పెద్దపల్లి,గోదావరిఖని,మే,1(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)పెద్దపల్లి జిల్లా"ఖని"చౌరస్తాలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం 138వ మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించి మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడరు,అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని దినం కోసం అనేకమంది కార్మికులు హక్కుల కోసం రోడ్ల మీదికి వచ్చి నిరసనలుచేస్తున్నటువంటి తరుణంలో అప్పటి యజమాన్యాలు రాజ్యం కార్మికులపైకి బాష్పవాయువు లాటీలు తూటాలతో అనేక మందిని చంపినారు.అమరులు కార్మిక వీరులు చిందించిన నెత్తురు ఎర్రజెండా అయినా సందర్భంలోనే 8 గంటల పనిదినం నాటినుంచి నేటివరకు కొనసాగుతుంది అని అన్నారు,ఇప్పుడు ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ కార్పొరేట్ సంస్థలను ఆహ్వానిస్తూ ప్రైవేటు కరణకు ఆజ్యం పోస్తున్నాయి.ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం అందరూ ఐక్యతతో ముందుకు సాగుతూ కార్మికుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి సంబంధించి కార్మిక కార్మిక కర్షక విద్యార్థి మేధావి సబ్బండ వర్గం భారత ప్రజలంతా ఐకమత్యంతో ప్రైవేటుకరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.చికాగో అమరవీరులకు జోహార్లు అంటూ నినాదించి,గేయాలు ఆలకించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు టీజే పాల్ సింగ్,అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పులిపాక రమేష్,తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి(బేగ్.oc5)పోగుల శేఖర్,బిరియాల్ వెంకటేష్,తెలంగాణ జనగామ శంకర్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: