ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పోలింగ్ రోజున స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ తెలిపారు.
గురువారం హన్మకొండ లోని అంబేద్కర్ భవన్ లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో విధులు నిర్వర్తించే మైక్రో అబ్జర్వర్ల కు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు
బండారి స్వాగత్ రణ్వీర్ చంద్
జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్ తో కలసి పాల్గోన్నారు.
ఈ సందర్బంగా సాధారణ ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ, ఈ నెల 13న జరగె సాధారణ లోకసభ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా మైక్రో అబ్జర్వర్లకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలోని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని, మైక్రో అబ్జర్వర్లు వారి విధులను అంకితభావంతో నిర్వహిస్తునే పోలింగ్ బృందం తో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైన మేరకు మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ టీం కు తగు సూచనలు చేయవచ్చునని తెలిపారు. పోలింగ్ ఆరంభం నుండి ముగిసే వరకు జరిగిన సంఘటనలు అన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని, ఓటింగ్ తరువాత ఓటరు తన ఓటు ఎవరికి వేసాననే రహస్యాన్ని బయటపెట్టకుండా చూడాలని, వారికి కేటాయించిన క్రిటికల్ పోలింగ్ కేంద్రంలో వసతులు ఉండేలా చూడాలని, మైక్రో ఆబ్జర్వర్ లు నిర్దేశించిన 18 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని, అట్టి అంశాల పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్ లకు పి పి టి పట్ల కనీస అవగాహన ఉండాలని, పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ఫారం ను పూరించి నిర్దిష్ట గడువు లోగా అందజేయడం తో పాటు గుర్తింపు కార్డ్ ప్రతిని జత చేసి అందజేయాలని, ఎన్నికల విదుల తో పాటు కౌంటింగ్ సందర్భం లో కూడా మైక్రో అబ్జార్వర్ ల సేవలను వినియోగించుకుంటామని ఈ సందర్భం గా తెలిపారు.
ఈ సందర్భం గా శిక్షకులు మైక్రో ఆబ్జార్వర్ లకు వారు నిర్వర్తించు విధి, విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి బాల కృష్ణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ హావేలి రాజు, మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాస్
తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: