ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 
హన్మకొండ ;
పరకాల లోని ఉర్దూ మీడియం , ఇదే మండలం కామారెడ్డిపల్లి లోని ప్రభుత్వ పాఠశాలలను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం పరిశీలించారు.
ఈ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పాఠశాలల పున ప్రారంభం నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: