ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కాజిపేట, హనుమకొండ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపడుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ గురువారం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్లు, ఇతర మైనర్ రిపేర్లు ఈనెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. పూర్తి చేసిన పనులకు సంబంధించి పనులు పూర్తయినట్లు ధృవీకరణ పత్రం అందజేయాలన్నారు. పాఠశాలల్లో అభివృద్ధి పనులకు సంబంధించి క్రిటికల్ స్ట్రక్చర్స్ ఏవైన ఉన్నట్లయితే వాటి పనులను 25వ తేదీ లోగా పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, డీఈవో డాక్టర్ అబ్దుల్ హై, ఈఈ లు రాజయ్య, సంజయ్ కుమార్, డి ఈ లు సంతోష్ బాబు, రవికుమార్, శివానంద్, పలువురు ఏఈలు పాల్గొన్నారు.
Post A Comment: