కాకతీయ యూనివర్సిటీకి సమ్మర్ సెలవులు ప్రకటిస్తే పరిపాలన భవనం ముట్టడిస్తామని ABSF యూనివర్సిటీ ఇన్చార్జి మచ్చ పవన్ కళ్యాణ్ అన్నారు  గురువారం రోజున కాకతీయ యూనివర్సిటీ లోని  క్యాంటీన్ దగ్గర ABSF ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్ధాంతరంగా వేసవి సెలవులు ప్రకటిస్తూ అదే సెలవుల్లో మళ్లీ ఆన్లైన్ తరగతులు అని కాకతీయ యూనివర్సిటీ పాలకులు కొత్త పాట పాడుతున్నారని విమర్శించారు రానున్నది పోటీ పరీక్షల సమయమని ఈ సమయాల్లో యూనివర్సిటీలో చదివేటటువంటి విద్యార్థులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని ఇలాంటి సమయంలో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించడం అనేది వారి యొక్క ప్రిపరేషన్ పై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని అన్నారు అలాగే సెలవులు ప్రకటించినప్పుడు మళ్లీ ఆన్లైన్ తరగతులు ఎందుకని ప్రశ్నించారు ఆన్లైన్ తరగతులు అనేవి కేవలం సిలబస్ పూర్తయిందని చెప్పుకోవడానికి నామమాత్రపు తరగతుల నిర్వహణ గా మాత్రమే ఉపయోగపడతాయని విమర్శించారు ఇప్పటికే ఎన్నోసార్లు అర్ధాంతరంగా తమ సొంత ప్రయోజనాల కొరకు సెలవులను ప్రకటిస్తూ యూనివర్సిటీలను బందు పెడుతూ విద్యార్థులు ఇంటి దగ్గర ఉండగానే ఆ సెలవులను పొడిగిస్తూ విద్యార్థుల యొక్క అకాడమిక్ క్యాలెండర్ పై వారు తలగతులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచారని అన్నారు ఇప్పటికైనా యూనివర్సిటీ పాలకులు వేసవి సెలవులపై పునర్ ఆలోచన చేయాలి బే షరతుగా యూనివర్సిటీని ఎండాకాలం మొత్తం నడపాలని డిమాండ్ చేశారు ఒకవేళ విశ్వవిద్యాలయానికి సెలవులు ప్రకటిస్తే పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామని యూనివర్సిటీ అధికారులను  ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో absf నాయకులు దార సురేష్ కాకతీయ  యూనివర్సిటీ అధ్యక్షులు నరేందర్ ఉపాధ్యక్షులు  తేజ  తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: