ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమకొండ ఆదేశాల మేరకు జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ ఆధ్వర్యంలో విద్యార్థి పర్యాటక క్లబ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వి .రామారావు అధ్యక్షత వహించగా, శివాజీ
క్లబ్ ఉద్దేశం, లక్ష్యాలను విద్యార్థులకు వివరించారు .మన దేశంలోని వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవడం ,పర్యాటక రంగం పట్ల బాలబాలికల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ క్లబ్బులను ఏర్పాటు చేస్తున్నాయన్నారు .మర్కజి పాఠశాలలోని 20 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడితో జట్టును ఏర్పాటు చేసి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు .టూరిజం క్లబ్ పిల్లలకు వివిధ పోటీలు నిర్వహించడం ,పర్యాటక ప్రాంతాలను సందర్శింపజేయడం ,మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జివి రామారావు మాట్లాడుతూ ప్రపంచంలోని కొన్ని దేశాలు పర్యాటక రంగంపై ఆధారపడి బతుకుతున్నాయన్నారు .ప్రభుత్వ ఉద్దేశం విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ పర్యాటక అధికారి వంశీ పాఠశాల ఉపాధ్యాయులు వలస .పైడి, డాక్టర్ కే వాసు ,శ్రీనివాస్ రెడ్డి ,ఎడ్ల శ్రీనివాస్ ,వీరస్వామి, కిరణ్ కుమార్, కాంతయ్య ,రమాదేవి ,పద్మ , రజిత,సమ్మిరెడ్డి తదితర ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: