ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పర్యాటకం ద్వారానే అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని హనుమకొండ జిల్లా డీపీఆర్వో భానుప్రసాద్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 పురస్కరించుకొని శుక్రవారం హరిత హోటల్ లో పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి యం శివాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భాను ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డీపీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు వున్నాయని అన్నారు.వాటి అభివృద్ధికి కృషి చేస్తూ,పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం జరుగుతున్నదని అన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ మాట్లాడుతూ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో యువ టూరిజం క్లబ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో వరంగల్ యువ టూరిజం క్లబ్ రిజిస్ట్రేషన్ లో రెండవ స్థానంలో నిలవడం గొప్ప విషయం అని అన్నారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఖిలా వరంగల్ లో హెరిటేజ్ వాక్ మరియు పర్యాటక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. గంగాదేవి పల్లిలో కూడా పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహించామని తెలిపారు. అనంతరం హరిత హోటల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పర్యాటక రంగం ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం పర్యాటక రంగం, శాంతి అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు అయిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు.అనంతరం తాడురి రేణుకా శిష్య బృందంతో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. వల్స పైడి వ్యాఖ్యాతగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హరిత హోటల్ శ్రీనివాస్, అకౌంటెంట్ కుమారస్వామి, ప్రభుత్వ మార్కజీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జీ వీ రామారావు ఏన్ ఏస్ ఏస్ కోర్డినే టర్ శ్రీనివాస్ పర్యాటక సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: