పెద్దపల్లి,గోదావరిఖని, మే,30,మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్,తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం పెద్దపల్లి జిల్లా,రామగిరి మండలం,ముస్త్యాల గ్రామంలోని శ్రీఅభయాంజనేయ హనుమాన్ ఆలయంలో ముస్త్యాల గ్రామశాఖ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు మంత్రి శ్రీధర్ బాబు జన్మదినం రోజు కేకు కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు గ్రామంలో స్వీట్లు పంపిణీ చేశారు,అంతకుముందు శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయములో మంత్రి ఆయురారోగ్యాలతో చల్లంగా ఉండాలని మంత్రి పేరుమీద అర్చనలు,అభిషేకాలు చేయించారు,అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో.గ్రామశాఖ అధ్యక్షుడు సుందిళ్ల కృష్ణ,ఉపాధ్యక్షుడు సుధమల్ల రాజమౌళి,జిల్లా ప్రధాన కార్యదర్శి సుందిళ్ల సురేష్,సీనియర్ నాయకులు మల్లారెడ్డి విజేందర్రెడ్డి,మచ్చ రవీందర్,గ్రామ ప్రధాన కార్యదర్శి జక్కుల యాదగిరి,యూత్ అధ్యక్షుడు జక్కుల రక్షిత్,నాయకులు సుంకరి పోతరాజు,సుందిళ్ల సంపత్,రత్న(ఓడేడ్)నాగరాజు,గుర్రం నరేష్,రామగిరి వెంకటరాజము,సుందిళ్ల చెర్రీ,కుదురుకోట కుమార్,రాములు,నరసయ్య రాజేష్ తదితరులు పాల్గొన్నారు...
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;హనుమకొండ జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా v. జ్యోతిర్మయి జోనల్ ఫుడ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ బృందంతో కలిసి పట్టణంలోని అరణ్య మరియు జంగల్ తీమ్ రెస్టారెంట్ నందు తనిఖీలు నిర్వహించారు. రిఫ్రిజిరేటర్ లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మైంటైన్ చేయకపోవడమ్, మరియు ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో భారీగా మాంసపు ఉత్పత్తులను నిలువ చేసి, హానికర ప్రమాదకరమైన రంగులను కలిపిన పన్నీరు, తుప్పు పట్టిన వంట పాత్రలను వంటలు తయారు చేయడానికి ఉపయోగించి ఫంగస్ బూజు పట్టిన కూరగాయలను గుర్తించడంతో హోటల్ యాజమాన్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పటికప్పుడే ప్రజల ఆరోగ్యానికి భంగం కలవకూడదని 26 కిలోల మాంసపు ఉత్పత్తులను ధ్వంసం చేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. బస్టాండ్ సమీపంలోని శ్రేయ హోటల్ నందు తనిఖీ చేయగా కృత్రిమ హానికరమైన రంగులను చికెన్ కబాబ్స్ మరియు తదితర మాంసపు ఉత్పత్తులకు మరియు తదితర ఆహార పదార్థాలలో కలిపి, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేసి అమ్ముతు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న సదరు హోటల్ యాజమాన్యంకు ఎఫ్ ఎస్ ఎస్ ఏ చట్టానికి సంబంధించిన నోటీసులను జారీ చేసి, సుమారు 11 కేజీల రంగు కలిపిన, బూజు పట్టిన చికెన్, ప్రిపేర్ ఫిష్ టిక్క,అపరిశుభ్ర వాతావరణంలో నిలువ ఉంచి, బొద్దింకలతో కూడిన ఇడ్లీ పిండి, బెల్లం, ధ్వంసం చేసి నోటీసులు అందజేయడం జరిగింది.అట్లాగే హన్మకొండ చౌరస్తాలోని అశోక హోటల్( కాకతీయ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ) ను తనిఖీ చేయగా హానికరమైన కృత్రిమ రంగులు కలిపిన ఆహారపదార్థాలను గుర్తించడంతోపాటు భారీగా రంగు డబ్బాలను, మళ్లీ మళ్లీ కాల్చిన రీ యూజుడ్ 10 లీటర్ల మంచి నూనెను, కాలం చెల్లిన కసూరి మేతి, ఎవరెస్టు చికెన్ మసాలాలు, కాల పరిమితి చెందిన సాస్ బాటిల్స్ ను గుర్తించి ధ్వంసం చేసి, అనుమానిత కల్తీ ఆహార పదార్థాలైన బ్యాచ్ నెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన 5,500 విలువగల 17 నూడుల్స్ ప్యాకెట్లను, 28 సోంపు ప్యాకెట్లను సీజ్ చేసి, శాంపుల్స్ తీసి ప్రయోగశాలకు తరలించడం జరిగింది. అలాగే ప్లాస్టిక్ కవర్లలో నిలువ ఉంచిన చికెన్ స్వాధీన పరుచుకుని, శాంపిల్ యొక్క రిజల్ట్ ఆధారంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం జరిగినది. హోటల్ యాజమాన్యానికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ మరియు FSSAI నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో హనుమకొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి వేణుగోపాల్ , వరంగల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సిహెచ్. కృష్ణమూర్తి, మహబూబ్ నగర్ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ p. మనోజ్ కుమార్, నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి. స్వాతి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలలో జూన్ 9న నిర్వహించే గ్రూప్ -1 పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ పై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జూన్ 9 న నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్ష కేంద్రాలలో ఏర్పాట్లకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా లో ఉన్న అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో పాటు పరీక్ష కేంద్రాల చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పర్యవేక్షించాలన్నారు. పరీక్ష పూర్తయ్యేంత వరకూ నిరంతర నిఘా తప్పనిసరి అన్నారు. పరీక్ష రాసే అభ్యర్థుల కోసం పరీక్ష కేంద్రాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కోరారు.
ఈ సమావేశం లో సెంట్రల్ జోన్ డిసీపీ ఎం. ఎ.భారీ , హనుమకొండ ఆర్డీవో వెంకటేష్ , ఆర్టీసీ డీఎం ధరం సింగ్, అన్ని పరీక్ష కేంద్రాల అధికారులు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో గంజాయి, ఇతర మత్తుమందు పదార్థాల నియంత్రణపై పోలీస్, నార్కోటిక్స్, విద్య, తదితర శాఖల అధికారులతో నెలవారి సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు.
జిల్లాలో గంజాయి, ఇతర మత్తుమందు పదార్థాల నియంత్రణకు తీసుకున్న చర్యలు, రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేపట్టనున్నారనే వివరాలను పోలీస్, నార్కోటిక్స్ తదితర శాఖల అధికారులు వివరించారు. ఆయా శాఖలు చేపట్టే చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ యువత, విద్యార్థులు మత్తు పదార్థాల భారీన పడకుండా పటిష్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్నారు. మత్తు పదార్థాల భారీన ఎవరు పడద్దని సూచించారు. టోబాకో, గంజాయి, తదితర మత్తు పదార్థాలకు బానిసయిన వారికి వైద్య సేవల కోసం 14416 టెలీ మానస్ నెంబర్ ను సంప్రదించవచ్చునని తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 20 బెడ్లతో రిహాబిలిటేషన్ సెంటర్ అందుబాటులో ఉందని. ఈ రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా బాధితులకు 30 రోజులపాటు ఉచిత వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్ శాఖకు చెందిన 7013036629 అనే నెంబర్ కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా పాఠశాలలు, కళాశాలలు పున ప్రారంభం కానున్న నేపథ్యంలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. పాఠశాలలో కళాశాలలో నిర్వహించే యాంటీ డ్రగ్స్ కమిటీల సమావేశాలకు పోలీసులను ఆహ్వానించాలని సూచించారు.
ఈ సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ భారీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జూన్ 4వ తేదీ నిర్వహించనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని జిల్లాలలో ఏర్పాట్లను జూన్ 1 లోపే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం ఆయన హైదరాబాద్ నుండి అదనపు సీఈవోలు సర్ఫ రాజ్ అహ్మద్ ,లోకేష్ కుమార్, డిప్యూటీ సీఈవో, పోలీస్ అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు(కలెక్టర్లు ),ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాలలో జిల్లా ఎన్నికల అధికారి తో పాటు, ఒక ఇన్చార్జి అధికారిని నియమించాలని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, గుర్తించిన వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించాలన్నారు. ఇందుకు సరైన విధంగా తనిఖీ చేయాలని, కౌంటింగ్ కేంద్రంలోకి ఎలాంటి రికార్డెడ్ డివైస్ లను అనుమతించవద్దని పేర్కొన్నారు. మీడియాకు మీడియా కేంద్రంలో ఎప్పటికప్పుడు రౌండ్ల వారిగా ఫలితాలు వెల్లడి చేసేలా అదనపు ఏఆర్వోలను నియమించాలని, మీడియాతో పాటు ప్రజలకు తెలిసే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, వివిధ రకాల ఫారాలను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
అంతకు ముందు అదనపు సీఈవోలు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాటు చేయనున్న టేబుల్లు ,రౌండ్లు, పోస్టల్ బ్యాలెట్, లెక్కింపు కేంద్రంలోకి అనుమతించేవారు, సీసీటీవీలు, రిపోర్టు లు, డిస్ప్లే, తదితర అంశాలపై సూచనలు చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల ఏఆర్వోలు డాక్టర్ కె. నారాయణ, వెంకటేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జూన్ 4వ తేదీన పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈసీఐ నియమ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని కౌంటింగ్ అధికారులకు, సిబ్బందికి హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, ఇతర సిబ్బందికి కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై
శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నమూనా ఈవీఎం ద్వారా కౌంటింగ్ సంబంధించిన నిర్వహణ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సంబంధించి జూన్ 4వ తేదీన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని కౌంటింగ్ కేంద్రాలలో కొనసాగే కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చూసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలన్నారు. కౌంటింగ్ లో ఎలాంటి జాప్యం లేకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబంధిత ఏఆర్వోలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల ఏఆర్వోలు డాక్టర్ కె. నారాయణ, వెంకటేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే మంగళవారం తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు రైతులకు అమ్మితే పీడీ యాక్టు నమోదుచేసి జైలుకు పంపిస్తామని, విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. రైతులను మోసం చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, నిల్వ చేసినా, రవాణా చేసిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హెచ్ టి కాటన్ విక్రయాలకు అనుమతి లేదన్నారు. కొనుగోలు చేసిన విత్త నాలు, ఎరువులు, పురుగు మందులకు రైతులు డీలర్ల నుండి రశీదులు తీసుకోవాలని సూచించారు. నకిలీ పత్తి విత్తనాలు ఉపయోగిస్తే భూసారం దెబ్బతింటుందని, ప్రభుత్వం ఆమోదించిన పత్తి విత్తనాలు మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని ఎస్పి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల సమాచారం తెలిస్తే వెంటనే వ్యవసాయ అధికారులు గాని పోలీస్ అధికారులు గాని తెలియజేయాలని తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ హనుమకొండ జిల్లాలో సోమవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు సాగింది. జిల్లాలో పట్టభద్రులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. జిల్లాలో పోలింగ్ శాతం 72.16% నమోదయినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ అనంతరం పోలీసు భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులు, ఇతరు ఎన్నికల సామగ్రిని ఎన్నికల అధికారులు, సిబ్బంది హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని రిసెప్షన్ కేంద్రానికి తీసుకువచ్చారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వారిగా బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని రిసెప్షన్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది అప్పగించారు. జిల్లా ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారులు సిబ్బంది సమష్టి కృషితో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జిల్లాలో ప్రశాంతంగా జరిగింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని స్ట్రాంగ్ రూములలో భద్రపరచగా హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం తనిఖీ చేశారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు.
కాగా సాధారణ తనిఖీలలో భాగంగా కలెక్టర్ పరిశీలించి స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ, తదితర ఏర్పాట్లను గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ తహసిల్దార్ విజయ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఈ నెల 27వ తేదీన జరగనున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
సోమవారం హనుమకొండ కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నికకు సంబంధించి జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, వైద్యం తదితర సదుపాయాలను సిద్ధం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, డిఆర్వో వై.వి.గణేష్, పరకాల, హనుమకొండ ఆర్డీవోలు డాక్టర్ కె. నారాయణ, వెంకటేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కాజిపేట, హనుమకొండ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపడుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ గురువారం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్లు, ఇతర మైనర్ రిపేర్లు ఈనెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. పూర్తి చేసిన పనులకు సంబంధించి పనులు పూర్తయినట్లు ధృవీకరణ పత్రం అందజేయాలన్నారు. పాఠశాలల్లో అభివృద్ధి పనులకు సంబంధించి క్రిటికల్ స్ట్రక్చర్స్ ఏవైన ఉన్నట్లయితే వాటి పనులను 25వ తేదీ లోగా పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, డీఈవో డాక్టర్ అబ్దుల్ హై, ఈఈ లు రాజయ్య, సంజయ్ కుమార్, డి ఈ లు సంతోష్ బాబు, రవికుమార్, శివానంద్, పలువురు ఏఈలు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;నయీమ్ నగర్ నాలాతో పాటు నాలాపైన ఉండే వంతెనల అభివృద్ధి నిర్మాణ పనులను జూన్ 15వ తేదీ నాటికి పూర్తి చేసేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా లతో కలిసి నయీమ్ నగర్ నాలా నిర్మాణ పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై రెవెన్యూ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, సర్వే విభాగం, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు.
నాలా అభివృద్ధి పనుల పురోగతి, ఎప్పటి వరకు అభివృద్ధి పనులను పూర్తి చేస్తారనే వివరాలతో పాటు నిర్మాణ పనులలో ఎదురవుతున్న ఇబ్బందుల పై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ నాలా అభివృద్ధి పనులను
త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. నాలా అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎన్నికలు ముగిసినందున ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని వెంటనే పరిష్కరించి నాలుగైదు రోజుల్లో నిర్మాణ పనులను ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా పనులను పూర్తి చేయాలన్నారు. నాలా పనులకు సంబంధించి సర్వే పూర్తి చేయాలన్నారు. మూడు రోజుల్లో సర్వే పనులను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. సర్వే అనంతరం ఈ పనులపై మరోసారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ రాజయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి వెంకన్న, ఇరిగేషన్ ఈ ఈ ఆంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఈ నెల 27వ తేదీన జరుగనున్న వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారులు లోకేష్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు.
బుధవారం హైదరాబాద్ నుండి పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహణ ప్రక్రియపై వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా లోకేష్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ జంబో బ్యాలెట్ బాక్స్ లు, అదనపు బాలెట్ బాక్స్ లు సిద్ధం చేయాలని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ లకు యూనిక్ నెంబర్లు వేయాలని అన్నారు. ప్రతి రోజు ఎన్నికల ప్రవర్తనా నియమావళి నివేదిక అందజేయాలని అన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. విధులు కేటాయించిన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 32 జంబో బాక్సులు, 234 పెద్ద బాక్సులు సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి , డిపిఓ లక్ష్మీ రమాకాంత్, ఆర్డీవోలు డాక్టర్ కే నారాయణ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూములలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలలో వినియోగించిన ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని భద్రపరచగా హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం తనిఖీ చేశారు.
హనుమకొండ జిల్లా పరిధిలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ పరిశీలించి అక్కడి రికార్డులను తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.
పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల షట్టర్ల తాళాలకు వేసిన సీళ్ల ను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి భద్రపరిచిన స్ట్రాంగ్ రూములకు సంబంధించిన లాగ్ బుక్ లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఉన్న సీసీ కెమెరాల పర్యవేక్షణకు సంబంధించిన వాచ్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించారు.
పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములు, భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ వివరాలను ఆయా నియోజకవర్గాల ఏఆర్వోలు డాక్టర్ కె.నారాయణ, వెంకటేష్ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తహసిల్దార్లు విజయ్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
లోక్ సభ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పి పేర్కొన్నారు. 1000 మంది జిల్లా, (TSSP , శిక్షణ కానిస్టేబుళ్లు)మరియు కేంద్ర (3 కంపేనీల CRPF, BSF బలగాల) పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పి గారు వెల్లడించారు. ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు, రూట్ మొబైల్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRT)/ స్ట్రయికింగ్ ఫోర్స్/ స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్/ లతో పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు.
స్వాధీన పరుచుకున్న వివరాలు :
ఇప్పటివరకు స్వాధీనపరచుకున్న నగదు 4780160/- రూపాయలు.
లిక్కర్ 3770 లీటర్లు సీజ్ చేయడం జరిగింది.
జిల్లాలో ఇప్పటివరకు బైండోవర్ చేయబడిన చేయబడిన వ్యక్తులు 451.
లైసెన్సుడు ఆయుధముల డిపాజిట్:.... ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియామవళి అనుసారంగా జిల్లాలో లైసెన్సు కలిగిన మొత్తం 8 ఆయుధాలను డిపాజిట్ చేశారు.
జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో, ఎలాంటి భయం, వత్తిడి లేకుండా ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని, అందుకు ప్రజలకు తగిన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగినదని, ఓటు ఉన్న అందరు ఓటు వేయాలని ఎస్పీ గారు కోరారు .ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తరలింపు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి భయం లేకుండా ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే కోరారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఈనెల 13వ
తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం సాయంత్రం పరిశీలించారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఎన్నికల సిబ్బంది, పోలింగ్ సామగ్రి, తదితర ఏర్పాట్లను గురించి అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి, వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల ఏఆర్వోలు వెంకటేష్, డాక్టర్ కె. నారాయణలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామగ్రిని అందజేసేటప్పుడు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.
ఎన్నికల విధులలో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి తాగునీరు, టీ, భోజనం, తదితర సౌకర్యాలను సిద్ధం చేయాలన్నారు.
ఈ సందర్భంగా తహసిల్దార్లు విజయ్ కుమార్, భాస్కర్, జగన్ మోహన్ రెడ్డి, రాజ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఈనెల 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని ఎన్ఐసీ హాల్ లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది మూడో ర్యాండమైజేషన్ ప్రక్రియను శనివారం నిర్వహించారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ సమక్షంలో వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఎన్నికల సిబ్బంది కేటాయింపునకు సంబంధించిన మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వర్తించే ఎన్నికల సిబ్బంది జాబితాను ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆయా జిల్లాల కలెక్టర్లు అందజేశారు.
ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, రిజ్వాన్ భాషా షేక్, భవేష్ మిశ్ర, అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని భూపాలపల్లి నియోజక వర్గంలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ , బిఎస్ ఎఫ్ కేంద్ర బలగాలు, పారెస్ట్, టిఎస్ ఎస్పీ శిక్షణ కానిస్టేబుళ్లకు జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాల్లో శనివారం ఎస్పి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లో వద్ద నిర్వర్తించాల్సిన విధులు, పొలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పి వివరించారు. పోలీసు అధికారులు సిబ్బందికి ఏదైనా సందేహాలు ఉంటే పై అధికారుల వద్ద తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల సంఘం నిర్ణయించిన సమయం ప్రకారం ఈనెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుందని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలను 100 మీటర్ల పరిధిలో గుమిగూడకుండ చూడాలని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పోలింగ్ కేంద్రంలోకి ఓటరు స్లిప్పులు, జిల్లా ఎన్నికల అధికారి అనుమతి పొందిన ఐడి కార్డులు ఉన్న వారిని మాత్రమే అనుమతించాలన్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఓ.ఆర్.ఎస్ మంచినీటిని ఎక్కువగా తాగుతూ పోలిసు, వివిధ విభాగాల ఎన్నికల సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాలు, మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని ఎస్పి పేర్కొన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీయంలను స్ట్రాంగ్ రూముల వరకు పోలీసులు తరలించాలని ఎస్పి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ ఏ. సంపత్ రావు, సైబర్ క్రైమ్ డిఎస్పీ సుభాష్ బాబు, బిఎస్ ఎఫ్ అసిస్టెంట్ కమాన్డెంట్ అజయ్, భూపాలపల్లి, చిట్యాల సిఐ లు నరేష్ కుమార్, మల్లేష్, ఎలక్షన్ సెల్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్బీ ఇన్ స్పెక్టర్ వసంత్ కుమార్, రిజర్వు ఇన్ స్పెక్టర్లు నగేష్, కిరణ్, శ్రీకాంత్, రత్నం, సీఆర్పీఎఫ్ , బిఎస్ ఎఫ్ ఎస్సై లు, భూపాలపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దపల్లి గోదావరిఖని, మే11, టీవీన్యూస్ఛానల్ రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాలకు చెందిన ప్రింటు &ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు పార్లమెంట్ ఎన్నికల వేళ పోలీసులు నిర్వహించవలసిన పనితీరు శనివారం వర్క్ షాప్ నిర్వహించిన రామగుండం సిపి ఎం శ్రీనివాస్..భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని పోలీసు,అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ,ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసే ఎలాంటి వస్తువులను సరఫరా చేయకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరపడానికి రామగుండము పోలీస్ కమీషనరేట్ యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉందని ఎన్నికల నిర్వాహణకు సంబంధించి,ఎన్నికల వేళ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ అన్నిరకాల ప్రణాళికలు ఏర్పాటు చేసామని రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.మీడియా సమావేశంలో తెలిపారు,ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్,స్ట్రాజి కల్ సర్వలెన్స్ టీమ్స్,కండక్ట్ కోడ్ టీమ్స్,అలాగే స్టారికల్ సర్వేలెన్సు టీమ్స్ చెక్ పోస్ట్లు,ఏర్పాటు చేసి అక్కడ సివిల్ పోలీస్,స్టాటికల్ సర్వేలెన్ సిబ్బంది,కేంద్ర సిఐఎస్ఎఫ్ బలగాలు 24 గంటలు వాహనాల తనిఖీ నిర్వహింస్తున్నారు.రామగుండం కమిషనరేట్ లో ఉన్న అధికారులు,సిబ్బంది,మహిళా సిబ్బంది,కమీషనరేట్ స్థానిక సాయుధ బలగాలు,హోంగార్డులు,ట్రైనింగ్ కానిస్టేబుళ్లు,ట్రైనింగ్ సిబ్బంది,కేంద్ర బలగాలు బిఎస్ఎఫ్,సీఆర్పిఎఫ్,మొత్తం అధికారులు సిబ్బందితో లోక్ సభ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఈ సందర్భంగా,సిపి మాట్లాడరు,లోకసభ ఎన్నికలకు సర్వంసిద్ధం చేసినట్లు తెలిపారు.ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని,సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో కేంద్ర పారామిలిటరీ దళాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు పారదర్శకం నిష్పాక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామనన్నారు.ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి ప్రతిరోజు తనిఖీలు నిర్వహింస్తూనట్టు, తెలిపారు,ఎన్నికల కోడ్ అమలు నుండి ప్రేరేపిత రహిత ఎన్నికల నిర్వహణలో జప్తు చేసినవి,రూ1,79,23,892-నగదు.రూ 81,02,691- విలువ గల
1.042 బంగారం,రూ 6.734 వెండి స్వాధీనం.రూ4,17,775-విలువ చేసే 11.211 కిలోల గంజాయి స్వాధీనం.మద్యం-2845.73 లీటర్లు,పటిక-23 కిలోలు,బెల్లం-22 కిలోలు స్వాధీనం.వీటి విలువ రూ15,03,069/-671కేసుల్లో 1444 మందిని 107సిఆర్.పిసి110సిఆర్ పిసి,151సిఆర్.పిసి సెక్షన్స్ కింద బైండోవర్131ఎన్ డబ్ల్యుఇలు అమలు.ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ లు1,ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ లు11,ఎస్ఎస్ టీమ్స్16,ఎఫ్ఎస్టి,టీమ్స్ 17,మొత్తం పోలీంగ్ కేంద్రాలు1568,క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు179నార్మల్ పోలింగ్ స్టేషన్లు 1372,పోలింగ్ లొకేషన్లు 905,క్రిటికల్ పోలింగ్ లోకేషన్లు76నార్మల్ పోలింగ్ లొకేషన్లు 813 ఎల్ డబ్ల్యూఈ పోలింగ్ స్టేషన్లు17 లోకేషన్లు16రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 85 ఆయుధాల లైసెన్స్ కలిగిన వారు,వీరిలో (51)మంది ఆయా పోలీస్ స్టేషన్లలో ఆయుధాలను డిపాజిట్ చేశారు.ఇందులో బ్యాంకు సెక్యూరిటీ సిబ్బందికి మాత్రమే మినహాయింపు కలదు..ఫ్లాగ్ మార్చ్ పట్టణాలలో గ్రామాలలో 26 నిర్వహించినట్టు తెలిపారు,రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో 1903 నాఖబంది కార్యక్రమాలు నిర్వహించారు,10 కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాములు,12 ఏరియా డామినేషన్స్,సిఆర్పిఎఫ్,బిఎస్ఎఫ్ కలిపి ఐదు కంపెనీ 443 మంది,పెట్రోలింగ్ పార్టీలు,క్విక్‌రియాక్షన్ విభాగాలు,స్ట్రెకింగ్ ఫోర్స్,స్పెషల్ స్ట్రెకింగ్ ఫోర్స్ బృందాలను ఎర్పాటు చేసిన ఎన్నికల ప్రవర్తన నియామవళిని పటిష్టంగా అమలు చేయడానికి ఏర్పాటు చేసినట్లుగా పోలీస్ కమిషనర్ తెలిపారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు,గ్రామాల్లో ఎన్నికలపై గ్రామాల ప్రజలకు పోలీసు కళాబృందం ద్వారా జానపద కథలు,నాటకాలు,పాటల ద్వారా ప్రజలకు ఓటు హక్కు గురించి,వారు నిర్భయంగా ఓటు వేయడానికి శాంతియుత వాతావరణాన్ని కలిపించడం కోసం పోలీస్ వారు తీసుకుంటున్న చర్యల గురుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు,ఓటు వజ్రాయుధమని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గోప్పదని,ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్చందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ సూచించడంతో పాటు ఎన్నిక ప్రవర్తన నియామవళిని అతిక్రమించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.ఈ మీడియా వర్క్ షాప్ కార్యక్రమంలో,అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు,స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు,ఏఆర్ ఏసీపీ లు ప్రతాప్,సురేంద్ర,పెద్దపెల్లి మంచిర్యాల జిల్లాల సంబంధించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు...
హన్మకొండ (పబ్లిక్ న్యూస్ ) మే 11: కాకతీయ యూనివర్సిటీ టూరిజం & హిస్టరీ విభాగ అధిపతిగా డా. రాజకుమార్ ప్రమోషన్ పొంది భాద్యతలు స్వీకరించిన సందర్భంగా గురువర్యులైన డా. రాజకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలపడం తో పాటుగా శాలువాతో సన్మానించడం జరిగింది జరిగింది. యూనివర్సిటీ విద్యార్ధిలు పాల్గొన్నారు. దూడపాక అశోక్ తో పాటుగా పృధ్వీరాజ్, రాకేష్, సాయికుమార్, అనిల్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్నందున పోలింగ్ నిర్వహణకు అంతా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.
శుక్రవారం హైదరాబాద్ లోని ఎన్నికల కార్యాలయం నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు (కలెక్టర్లు), ఇతర ఎన్నికల అధికారులతో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ పోలింగ్ కు 78 గంటల ముందు, 48 గంటల ముందు చేయవలసిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, ఆదేశాలపై దృష్టి సారించాలన్నారు. ఎన్నికలకు రిపోర్టులను సకాలంలో పంపించాలన్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్నందున వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యలపై సమాధానాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించాలన్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్నందున మద్యం, డబ్బు వంటివి పంపిణీ చేయకుండా వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. చెక్పోస్టుల వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధింపు ఉంటుందని అన్నారు. 48 గంటల ముందు నుండి ఎలాంటి లౌడ్ స్పీకర్లకు అనుమతించవద్దని, ఎంసీఎంసీ ద్వారా మంజూరు చేసే రాజకీయ ప్రకటనల అనుమతులు తక్షణం జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్లు, తదితర సదుపాయాలతో పాటు పోలింగ్ సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అన్నారు. పోలీసు సిబ్బందితోపాటు కేంద్ర బలగాలతో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ రోజున ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలకు జిపిఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు. పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలను డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి పోలింగ్ కేంద్రాలకు, పోలింగ్ అనంతరం స్ట్రాంగ్ రూములకు తరలింపుజరగాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, సెంట్రల్ జోన్ డీసీపీ ఎం.ఎ. భారీ, డీఆర్వో
వై.వి. గణేష్, జడ్పీ సీఈవో విద్యాలత, డి ఆర్ డి ఓ నాగ పద్మజ, పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల ఏఆర్వో లు డాక్టర్ కె. నారాయణ, వెంకటేష్, అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా స్వీప్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలను చేపట్టినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
గురువారం సాయంత్రం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ వివిధ శాఖల సమన్వయంతో స్వీప్ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా మెప్మా, డిఆర్డిఏ, పరిశ్రమల శాఖల సహకారంతో గత నెల రోజులకు పైగా స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మే 13న తెలంగాణలో జరగనున్న నాలుగో దశ పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, షేడ్ నెట్లను , ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్లకు వసతులను కల్పిస్తున్నామని, ఓటు కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల ఉండే ఓటర్లకు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తీసుకురావాలని పేర్కొన్నారు.
సాంస్కృతిక కళాకారులు, మహిళా సంఘాల ప్రతినిధులు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ చుట్టూ ర్యాలీని నిర్వహించారు. సమావేశం అనంతరం ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేస్తామని, తమ చుట్టుపక్కల ఉన్న ఓటర్లను ఓటు వేసే విధంగా చైతన్యవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, డిఆర్డిఓ నాగ పద్మజ, అదనపు నోడల్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎం.హరిప్రసాద్, జిల్లా సంక్షేమ అధికారి మధురిమ, ఇతర అధికారులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణను విజయవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
గురువారం సాయంత్రం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సెక్టార్ అధికారులకు, పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కౌంటర్ల ఇన్చార్జిలకు, సంబంధిత జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఎన్నికలకు సిబ్బందికి కేటాయించిన ఈవీఎంలను తీసుకునేటప్పుడు, పోలింగ్ నిర్వహణ అనంతరం తిరిగి ఇచ్చేటప్పుడు అన్నింటి వివరాలని సరి చూసుకోవాలని అన్నారు. మూడు బ్యాలెట్ యూనిట్లు ఉన్నందున వాటికి సంబంధించి జాగ్రత్తగా సరి చూసుకోవాలని సూచించారు. కౌంటర్ల నుండి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఏ సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల విధులలో పాల్గొనే ప్రతి ఒక్కరు వేసవి దృష్ట్యా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమన్వయంతో ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వంద శాతం వెబ్ కాస్టింగ్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా ఆదనపు కలెక్టర్ ఎ.వెంకటరెడ్డి, పరకాల, హనుమకొండ నియోజకవర్గాల ఏఆర్వో లు డాక్టర్ కె.నారాయణ, వెంకటేష్, తహసీల్దార్లు రాజ్ కుమార్, నాగరాజు, జ్యోతి వరలక్ష్మి దేవి, రియాజుద్దీన్, జగన్ మోహన్ రెడ్డి, డిఏఓ విజయలక్ష్మి, జిల్లా అధికారులు, సెక్టార్ అధికారులు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల ఇన్చార్జీలు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పోలింగ్ రోజున స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ తెలిపారు.
గురువారం హన్మకొండ లోని అంబేద్కర్ భవన్ లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో విధులు నిర్వర్తించే మైక్రో అబ్జర్వర్ల కు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు
బండారి స్వాగత్ రణ్వీర్ చంద్
జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్ తో కలసి పాల్గోన్నారు.
ఈ సందర్బంగా సాధారణ ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ, ఈ నెల 13న జరగె సాధారణ లోకసభ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా మైక్రో అబ్జర్వర్లకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలోని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని, మైక్రో అబ్జర్వర్లు వారి విధులను అంకితభావంతో నిర్వహిస్తునే పోలింగ్ బృందం తో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైన మేరకు మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ టీం కు తగు సూచనలు చేయవచ్చునని తెలిపారు. పోలింగ్ ఆరంభం నుండి ముగిసే వరకు జరిగిన సంఘటనలు అన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని, ఓటింగ్ తరువాత ఓటరు తన ఓటు ఎవరికి వేసాననే రహస్యాన్ని బయటపెట్టకుండా చూడాలని, వారికి కేటాయించిన క్రిటికల్ పోలింగ్ కేంద్రంలో వసతులు ఉండేలా చూడాలని, మైక్రో ఆబ్జర్వర్ లు నిర్దేశించిన 18 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని, అట్టి అంశాల పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్ లకు పి పి టి పట్ల కనీస అవగాహన ఉండాలని, పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ఫారం ను పూరించి నిర్దిష్ట గడువు లోగా అందజేయడం తో పాటు గుర్తింపు కార్డ్ ప్రతిని జత చేసి అందజేయాలని, ఎన్నికల విదుల తో పాటు కౌంటింగ్ సందర్భం లో కూడా మైక్రో అబ్జార్వర్ ల సేవలను వినియోగించుకుంటామని ఈ సందర్భం గా తెలిపారు.
ఈ సందర్భం గా శిక్షకులు మైక్రో ఆబ్జార్వర్ లకు వారు నిర్వర్తించు విధి, విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి బాల కృష్ణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ హావేలి రాజు, మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాస్
తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
లోక్ సభ ఎన్నికలలో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాలో పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
ఈనెల 13న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించారు.
ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల వద్ద చేస్తున్న ఏర్పాట్లను పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పరకాల, వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గాల ఏఈఆర్వోలు డాక్టర్ కె. నారాయణ, వెంకటేష్ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద పోలింగ్ అధికారులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలను కల్పించాలని ఏఈఆర్ఓలను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి తాగునీరు, భోజన, రవాణా, తదితర ఏర్పాట్లను చేయాలన్నారు.
ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల పంపిణీ, రిసెప్షన్ కేంద్రాల వద్ద కల్పించాల్సిన వివిధ సదుపాయాలను గురించి కలెక్టర్ ఏఈఆర్వోలకు పలు సలహాలు సూచనలు చేశారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ జిల్లా లోని పోలీస్ అధికారులు సిబ్బందితో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్లో వారిగా , క్రిటికల్, ఎల్డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతాల పోలింగ్ స్టేషన్లో తీసుకుంటున్నటువంటి భద్రత చర్యల గురించి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ యస్.హెచ్.ఒ. లు తమ ఏరియాలో గల క్రిటికల్, మావో ప్రభావిత పోలింగ్ స్టేషన్ లను ప్రత్యేకంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన వారిపై ప్రత్యేక నిఘా వుంచాలన్నారు. పోలింగ్ డే కు ముందు రోజు 48 గంటలపాటు తమ తమ ఏరియాలలో గల వైన్ షాప్స్, క్లోజ్ చేయించాలని, ఇంటింటి ప్రచారాలు, క్యాంపెనింగ్ వెహికల్స్ తిరగకుండా చూసుకోవాలని అన్నారు. ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, బ్యానర్లు, లేకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా ఓటు హక్కు లేని స్థానికేతరులు, ఎన్నికలు జరిగే నియోజకవర్గం లో ఉండడానికి వీలు లేదని, అందుకుగాను తమ ఏరియాలో గల లాడ్జీలను చెక్ చేయాలని సూచించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలను ప్రభావితం చేసే ఎలాంటివి కూడా అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖి చేయాలని ఎస్పి అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల బందోబస్తు కోసం వచ్చిన సిబ్బందికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని ఎస్.హెచ్.ఒ. లకు, సిఐలకు సూచించారు
అదే విధంగా ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొబైల్ రూట్ లలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే క్షణాలలో లోకల్ ఎస్సై, సెక్టోరల్ అధికారి, రూట్ మొబైల్ టీమ్ లు అక్కడకు చేరుకొని సమస్యను పరిష్కరించగలగాలని అందుకు లోకల్ ఎస్సై, రూట్ మొబైల్ ఇంచార్జి, సెక్టొరల్ అధికారి కమ్యూనికేషన్ లో ఉంటూ కో ఆర్డినేషన్ చేసుకోవాలని తెలియజేశారు.
ఆయా పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు, మొబైల్ రూట్ ఇంచార్జి లు సంబంధిత రూట్ సెక్టోరల్ అధికారి కంటాక్ట్ మొబైల్ నంబరు తప్పనిసరిగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు సంబందించి సమస్య తలెత్తితే ఎస్సై లు, నియోజకవర్గం వారిగా ఉన్న పోలీస్ నోడల్ అధికారికి తెలియజేయాలని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో గల పోలింగ్ కేంద్రాలకు స్పెషల్ పార్టీ మరియు గ్రీహౌండ్స్ దళాల ద్వారా ఏరియా డామినేషన్ నిర్వహించాలని తెలియజేశారు. ఆయా రూట్ లలో ఉన్న మొబైల్ పార్టీలు ఒకే చోట ఉండకుండా తమ రూట్ లలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలను అబ్జర్వ్ చేస్తు పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ మంది గుమికూడకుండ చూసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు వచ్చి వెళ్లే దారిని క్లియర్ గా ఉండేలా చూసుకోవాలని తెలియజేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సౌకర్యాల కొరత ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎండాకాలంను దృష్టిలో ఉంచుకొని ఓటర్లు ఎక్కువగా ఉండే పోలింగ్ కేంద్రాలలో టెంట్లు, త్రాగునీటి సదుపాయం, ర్యాంప్ కూడ ఏర్పాటు చేయించాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కాకతీయ యూనివర్సిటీకి సమ్మర్ సెలవులు ప్రకటిస్తే పరిపాలన భవనం ముట్టడిస్తామని ABSF యూనివర్సిటీ ఇన్చార్జి మచ్చ పవన్ కళ్యాణ్ అన్నారు గురువారం రోజున కాకతీయ యూనివర్సిటీ లోని క్యాంటీన్ దగ్గర ABSF ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్ధాంతరంగా వేసవి సెలవులు ప్రకటిస్తూ అదే సెలవుల్లో మళ్లీ ఆన్లైన్ తరగతులు అని కాకతీయ యూనివర్సిటీ పాలకులు కొత్త పాట పాడుతున్నారని విమర్శించారు రానున్నది పోటీ పరీక్షల సమయమని ఈ సమయాల్లో యూనివర్సిటీలో చదివేటటువంటి విద్యార్థులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని ఇలాంటి సమయంలో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించడం అనేది వారి యొక్క ప్రిపరేషన్ పై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని అన్నారు అలాగే సెలవులు ప్రకటించినప్పుడు మళ్లీ ఆన్లైన్ తరగతులు ఎందుకని ప్రశ్నించారు ఆన్లైన్ తరగతులు అనేవి కేవలం సిలబస్ పూర్తయిందని చెప్పుకోవడానికి నామమాత్రపు తరగతుల నిర్వహణ గా మాత్రమే ఉపయోగపడతాయని విమర్శించారు ఇప్పటికే ఎన్నోసార్లు అర్ధాంతరంగా తమ సొంత ప్రయోజనాల కొరకు సెలవులను ప్రకటిస్తూ యూనివర్సిటీలను బందు పెడుతూ విద్యార్థులు ఇంటి దగ్గర ఉండగానే ఆ సెలవులను పొడిగిస్తూ విద్యార్థుల యొక్క అకాడమిక్ క్యాలెండర్ పై వారు తలగతులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచారని అన్నారు ఇప్పటికైనా యూనివర్సిటీ పాలకులు వేసవి సెలవులపై పునర్ ఆలోచన చేయాలి బే షరతుగా యూనివర్సిటీని ఎండాకాలం మొత్తం నడపాలని డిమాండ్ చేశారు ఒకవేళ విశ్వవిద్యాలయానికి సెలవులు ప్రకటిస్తే పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామని యూనివర్సిటీ అధికారులను ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో absf నాయకులు దార సురేష్ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు నరేందర్ ఉపాధ్యక్షులు తేజ తదితరులు పాల్గొన్నారు.