ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఈ నెల 27వ తేదీన జరుగనున్న వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారులు లోకేష్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు.
బుధవారం హైదరాబాద్ నుండి పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహణ ప్రక్రియపై వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా లోకేష్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ జంబో బ్యాలెట్ బాక్స్ లు, అదనపు బాలెట్ బాక్స్ లు సిద్ధం చేయాలని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ లకు యూనిక్ నెంబర్లు వేయాలని అన్నారు. ప్రతి రోజు ఎన్నికల ప్రవర్తనా నియమావళి నివేదిక అందజేయాలని అన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. విధులు కేటాయించిన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 32 జంబో బాక్సులు, 234 పెద్ద బాక్సులు సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి , డిపిఓ లక్ష్మీ రమాకాంత్, ఆర్డీవోలు డాక్టర్ కే నారాయణ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: