత్ర వ్యాసాలను ఐ ఎస్ బి ఎన్ తో సావనేర్ ను కలెక్టర్ అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.తదనంతరం అతిథులను పుష్పగుచ్చం,శాలువా,జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.వివిధ కళాశాలల నుండి వచ్చిన ఉపన్యాసకులు,పరిశోధకులు,ఔత్సాహికులు టెక్నికల్ సేష్షన్ లో
తమ పరిశోధన పత్రాలను సమర్పించారు.కార్యక్రమంలో
వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, ఐ క్యూ ఏ సీ కోఆర్డినేటర్ డా .సురేష్ బాబు,అకడమిక్ కో ఆర్డినేటర్ డా. ఎం.అరుణ,అధ్యాపకులు హెప్సిబా,ప్రవీణ్ కుమార్ ,డా.పద్మ,
సుజాత,మధు,రత్నమాల,సారంగపాణి,శ్రీలత,ఉదయశ్రీ,ప్రశాంతి,డాలక్ష్మీకాంతం,
రాజు, రమేశ్ కుమార్ ,రాజిరెడ్డి, రామిరెడ్డీ,
రాజేశ్వరి,మమత,బాలరాజు,లకన్ సింగ్ మరియు భోధన బోధనేతర సిబ్బంది,ఇతర కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: