ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;





 ప్రముఖ ప్రజాకవి, పద్మ విభూషణ్  పురస్కార గ్రహీత కాళోజీ నారాయణరావు  పేరిట నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం  ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లను  సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.

బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కాళోజీ కళా క్షేత్రంలో నిర్మాణం పూర్తయిన వాటర్ ఫౌంటెన్, లాన్ , ఫోటో, ఆర్ట్ గ్యాలరీ, ఆడిటోరియం, ఆడిటోరియానికి సంబంధించిన ప్రొజెక్టర్ స్క్రీన్, సౌండ్ సిస్టం, విద్యుద్దీపాలు, వేదిక, కళాకారుల మేకప్ రూమ్, ర్యాంప్ లైట్స్, తదితర పనులను  కలెక్టర్ పరిశీలించి అధికారులకు, సంబంధిత నిర్మాణ సంస్థ ప్రతినిధులకు ఏర్పాట్లకి సంబంధించిన పనులపై పలు సూచనలు చేశారు.

ప్రారంభోత్సవ రోజున కార్యక్రమాల ఏర్పాట్లను గురించిన వివరాలను కూడా పిఓ అజిత్ రెడ్డి, హనుమకొండ ఆర్డిఓ  వెంకటేష్,  లను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం రోజున కార్యక్రమాల ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను చూసుకోవాలన్నారు. 

ఈ కార్యక్రమంలో కుడా ఈఈ భీమ్ రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: