ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణను విజయవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
గురువారం సాయంత్రం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సెక్టార్ అధికారులకు, పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కౌంటర్ల ఇన్చార్జిలకు, సంబంధిత జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఎన్నికలకు సిబ్బందికి కేటాయించిన ఈవీఎంలను తీసుకునేటప్పుడు, పోలింగ్ నిర్వహణ అనంతరం తిరిగి ఇచ్చేటప్పుడు అన్నింటి వివరాలని సరి చూసుకోవాలని అన్నారు. మూడు బ్యాలెట్ యూనిట్లు ఉన్నందున వాటికి సంబంధించి జాగ్రత్తగా సరి చూసుకోవాలని సూచించారు. కౌంటర్ల నుండి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఏ సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల విధులలో పాల్గొనే ప్రతి ఒక్కరు వేసవి దృష్ట్యా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమన్వయంతో ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వంద శాతం వెబ్ కాస్టింగ్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా ఆదనపు కలెక్టర్ ఎ.వెంకటరెడ్డి, పరకాల, హనుమకొండ నియోజకవర్గాల ఏఆర్వో లు డాక్టర్ కె.నారాయణ, వెంకటేష్, తహసీల్దార్లు రాజ్ కుమార్, నాగరాజు, జ్యోతి వరలక్ష్మి దేవి, రియాజుద్దీన్, జగన్ మోహన్ రెడ్డి, డిఏఓ విజయలక్ష్మి, జిల్లా అధికారులు, సెక్టార్ అధికారులు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల ఇన్చార్జీలు పాల్గొన్నారు.
Post A Comment: