ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఈ నెల 27వ తేదీన జరగనున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
సోమవారం హనుమకొండ కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నికకు సంబంధించి జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, వైద్యం తదితర సదుపాయాలను సిద్ధం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, డిఆర్వో వై.వి.గణేష్, పరకాల, హనుమకొండ ఆర్డీవోలు డాక్టర్ కె. నారాయణ, వెంకటేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: