ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
లోక్ సభ ఎన్నికలలో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాలో పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
ఈనెల 13న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించారు.
ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల వద్ద చేస్తున్న ఏర్పాట్లను పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పరకాల, వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గాల ఏఈఆర్వోలు డాక్టర్ కె. నారాయణ, వెంకటేష్ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద పోలింగ్ అధికారులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలను కల్పించాలని ఏఈఆర్ఓలను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి తాగునీరు, భోజన, రవాణా, తదితర ఏర్పాట్లను చేయాలన్నారు.
ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల పంపిణీ, రిసెప్షన్ కేంద్రాల వద్ద కల్పించాల్సిన వివిధ సదుపాయాలను గురించి కలెక్టర్ ఏఈఆర్వోలకు పలు సలహాలు సూచనలు చేశారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: