ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలలో జూన్ 9న నిర్వహించే గ్రూప్ -1 పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ పై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జూన్ 9 న నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్ష కేంద్రాలలో ఏర్పాట్లకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా లో ఉన్న అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో పాటు పరీక్ష కేంద్రాల చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పర్యవేక్షించాలన్నారు. పరీక్ష పూర్తయ్యేంత వరకూ నిరంతర నిఘా తప్పనిసరి అన్నారు. పరీక్ష రాసే అభ్యర్థుల కోసం పరీక్ష కేంద్రాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కోరారు.
ఈ సమావేశం లో సెంట్రల్ జోన్ డిసీపీ ఎం. ఎ.భారీ , హనుమకొండ ఆర్డీవో వెంకటేష్ , ఆర్టీసీ డీఎం ధరం సింగ్, అన్ని పరీక్ష కేంద్రాల అధికారులు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: