ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే మంగళవారం తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు రైతులకు అమ్మితే పీడీ యాక్టు నమోదుచేసి జైలుకు పంపిస్తామని, విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. రైతులను మోసం చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, నిల్వ చేసినా, రవాణా చేసిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హెచ్ టి కాటన్ విక్రయాలకు అనుమతి లేదన్నారు. కొనుగోలు చేసిన విత్త నాలు, ఎరువులు, పురుగు మందులకు రైతులు డీలర్ల నుండి రశీదులు తీసుకోవాలని సూచించారు. నకిలీ పత్తి విత్తనాలు ఉపయోగిస్తే భూసారం దెబ్బతింటుందని, ప్రభుత్వం ఆమోదించిన పత్తి విత్తనాలు మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని ఎస్పి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల సమాచారం తెలిస్తే వెంటనే వ్యవసాయ అధికారులు గాని పోలీస్ అధికారులు గాని తెలియజేయాలని తెలిపారు.
Post A Comment: