ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో గంజాయి, ఇతర మత్తుమందు పదార్థాల నియంత్రణపై పోలీస్, నార్కోటిక్స్, విద్య, తదితర శాఖల అధికారులతో నెలవారి సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు.
జిల్లాలో గంజాయి, ఇతర మత్తుమందు పదార్థాల నియంత్రణకు తీసుకున్న చర్యలు, రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేపట్టనున్నారనే వివరాలను పోలీస్, నార్కోటిక్స్ తదితర శాఖల అధికారులు వివరించారు. ఆయా శాఖలు చేపట్టే చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ యువత, విద్యార్థులు మత్తు పదార్థాల భారీన పడకుండా పటిష్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్నారు. మత్తు పదార్థాల భారీన ఎవరు పడద్దని సూచించారు. టోబాకో, గంజాయి, తదితర మత్తు పదార్థాలకు బానిసయిన వారికి వైద్య సేవల కోసం 14416 టెలీ మానస్ నెంబర్ ను సంప్రదించవచ్చునని తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 20 బెడ్లతో రిహాబిలిటేషన్ సెంటర్ అందుబాటులో ఉందని. ఈ రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా బాధితులకు 30 రోజులపాటు ఉచిత వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్ శాఖకు చెందిన 7013036629 అనే నెంబర్ కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా పాఠశాలలు, కళాశాలలు పున ప్రారంభం కానున్న నేపథ్యంలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. పాఠశాలలో కళాశాలలో నిర్వహించే యాంటీ డ్రగ్స్ కమిటీల సమావేశాలకు పోలీసులను ఆహ్వానించాలని సూచించారు.
ఈ సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ భారీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: