ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఈనెల 13వ
తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం సాయంత్రం పరిశీలించారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఎన్నికల సిబ్బంది, పోలింగ్ సామగ్రి, తదితర ఏర్పాట్లను గురించి అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి, వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల ఏఆర్వోలు వెంకటేష్, డాక్టర్ కె. నారాయణలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామగ్రిని అందజేసేటప్పుడు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.
ఎన్నికల విధులలో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి తాగునీరు, టీ, భోజనం, తదితర సౌకర్యాలను సిద్ధం చేయాలన్నారు.
ఈ సందర్భంగా తహసిల్దార్లు విజయ్ కుమార్, భాస్కర్, జగన్ మోహన్ రెడ్డి, రాజ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: