ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 
హన్మకొండ ;
 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను ధారపోసిన ప్రముఖులలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని, తెలంగాణ కోసం వారు చేసిన త్యాగం ఎంతో గొప్పదని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.
 శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో  వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి ని నిర్వహించారు. 
ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అధికారులు జ్యోతిని వెలిగించిన అనంతరం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి  పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. 
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన   ఎంపీ డాక్టర్ కడియం కావ్య  మాట్లాడుతూ  దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా తెలంగాణకు ఇంకా విమోచన రాలేదని పోరాటం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు చేయకపోవడంపై తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన త్యాగ చరిత్ర  కొండా లక్ష్మణ్ బాపూజీ దని పేర్కొన్నారు. 
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం  కొండా లక్ష్మణ్ బాపూజీ  ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. జిల్లాలోని గురుకుల హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనకు నిధులను కల్పించనున్నట్లు  పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 
బీసీ సంక్షేమ శాఖ అధికారి రామ్ రెడ్డి, కుల సంఘ నాయకులు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తు చేశారు.
సమావేశం అనంతరం  ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ  ఆశయాల సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి రవీందర్, జిల్లా అధ్యక్షుడు ఆనందం, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికిపండ్ల వేణు, కేడిసిసిబి డైరెక్టర్ కృష్ణ ప్రసాద్, శ్యాంసుందర్, తదితరులకు తో పాటు అధికారులు పాల్గొన్నారు.
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: