ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నేరాల నియoత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ స్టేషన్‌లవారీగా నమోదైన కేసులు, దర్యాప్తు జరిగిన విధానం, చార్జీషీట్‌లు దాఖలు, కోర్టులో కేసులు ఏ దశలో ఉన్నాయన్న అంశాలపై ఎస్పీ పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు అప్రమత్తతో విధులు నిర్వర్తించాలని అన్నారు.
సమాజంలో పదే పదే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారితో పాటు , ప్రజలను మోసం చేసే వారి పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని, గంజాయి రవాణా, విక్రయాలపై నిఘా ఉంచాలన్నారు. దొంగతనాలు జరగకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని, నేరాలకు పాల్పడేవారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. అలాగే ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల ఆవశ్యకత పట్ల పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ బోనాల కిషన్, భూపాలపల్లి, కాటారం, వర్టికల్ డీఎస్పీలు, సంపత్ రావు, రాంమోహన్ రెడ్డి, నారాయణ నాయక్, జిల్లా పరిధిలోని ఇన్స్పెక్టర్లు, ఎస్సై లు పాల్గొన్నారు.
Post A Comment: