ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జూన్ 4వ తేదీన పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈసీఐ నియమ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని కౌంటింగ్ అధికారులకు, సిబ్బందికి హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, ఇతర సిబ్బందికి కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై
శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నమూనా ఈవీఎం ద్వారా కౌంటింగ్ సంబంధించిన నిర్వహణ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సంబంధించి జూన్ 4వ తేదీన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని కౌంటింగ్ కేంద్రాలలో కొనసాగే కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చూసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలన్నారు. కౌంటింగ్ లో ఎలాంటి జాప్యం లేకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబంధిత ఏఆర్వోలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల ఏఆర్వోలు డాక్టర్ కె. నారాయణ, వెంకటేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: