ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
లోక్ సభ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పి పేర్కొన్నారు. 1000 మంది జిల్లా, (TSSP , శిక్షణ కానిస్టేబుళ్లు)మరియు కేంద్ర (3 కంపేనీల CRPF, BSF బలగాల) పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పి గారు వెల్లడించారు. ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు, రూట్ మొబైల్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRT)/ స్ట్రయికింగ్ ఫోర్స్/ స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్/ లతో పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు.
స్వాధీన పరుచుకున్న వివరాలు :
ఇప్పటివరకు స్వాధీనపరచుకున్న నగదు 4780160/- రూపాయలు.
లిక్కర్ 3770 లీటర్లు సీజ్ చేయడం జరిగింది.
జిల్లాలో ఇప్పటివరకు బైండోవర్ చేయబడిన చేయబడిన వ్యక్తులు 451.
లైసెన్సుడు ఆయుధముల డిపాజిట్:.... ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియామవళి అనుసారంగా జిల్లాలో లైసెన్సు కలిగిన మొత్తం 8 ఆయుధాలను డిపాజిట్ చేశారు.
జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో, ఎలాంటి భయం, వత్తిడి లేకుండా ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని, అందుకు ప్రజలకు తగిన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగినదని, ఓటు ఉన్న అందరు ఓటు వేయాలని ఎస్పీ గారు కోరారు .ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తరలింపు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి భయం లేకుండా ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే కోరారు.
Post A Comment: