ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)వై. వి. గణేష్ అన్నారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణ పై వివిధ శాఖల అధికారులతో కూడిన కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, విద్య, ఎక్సైజ్, నార్కోటిక్స్, రైల్వే, జీఆర్పీ , తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గత నెల రోజులుగా మత్తు పదార్థాల నియంత్రణ కు తీసుకున్న చర్యలు, తీసుకోబోతున్న చర్యలపై ఆయా శాఖల అధికారులు వివరించారు.
అనంతరం డిఆర్ఓ వై.వి. గణేష్ మాట్లాడుతూ మత్తు పదార్థాల నియంత్రణకు వాటి మూలాలను తెలుసుకొని పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశమై మత్తు పదార్థాలు నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డిసిపి ఎస్. కె. సలీమా, డిఎంహెచ్వో డాక్టర్ లలితా దేవి, డిఐఈవో గోపాల్, పరకాల ఆర్డీవో డాక్టర్ కె. నారాయణ, నార్కోటిక్స్ డిఎస్పి సైదులు, కాజీపేట ఏసిపీ తిరుమల్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ రవి కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: