October 2023
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మెదక్ జిల్లా ప్రతినిధి పవన్


మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని వెంకటపూర్ గ్రామంలో బీమ్లాతాండలో  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు,కార్యకర్తల  మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒకరు తామే ఎమ్మెల్యే అభ్యర్థిగా భావించి శ్రమించాల్సిన అవసరం ఉందని,ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రతి ఓటరుకు,గడప గడప కు ప్రజల లోకి తీసుకుని పోవాలని దిశ నిర్దేశం చేశారు... తెలంగాణ కాంగ్రెస్ అభయహస్తం 6 గ్యారంటీ పథకాలను ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, యువ వికాసం, మహాలక్ష్మి, గృహాజ్యోతి,చేయూత,ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ,500 రూపాయల గ్యాస్ సిలిండర్ తదితర పథకాలను ఇతర సంక్షేమ పథకాలను,కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు సైనికుడిగా పని చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు భక్తుల కిషోర్. మండలపు ఆప్షన్స్ సభ్యులు షేక్ మజార్. ఆకులపల్లి పాపయ్య. సేవాలాల్. చంద్రమోహన్ రెడ్డి. సాయిలు. సోమన్న. ఎర్రోళ్ల ప్రవీణ్. సాయి. శేషు గౌడ్. జాదవ్. సంతోష్. ఇమ్రాన్. మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్ బ్యూరో ఆఫ్ తెలంగాణ పుట్ట రాజన్న... 


పూటకో మాట మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటాలు నమ్మవద్దని...సింగరేణి కార్మికుల పక్షపాతి సిఎం కేసీఆర్‌ అని..సింగరేణి కార్మికుని బిడ్డగా..కార్మికుల కష్టసుఖాలు తెలిసిన వాడిగా..ఉద్యమ నాయకుడిగా,మీకు మరింత సేవలందించడానికే తపన పడుతున్నానని కార్మికన్నాలు బిఆర్ఎస్ పార్టీకి మద్దతూగా నిలిచి నవంబర్ 30 వ తేదీన జరిగే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలనిరామగుండం నియోజకవర్గ అభ్యర్థి,ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు.సింగరేణి సంస్థ ఆర్జీ-2పరిధి వకిల్ పల్లి సమీపంలో మంగళవారం నిర్వహించిన ప్రజా అంకిత యాత్రలో కార్మికులను పేరుపేరునా పలకరించారు.బిఆర్ఎస్ పార్టీలో చేరిన కార్మికులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంత రం ఆయన మాట్లాడరు,కోల్ ఇండియాలో ఎక్కడా లేనివిధంగా ఉద్యోగ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దే నన్నారు.మారుపేర్ల సవరణ మినహా సాధారణ ఎన్నికలలో,గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవితక్క నెరవేర్చారన్నారు,కారు గుర్తుకు ఓటు వేసి మరొకమారు ఎమ్మెల్యేగా గెలిపించి మీకు సేవ చేసే అదృష్టాన్ని కలిగించాలని,కెసిఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మూల విజయరెడ్డి,ఆర్జీ-2ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్,బిఆర్ఎస్,టీబీజీకేఎస్ నాయకులు జహిద్ పాషా,భానకర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ:పుట్ట రాజన్న

 

పెద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:31:23: పెద్దపల్లి జిల్లా:గోదావరిఖని ఎల్ఐసి కార్యాలయంలో మంగళవారం ఎల్ఐసి ఏజెంట్లను కలిసిన రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్,ఈ సందర్బంగా మాట్లాడరు...కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదాని అంబానీలకు కట్టబెట్టిన ఎల్ఐసిని ప్రైవేటుపరం కానీయబోమని అన్నారు.మీరంతా మద్దతు తెలిపాలని ఈ ప్రాంత బిడ్డగా పోరాటం చేస్తున్న చేతి గుర్తుకు ఓటు వేసి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీనాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ:పుట్ట రాజన్న,                                                   

పెద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:31:23:వందల కోట్లు ఉన్న అధిపతికి.పేదింటి ఆడబిడ్డకు మధ్య ఈ ఎన్నికల యుద్ధం కొనసాగుతుందని వారికి సరైన బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని రామగుండం బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి  పేర్కొన్నారు,అంతర్గం మండలంలో బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించి గ్రామాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంగళ హారతులతో మహిళలు స్థానిక ప్రజలు సంధ్యారాణికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడరు...కరోనా కష్టకాలంలో కనీసం గ్రామాల వైపు కన్నెత్తి చూడని నాయకులు ఎన్నికలు రావడంతో మరోసారి ప్రజలను మోసం చేయడానికి ఓట్ల కోసం వస్తున్నారని వారికి బుద్ధి చెప్పే సరైన సమయం వచ్చిందని అన్నారు.ఎంతో మంది నుండి ఉద్యోగాల పేరుతో తన అనుచరులు డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనకు గుర్తింపు ఇవ్వకుండా ఎన్నో అవమానాలకు గురి చేశారని ఆరోపించారు.మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి బిజెపి పార్టీ నుండి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు.గెలిచాక ఈనాడు గ్రామాలవైపు చూడని నాయకులకు ఓట్లు వేసి ప్రజలు మోసపోవద్దని పిలుపునిచ్చారు.రామగుండం మండలంలోని అంతర్గంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ప్రజలతో కుటుంబ సభ్యులుగా నాకు సన్నిహిత్యం ఉందని ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు ఉన్నాయనిఇప్పటివరకు ఓటమి ఎరుగని నాయకురాలిగా గెలిపించిన ప్రజలు బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని ప్రజలను కోరారు.ఎటువంటి పదవి లేకుండా 30 ఏళ్లుగా రాజకీయంలో ప్రజలకు సేవ చేస్తున్నానని మహిళగా రామగుండం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగాగెలిపించాలని కోరారు.నరేంద్ర మోడీ నాయకత్వంలోగ్రామాలతో పాటు పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని అన్నారు.అనంతరం ఎగ్లాస్ పూర్ నుండి  కందుల సత్తయ్య,ఆకునూరి కర్ణాకర్,మాదాసి శంకర్,అల్వాల కొమురయ్య,వడ్డేపల్లి పర్వతాలు,కంది రాజేందర్,తూడూరి హరీష్,దొరిశెట్టి కుమార్,కట్కూరి వెంకటేష్,అడెపు రామయ్య,దిగుట్ల స్వామి,ఐట్ల రంజిత్,గోర్క రాంబాబు,మాదాసి ఉదయ్,బాలసాని సత్తయ్య గౌడ్ లు బిజెపి పార్టీలో చేరారు.ఈ సందర్భంగా సంధ్యారాణి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో చిలుక శంకర్,ఆర్ముల్లా శంకర్,చిలుక రమేష్,రాజేందర్,నరేష్,లక్ష్మణ్,శంకర్,గోలీవాడ సాయి కృష్ణ,గుమ్ముల నరేష్,వెంకన్న,పురుషోత్తం,రవి చరణ్,రమేష్,డేవిడ్,రాజు,తిరుపతి రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే  అన్నారు. మంగళవారం జిల్లా  పరిధిలోని భూపాలపల్లి  నియోజకవర్గ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలయిన వెలిశాల,

  చింతగుంటరామయ్యపల్లి, చల్లగరిగ, గోరీకొత్తపల్లి, పోలింగ్ కేంద్రాలను  ఎస్పి  సందర్శించి ప్రజలకు తగు సూచనలు చేశారు. ఈ సంధర్బంగా ఎస్పి  గ్రామస్తులతో మాట్లాడుతూ


ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని, ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకావాలన్నారు. భూపాలపల్లి డి.ఎస్.పి ఏ రాములు సీఐ వేణుచందర్ ఎస్సైలు శ్రీకాంత్ రెడ్డి సాంబమూర్తి, సుధాకర్, రమేష్, శ్రీధర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

 ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టులాంటిదని అసిస్టెంట్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు నోడల్ ఆఫీసర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు,సఖి వన్ స్టాప్ సెంటర్, జిల్లా మహిళా సాధికారత కేంద్రం, బాలసదనం, సిపిఓ కార్యాలయ మహిళా ఉద్యోగులు ఓటరు చైతన్యంపై నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ కలెక్టర్ శ్రద్ధా శుక్ల హాజరై మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకునేలా చైతన్యం కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని చైతన్య వంతం చేస్తూ అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఓటరు చైతన్యంపై వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతి ఐసిడిఎస్ రాయపుర సెక్టార్ కు చెందిన మాధవి, తబిత, సబిత అందుకోగా, ద్వితీయ బహుమతి సోమిడీ సెక్టార్ కు చెందిన రఘు కుమారి, శ్రీదేవి, ఎం కవిత, తృతీయ బహుమతి వడ్డేపల్లి సెంటర్ కు చెందిన ఎన్. సునీత, జె.హేమలత, ఆర్ శ్రీలత బహుమతులు అందుకున్నారు. పలువురికి కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ముగ్గుల పోటీలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంస పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. మధురిమ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, జిల్లా ఆడిట్ ఆఫీసర్ నీరజ, డిసిపిఓ పి.సంతోష్ కుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్. ప్రవీణ్ కుమార్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు. తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మెడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్ బ్యూరో ఆఫ్ తెలంగాణ:పుట్ట రాజన్న

   



                              పెద్దపల్లి:గోదావరిఖని:రూరల్:అక్టోబర్:31:23:పూటకో మాట మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటాలు నమ్మవద్దని...సింగరేణి కార్మికుల పక్షపాతి సిఎం కేసీఆర్‌ అని..సింగరేణి కార్మికుని బిడ్డగా..కార్మికుల కష్టసుఖాలు తెలిసిన వాడిగా..ఉద్యమ నాయకుడిగా,మీకు మరింతసేవలందించడానికే తపన పడుతున్నానని కార్మికన్నాలు బిఆర్ఎస్ పార్టీకి మద్దతూగా నిలిచి నవంబర్ 30 వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని  రామగుండం నియోజకవర్గ అభ్యర్థి,ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు.సింగరేణి సంస్థ ఆర్జీ-2 పరిధి వకిల్ పల్లి సమీపంలో  సోమవారం నిర్వహించిన ప్రజా అంకిత యాత్ర నిర్వహించారు.కార్మికులను కలుసుకొని పేరుపేరునా పలకరించారు.వకీల్ పల్లె గని కార్మికులు30మంది బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకిఆహ్వానించారు,అనంతరం ఆయన మాట్లాడరు,కోల్ ఇండియాలో ఎక్కడా లేనివిధంగా ఉద్యోగ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దే నన్నారు.మారుపేర్ల సవరణ మినహా సాధారణ ఎన్నికలలో,గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవితక్క నెరవేర్చారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పోగొట్టిన వారసత్వ ఉద్యోగ హక్కును మెడికల్ ఇన్ వాలిడేషన్ పేరుతో తిరిగి పునరుద్ధరించడం జరిగిందన్నారు.సింగరేణి కార్మికులు దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులతో సమానమని,ఐటీ రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే,బిజెపి కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోద ముద్ర వేయలేదన్నారు.దానికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి,కుంభకోణాలను సాకుగా చూపి బొగ్గు గనులను వేలం పాట ద్వారా ప్రైవేటుపరం చేసే ఎంఎండిఆర్-2014 యాక్ట్ ను ప్రవేశపెట్టిందన్నారు.గనులను ప్రైవేటుపరం చేస్తే లాభాల వాటా కార్మికులకు ఎలా లభిస్తుందన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు ఆజ్యం పోస్తున్న కాంగ్రెస్,బిజెపి పార్టీలకు ఈ ఎన్నికలతో తగిన బుద్ధిచెప్పాలన్నారు.పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారన్నారు.సంపద పెంచాలి పేదలకు పెంచాలి అనే గొప్ప సంకల్పంతో పాలన చేస్తున్న కేసీఆర్ రాష్ట్ర సాధనలో ఏవిధంగా అండగా ఉన్నామో,భాగస్వాములమయ్యామో,బంగారు తెలంగాణ నిర్మాణంలో,అభివృద్ధిలో కూడా భాగస్వాములం కావాలని పిలుపునిచ్చారు.బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఐటీ మినహాయింపును సాధిస్తుందన్నారు.కష్టకాలంలో సంజీవని పోసి బ్రతికించిన ప్రజలకు,నాజీవితం ఉన్నంతవరకు సేవ చేస్తానని,సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.నియోజకవర్గంలో గతపాలకులు ఎవరూ చేయని అభివృద్ధిని చేసి చూపించానని సింగరేణి సీఎండితో మాట్లాడి పోతన కాలనీ-యైటింక్లైన్ కాలనీ మధ్య బ్రిడ్జి నిర్మాణం,వెజిటబుల్ మార్కెట్,కమ్యూనిటీ హాల్,ఆర్వో ప్లాంట్ వంటి మెరుగైన సౌకర్యాలనుకల్పించి.గతంలో గోదావరిఖనిలోని వైద్యశాలల్లో కనీసం వెంటిలేటర్ సౌకర్యం కూడా ఉండేది కాదని,కార్మికులకు ఏ జబ్బు వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్స్ కి రెఫర్ చేయాల్సిన పరిస్థితి ఉండేదని,కోట్లాది రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లకు ధారా దత్తం చేయాల్సి వచ్చిందన్నారు.ఒక్క కోవిడ్ సమయంలోనే 75 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థ కార్మికుల కోసం సంస్థ ఖర్చు చేసిందన్నారు.దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికులకు,ప్రజలకు అనారోగ్యపరమైన ఏఅవస్థ వచ్చినా ఏప్రైవేటు హాస్పిటల్ ను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రం కాకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి మెప్పించి,గోదావరిఖనిలో మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగిందన్నారు.330పడకలు,60 మంది నిష్ణాతులైన ప్రొఫెసర్లు,సింగరేణి కార్మికులకు స్పెషల్ వార్డు,పిల్లలకు ఎంబిబిఎస్ సీట్లలో ఐదు శాతం కోటాను ముఖ్యమంత్రి కేసీఆర్,వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుతో ప్రకటింపజేసిన విషయం గుర్తు తెచ్చుకోవాలన్నారు.నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం ఐటి,ఇండస్ట్రియల్ పార్కులను కూడా త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఇటీవల గోదావరిఖనికి వచ్చిన ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో శంకుస్థాపన చేసినప్పుడు,రామగుండంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే,రామగుండంను దత్తత తీసుకొని సకల సౌకర్యాలు సమకూరుస్తానని మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని ప్రతి ఒక్కరు నెమరు వేసుకోవాలని.నా జీవితం ఉన్నంతవరకు మీ సంక్షేమం కోసమే పరితపించే నన్ను,కారు గుర్తుకు ఓటు వేసి మరొకమారు ఎమ్మెల్యేగా గెలిపించి మీకు సేవ చేసే అదృష్టాన్ని కలిగించాలని,తద్వారా కెసిఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ ప్రచారంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మూల విజయరెడ్డి,ఆర్జీ-2ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్,బిఆర్ఎస్,టీబీజీకేఎస్ నాయకులు జహిద్ పాషా,భానకర్ తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో వకిలపల్లి గని కార్మికులు సుజిత్ రెడ్డి,పాల్ రవికుమార్,శ్రావన్ కుమార్,దీక్షిత్,జంపన్న,వెంకటేష్,రాజేశ్వర్,తిరుపతి,ఆజాద్ వినోద్,సుభాష్ శ్రావన్,రాజ్ కుమార్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

రాబోయే  అసెంబ్లీ ఎన్నికల్లో రౌడీ షీటర్లు,  కేడి,  సస్పెక్ట్ షిటర్లు ఏలాంటి గొడవలకు దిగవద్దని, ప్రవర్తనతో మెదలాలని  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే   అన్నారు. మంగళవారం రేగొండ మండల కేంద్రంలోని  ఓ  ప్రవేట్ ఫంక్షన్  హాల్లో చిట్యాల సర్కిల్  పరిధిలోని  126 మంది రౌడీ, కేడి, సస్పెక్ట్ షీట్లతో డిఎస్పీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా, ఎస్పి  హాజరయ్యారు. ఈ సందర్బంగా  ఎస్పీ కిరణ్ ఖరే   మాట్లాడుతూ జిల్లాలో ప్రజాస్వామ్యయుత,  స్వేచ్చ, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడానికి పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు.  ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. రౌడీ షీటర్ల పై ప్రత్యేకంగా ఉంటుందని, ఎన్నికల్లో ఎలాంటి నేరాలకు పాల్పడిన, గొడవలు దిగిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ  హెచ్చరించారు, సత్ప్రవర్తనతో, సరైన నడవడిక ఉంటే రౌడీ, కేడి, సస్పెక్ట్ షిట్లను విచారణ జరిపి  ఎత్తివేస్తామని ఎస్పీ కిరణ్ ఖరే  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ రాములు, చిట్యాల సిఐ వేణు చందర్, ఎస్ఐలు శ్రీకాంత్ రెడ్డి, సాంబమూర్తి, సుధాకర్, రమేష్, శ్రీధర్, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్,ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా , అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, డిఆర్వో గణేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ సమగ్రతకు పాటుపడాలన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా దేశ సమైక్యతను కాపాడుకుందాం అని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 స్వాతంత్ర  సమరయోధులు, స్వతంత్ర భారత ప్రధమ హోమ్ శాఖ మంత్రి  సర్ధార్ వల్లభాయ్ పటేల్  జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే  అన్నారు. మంగళ వారం  వల్లభాయ్ పటేల్  జయంతి “జాతీయ ఐక్యత దినోత్సవం” ను పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పి   జాతీయ ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించి, పటేల్  చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించి,  పోలీస్ అధికారులు, సిబ్బందితో ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా  ఎస్పి కిరణ్ ఖరే  మాట్లాడుతూ   పోరాటమే ఊపిరిగా వల్లా భాయ్ పటేల్  ప్రస్థానం కొనసాగిందన్నారు. దేశ సమగ్రత కోసం శ్రమించిన ధీరుడు పటేల్ అని ఎస్పి తెలిపారు. చిన్నచిన్న రాజ్యాలను దేశంలో విలీనం చేసిన ఘనత ఉక్కుమని సర్దార్ పటేల్ కే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి (ఏఆర్ ) వేముల శ్రీనివాస్, డీఎస్పీ  నారాయణ నాయక్, ఇన్స్పెక్టర్లు వేణుచందర్, సూర్య ప్రకాష్, రామ్ నర్సింహారెడ్డి, రవీందర్, డిపిఓ  ఏఓ వసీం ఫర్జానా, సూపరింటెండెంట్ సోఫియా సుల్తానా, సిసి  ప్రదీప్ కుమార్, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

జయశంకర్ భూపాలపల్లి 

జిల్లా పోలీసు కార్యాలయంలో  బ్యాంకర్లతో సమావేశం  ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పోలీసుకు బ్యాంకర్లు సహకరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే  అన్నారు. మంగళవారం జిల్లాలోని బ్యాంకర్లతో జిల్లా పోలీసు కార్యాలయలో  ఎస్పి  సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా  ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవడానికి బ్యాంకర్లు బాధ్యతగా సహకరించాలని కోరారు.  జిల్లాలో ఎన్నికల నియామవళి అమల్లో ఉన్నందున  బ్యాంకుల్లో  పెద్ద మొత్తంలో జరిగే నగదు ఉపసంహరణపై నిఘా ఉంటుదని అన్నారు. అనుమానస్పద బ్యాంకు అకౌoట్ల గురుంచి బ్యాంకర్లు తగిన సమాచారం పోలీసులకు ఇవ్వాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు  బ్యాంకర్లు సహకరించాలని ఎస్పీ  కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు, చిట్యాల భూపాలపల్లి, సిఐలు వేణు చందర్, రామ్ నర్సింహ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ సూర్య ప్రకాశ్, జిల్లాలోని వివిధ బ్యాంకుల మేనేజర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి పవన్


మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని కోరంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారికి ఘన స్వాగతం పలికిన కోరంపల్లి గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, పార్టీ నాయకులు కార్యకర్తలు అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని వాడవ వాడలలో తిరిగి సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మ్యానిఫెస్టో ను ప్రజలకు వివరించి నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో తమను గెలిపించాలని ప్రజలను కోరారు అనంతరం టేక్మాల్ మండల కేంద్రంలో బారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన మండల ప్రజలు  ఎంపీటీసీలు ఎంపీపీ, సర్పంచులు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు,మహిళలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్నికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మండల భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం ప్రారంభించారు అనంతరం గొల్లగూడెం గ్రామ ప్రజలు గ్రామస్తులు మహిళలు మంగళహారతులతో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ గారికి ఘన స్వాగతం పలికారు గ్రామంలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను మ్యానిఫెస్టో ను ప్రజలకు వివరించి మరోసారి ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ప్రజల బ్రహ్మరథం పడుతూ సానుకూలంగా స్పందిస్తూ కారు గుర్తుకే మా ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు జై కెసిఆర్ జై క్రాంతన్న జై స్థానికం అంటూ నినాదాలతో హోరెత్తించిన గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు అనంతరం టేక్మాల్ లో ఇంటికి వెళ్లి సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి దూసుకు పోయారు ప్రజలు ఎక్కడా చూసినా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారికి ఘన స్వాగతం పలికారు గ్రామంలో ఇంటింటికీ తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజల సమిష్టిగా కృషి చేస్తున్న స్థానిక అందోల్ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అని ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్  మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సారధ్యంలో రాష్ట్ర అభివృద్ధి,అదే విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు,రాబోయే ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపరిచిన సంక్షేమాభివృద్ధి పథకాలు,కార్యక్రమాలు వంటివి వివరిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఈకార్యక్రమంలో ఎంపీపీ చింతా స్వప్న రవి మండల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, సర్పంచులు కోరంపల్లి శ్రీనివాస్,టేక్మాల్ మేజర్ గ్రామ సుప్రజా భాస్కర్,ఎల్లుపేట గ్రామ సర్పంచ్ బోరంచ సాయిలు, ఎల్పుగొండ గ్రామ సర్పంచ్ బోయిని నారాయణ, ఉపసర్పంచ్ పట్నం ప్రేమీల,సోసైటి చైర్మన్ యశ్వంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ వరలక్ష్మీ, ముస్లిం మైనారిటీ నాయకులు యంఏ సలీం, మండల బిఆర్ ఎస్ పార్టీనాయకులు సిద్దయ్య, మాణిక్యం బాలకృష్ణ మహేందర్ రమేష్ నాయక్ వెంకట్, వసంత్ నాయక్,దుర్గయ్య నర్సింహులు గోవింద చారి, రాములు మల్లేశం కీషన్, రవి, సత్యం,మొగులయ్య, సాయిలు,యాదయ్య,శివయ్య,బీరయ్య, సత్యనారాయణ, కిష్టయ్య బాలయ్య, విఠల్, బేతయ్య,పాపయ్య,భూమయ్య, తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జుక్కల్ మండల్ ప్రతినిధి / క్రిందిదొడ్డి నాగరాజ్


జుక్కల్ న్యూస్ టుడే;

కెసిఆర్ నోట జూటా మాట

 కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్ చౌరస్తాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అందులో కేసీఆర్  మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం లో పీజీ కళాశాల, రైతుబంధు, మిషన్ భగీరథ,కళ్యాణ లక్ష్మి పలు పథకాల గురించి వివరించారు. బిచ్కుంద లో 100  పడకల ఆస్పత్రి నిర్మాణం గురించి మాట్లాడారు. కానీ వాస్తవంగా 100 పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ అందులో సరియైన వైద్య సదుపాయాలు, డాక్టర్లు లేరు మరియు పీజీ కళాశాల గురించి చెప్పారు నియోజకవర్గం లో రెండు దఫాల టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కూడా కళాశాల కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అలాంటి అబద్ధాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కెసిఆర్  మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకి సరియైన రోడ్డు సౌకర్యం కూడా లేదు వ్యవసాయానికి సరియైన నీరు లేదు. కెసిఆర్  మాట్లాడుతూ పక్కనే ఏర్పడ్డ కర్ణాటక ప్రభుత్వం గురించి విమర్శించారు. మహారాష్ట్ర గురించి అక్కడ ప్రభుత్వం అక్కడ అభివృద్ధి గురించి విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డ పది సంవత్సరాలకే అనేక అభివృద్ధి పనులు చేశా మని చెప్పారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 



                          పెద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:30:23:(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్):స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగన సోమారపు సత్యనారాయణ తనదిన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు,ఇందులో భాగంగా మాజీ కార్పొరేటర్ రవి నాయక్ సోమారపు గూటికి చేరారు,రామగుండం అభివృద్ధి చెందాలంటే నీతివంతమైన పాలన అందించాలంటే అది కేవలం ఒక సోమారపు తో సాధ్యమని అందుకని తాను సోమారపు  సత్యనారాయణకి పూర్తి మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నారు,బీఆర్ఎస్,కాంగ్రెస్ అభ్యర్థులకు దీటుగా ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న ఇండిపెండెంట్ అభ్యర్థి సమర సత్యనారాయణ"సోమవారం"8ఇంక్లైన్ కాలనిలొని రాజీవ్ నగర్,లంబాడి తండా,తారక రామారావు నగర్,భాస్కర్ రావునగర్ లో జరిగిన ప్రచారంలో సోమవారం సత్యనారాయణకి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు,ఈ సందర్భంగా సోమవారం సత్యనారాయణ మాట్లాడారు,నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నానని,8 ఇంక్లైన్ కాలనీ ప్రజలకు తనకు మంచి అనుబంధం ఉందని ఇక్కడ అభివృద్ధికి సింగరేణితో కూడా మాట్లాడిఅనేక రకాల అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు,ఇప్పుడు మళ్లీ ఎలక్షన్ వచ్చాయని పాపమని ఒకసారి  అవకాశం ఇచ్చినందుకు ఐదు సంవత్సరాలు బాధపడ్డామని అవినీతి,భూకబ్జాలు బెదిరింపులు చేస్తూ నియోజకవర్గాన్ని సర్వ నాశనంచేశారని.ఇప్పుడు కొత్తగా ఇంకొక వ్యక్తి ఒక్క ఛాన్స్ అంటూ మీ దగ్గరికి ఎలక్షన్లో ఓట్లు అడగడానికి వస్తున్నాడు అతని గెలిస్తే కనీసం ప్రజలకు అందుబాటులో ఉండకుండావెళ్లి హైదరాబాదులొ ఉంటాడని అందుకని ఓటు ద్వారా ఈ నాయకులకు బుద్ధి చెప్పిమళ్లీ నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రామగుండం అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలిపారు,ఈ ప్రచారయాత్రలో పాల్గొన్నవారు సోమారపు అరుణ్-లావణ్య,జాలి రాజమణి,కుసుమ రవినాయకు,కృష్ణ,ప్రవీణ్,బిక్షపతి,వీరన్న,సురెషు,సునీలు,చంద్రశకర్,డేవిడ్,సూరి కిషోర్,నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి:గోదావరిఖని:బసంతునగర్:అక్టోబర్30:23:(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ):కాంగ్రెసును నమ్మితే అరగోసే!.55ఏళ్లు అధికారమిస్తే 

మన బతుకులు ఆగం చేశారు!.సబ్బండ వర్గాలకు లబ్ధి చేకూరేలా టిఆర్ఎస్ పార్టీ 

మేనిఫెస్టో మానవీయ కోణంలో ఆలోచన చేసే మనసున్న మారాజు సీఎం కేసీఆర్ నా ఆడబిడ్డల ఆరోగ్య రక్షణకోసం మెడికల్ కళాశాలను ప్రారంభింపజేశా ఆరు నెలలకు ఒకసారైనా మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి ఎన్నికల్లో ఆదరించండి కార్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్,కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం కుట్ర కాంగ్రెసు నమ్మితే మోసపోతాం అరిగొస పడతామని కాంగ్రెస్ పార్టీ 

చెబుతున్న దొంగ మాటలను ప్రజలు ఎవరు నమ్మవద్దని వారికి బుద్ధి వచ్చేలా రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసిబీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలనిరామగుండం శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు.సోమవారం పాలకుర్తి మండలం బసంతనగర్ లో ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం  నిర్వహించారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడరు...రామగుండం నియోజకవర్గానికి ఏమీ చేయని వారు ఒక అవకాశం ఇవ్వాలని దొంగ మాటలు చెప్తూ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని వారి మోసపూరిత మాటలను నమ్మితే మన బతుకులు ఆగం కావడం గ్యారెంటీ అన్నారు.రామగుండం నియోజకవర్గం  అభివృద్ధి కోసం ప్రజ సంక్షేమమే కోసమే మా అరటామని...పదవుల కోసం కాంగ్రెసోళ్ల  అరాటమన్నారు.ఈ ప్రాంత ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలువాలని మీ  రుణం తీర్చుకోవడానికి మెడికల్ కళాశాల ఎర్పాటు చేయుంచానని అన్నారు.జిల్లా కెంద్రాల్లో మెడికల్ కళాశాలలు ప్రభుత్వం మాంజూరు చేసిన సందర్భంలో  సిఎం కేసీఆర్‌ని ఓప్పించి మెప్పించి మెడికల్ కళాశాలను 500 కోట్లతో ప్రారంభించి కార్పోరేట్ వైద్యం పెద కుటుంభాలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.నా ఆడబిడ్డలంతా ఆరోగ్యాల పట్ల శ్రద్ద వహించాలని నాకుటుంబంలో జరిగిన విధంగా మరే కుటుంభంలో జరుగవద్దన్నారు6నెలలకోసారి మహిళలు వైద్య పరిక్షలు  చేయుంచుకోవాలనీ మెడికల్ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ పేరిట పధకంతీసుకువచ్చిందన్నారురామగుండంలో జరిగిన అభివృద్ధి చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ  దుర్మార్గమైన ప్రచారాలు చేస్తుందన్నారు.తెలంగాణ భవితకు భరోసా గా సబ్బండ వర్గాలు లబ్ధి చేకూరేలా టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రూపోందిచారని ప్రజా ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోలో ప్రకటించిన  దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజహిత మ్యానిఫెస్టో రూపొందించారని 

రైతు బంధుఎకరాకు ఏడాదికి,రూ16,000,తెల్ల కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా  పథకం,ఒక కుటుంబానికి 4000 రూపాయలు భీమా చెల్లించి ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పన,తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా ప్రతి రేషన్ కార్డు దారునికి సన్న బియ్యం పంపిణీ,ఆసరా పింఛన్లు రూ5వేలకుపెంపు,వికలాంగుల పింఛన్ 6వేలకు పెంపు,సౌభాగ్య లక్ష్మీ పథకం అర్హులైన ప్రతి మహిళకు  నెలకు రూ.3వేలు అర్హులైన లబ్ధిదారులకు రూ.400 రూపాయలకే సిలిండర్ ఆరోగ్యశ్రీ పరిమితి 15 లక్షలకు పెంపు చేయడం జరిగిందన్నారు.ప్రజలందరు మళ్లీ తమకు మద్దతూగా నిలువాలనీ కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మూల విజయరెడ్డి.బసంత్ నగర్ సర్పంచ్,కట్టగోల వేణుగోపాల్ రావు,మాజీ ఉప సర్పంచ్ ముత్యం సంతోష్ గౌడ్,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంజపురి నవీన్,బీఆర్ఎస్ నాయకులు ముత్యం లక్ష్మన్ గౌడ్,బడుగు మహేందర్. సార్ల రమేష్.కాదాసు సంపత్,తిరుపతిరెడ్డి,మేకల కుమార్,ముత్యాల శరత్.గండికోట కుమార్.తంగడి అనిల్ రావు,గద్వాల నరేష్, జట్పట్ సమ్మయ్య.గంధం  ఆంజనేయులు,గోశిక నరసయ్య,దారం మనోజ్ రెడ్డి,వాసాల పద్మ(వార్డ్ నెంబర్స్ ఎండి అఫ్జల్ ఖాన్,దారం సుజాత,తుంగ సప్న)  తదితరులు పాల్గొన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 21,22,23,13వ డివిజన్ లోని యువత పెద్ద ఎత్తున తరలివచ్చి పోచంమైదాన్ నుండి ఎమ్మెల్యే నన్నపునేనికి స్వాగతం పలికి డీజే మొతలతో క్రేన్ తో భారీ గజమాలను ఎమ్మెల్యేను సత్కరించి ర్యాలీ నిర్వహించారు.

తదనంతరం దేశాయిపేట లోని కేఆర్ గార్డెన్లో యూత్ నాయకులు దిలీప్ రెడ్డి ఏర్పాటు చేసిన చేరిక కార్యక్రమానికి హాజరై కాంగ్రెస్ బీజేపీ నుండి యూత్ నాయకులు ఆఫ్రోజ్, కమల్,అగ్బర్ తో పాటు సుమారు 150 మంది నేడు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

నియోజకవర్గంలోని యువత అంతా కెసిఆర్ కేటీఆర్  నాయకత్వాన్ని బలపరుస్తూ తనకు అండగా నిలుస్తున్నారన్నారు.

90 శాతం నిరుపేదలు ఉన్న ఈ ప్రాంతంలో తాను ఎమ్మెల్యే అయ్యాక గొప్పగా అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గంలో జిల్లా కేంద్రం నూతన కలెక్టరేట్ నూతన బస్టాండ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 24 అంతస్తులతో 1250 కోట్లతో దేశంలో ఎక్కడా లేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంతర్గత సిసి రోడ్లు డ్రైనేజీ ఏర్పాటు చేశామన్నారు ఎప్పుడో 1945లో పోసిన మండిబజార్, చౌరస్తా రోడ్లను తాను ఎమ్మెల్యే అయ్యాక గొప్పగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.

సంక్షేమంలో బాగంగా ఆసరా పెన్షన్ దళిత బంధు రైతుబంధు రైతు బీమా కేసీఆర్ కిట్ ఇలా మరెన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్నారన్నారు.

నేడు ఎన్నికలు  రాగానే ఎక్కడెక్కడినుండో నాయకులు వస్తారని నేడు ఇక్కడ కాంగ్రెస్ బిజెపి నుండి పోటీ చేసే నాయకులు ఒకరు వర్ధన్నపేట మరొకరు వంచనగిరి కానీ తాను లోకల్ అని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే మరణించేవరకు ఉంటానన్నారు.

కరోనా ఆపత్కర పరిస్థితుల్లో తానే ప్రజల వెంట ఉన్నానని

వరదలు వచ్చినప్పుడు తానే ఉన్నానని చెప్పారు.

ఉద్యోగ అవకాశాల కోసం కోచింగ్ సెంటర్ తానే ఏర్పాటు చేశానని

మొన్న జరిగిన బతుకమ్మ దసరా ఉత్సవాలకు ఎన్నికల కోడ్ వల్ల ఏర్పాట్లకు ఇబ్బందులు కలిగితే తన తండ్రి ఎన్ఎన్ ట్రస్ట్ ద్వారా వారికి సహాయం చేయడం జరిగిందన్నారు.

తాను పడ్డ కష్టం ఎవరూ పడవద్దని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కంపెనీలో ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికల తర్వాత ఇక్కడ కంపెనీలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తామన్నారు

డేవేలెప్మెంట్ అంటే బిఆర్ఎస్, డేవేలెప్మెంట్ అంటే కేసీఆర్, డేవేలెప్మెంట్ అంటే నన్నపునేని నరేందర్ అని అన్నారు. దేశాయిపేటలో రోడ్లన్నీ గొప్పగా మార్చామని నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే చాలా అంతర్గత సిసి రోడ్లు పూర్తయ్యాయని మరి కొన్ని పనులు జరుగుతున్నాయన్నారు

స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలలో  55సంవత్సరాలు 11సార్లు కాంగ్రెస్ పరిపాలించింది. ఎక్కడ అభివృద్ధి చేయలేదు.

మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలకులు అజంజాహి మిల్స్ అమ్ముకుంటే కేసీఆర్ సంగం లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశం కల్పిస్తున్నామన్నారు.

మట్టికైనా మనోడే కావాలంటారు కాబట్టి

నేను మీ ఇంటోన్ని మీ ఆపతి సంపతిలో తోడుంటా యువత భవిష్యత్తు కోసం కారుకు ఓటేయ్యాలి గంగ జమున తహజీబ్ లాగా కలిసి ఉండే మనలో గొడవలు పెట్టేందుకు వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ తనని తనని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ ఇంచార్జ్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి,యేలుగం లీలావతి సత్యనారాయణ,కార్పొరేటర్ సురేష్ జోషి, డివిజన్ల అధ్యక్షులు డివిజన్ ఇన్చార్జిలు ముఖ్య నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేయాలని

సోమవారం న్యూ ఢిల్లీ నుంచి కేంద్రఎన్నికల సంఘం 

సీనియర్ డిప్యూటీ  కమిషనర్ నితేష్ వ్యాస్ మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ సన్నద్ధత పై  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .

ఈ సందర్బంగా ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల అవుతుందని, నవంబర్ 3 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కు అర్. ఓ కార్యాలయంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రిటర్న్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో సమయపాలన పాటించాలని, ఒకే గడియారం  ఉండాలని అన్నారు. మనకు వచ్చిన ప్రతి నామినేషన్ వివరాలను  ఆన్ లైన్ యాప్ లో నమోదు చేయాలని అన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఓటరు జాబితా వివరాలు అందించాలని, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని,  తాజా అందుబాటులో ఉన్న  ఫ్రీ గుర్తులను మాత్రమే కేటాయించాలని అన్నారు.

నామినేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత అవసరమైన బ్యాలెట్ పేపర్ల తయారీ బ్యాలెట్ యూనిట్లు పోస్టల్ బ్యాలెట్స్ సిద్దం చేసుకోవాలని, అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం యంత్రాల రెండవ ర్యాండమైజేషన్ చేపట్టాలని , అభ్యర్థులు అధికంగా ఉంటే సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఓటరు స్లిప్పుల పంపిణీ చేయాలని, ఈవిఎం యంత్రాల భద్రపరిచే స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు. ఈవీఎం యంత్రాలు తరలించే సెక్టార్ అధికారులకు అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు. 

పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని, పోలింగ్ కేంద్రాల జాబితా అభ్యర్థులకు రాజకీయ పార్టీలకు అందజేయాలని, పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ప్రత్యేక వసతుల కల్పన పై శ్రద్ధ వహించాలని అన్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది, మీడియా ప్రతినిధుల, అత్యవసర సేవల సిబ్బంది కి  పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయాలని, సి విజల్ యాప్ ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలని అన్నారు.

జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల రికార్డులకు సంబంధించి ప్రతి అంశం భద్రపరచాలని అన్నారు. రాజకీయ పార్టీలకు , అభ్యర్థులకు అవసరమయ్యే వివిధ రకాల అనుమతులను ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన నిష్పక్షపాతంగా అందించాలని  అన్నారు.

ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల తనిఖీలలో భాగంగా నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ ప్రతి రోజు వచ్చే ఆపిల్  పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని, 10 లక్షల కంటే అధికంగా నగదు జప్తు చేసిన సమయంలో ఐటి అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.

నవంబర్ 3 నుంచి ఎన్నికల పరిశీలకుల క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల విధులు సకాలంలో  నిష్పక్షిపాతంగా నిబంధనలో మేరకు నిర్వహించాలని, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరగాలని అన్నారు. 

నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో సమయపాలన పాటించాలని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి .కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిక్త పట్నాయక్ అదనపు కలెక్టర్ మహేందర్ జీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రద్ద శుక్ల అర్.డి. ఓ లు రమేష్,శ్రీనివాస్ డిఆర్డిఏ పీడి   శ్రీనివాస్, డిసీఓ  నాగేశ్వరావు ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

           


                              పెద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:29:23(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్:బ్యూరోఆఫ్ తెలంగాణ):మంథని వాసులు"ఖని"లో నివాసం ఉంటున్న వారితోసమావేశంలో,జక్కుల సతీష్-రజిత వివాహదినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలో నివాసముంటున్న మంథనిప్రాంతవాసులతో గోదావరిఖనిలోని ఒక ఫంక్షన్ హాల్ లోనిర్వహించిన సమావేశానికి మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై"వివాహదినోత్సవంరోజున"వివాహితులైన జక్కుల సతీష్-రజితలను ఆశీర్వదించి.శుభాకాంక్షలు తెలిపారు,ఎన్నికల సమరం వేల మంథని నియోజకవర్గంలోని ప్రజలు ఉద్యోగాలుగా,వ్యాపారాల రీత్యా గోదావరిఖనిలో నివాసముంటున్న వారందరూ ఒక వేదికగా సమావేశమైన సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు,ఎన్నికల యుద్ధం మొదలైనది అందరూ అప్రమత్తంగా ఉండాలి,కాంగ్రెస్ వాళ్లు వచ్చి కళ్లి-బుల్ల మాటలు చెప్పి నక్క విన్యాసాలు ప్రదర్శించి,డబ్బు సంచులతో వచ్చి మాయ మాటలతో మభ్యపెడతారని 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మంథని మాయజ్వాల కారు చీకటిగానే మిగిలిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చి మంథని నియోజకవర్గ ప్రజల ముందు నిలబెడితే అందరూ ఒక తాటిగా గెలిపించుకున్నారని ఆ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే పదవి కాలంలో 30 ఏళ్ల చీకటిని తొలగించానని స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని తెచ్చానని ప్రజల సేవకుడిగా ఎన్నో సేవలు చేశానని,మళ్లీ 2018లో డబ్బు సంచులతో వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాయ మాటలకు మోసపోయి ఎమ్మెల్యేగా గెలిపిస్తే, మంథని నియోజకవర్గంలో ప్రజా పాలన కుంటు పడకూడదని సీఎం కేసీఆర్ జెడ్పీ చైర్మన్గా అవకాశం కల్పిస్తే సేవ చేస్తున్నానని,ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ప్రజా సమస్యలు తీర్చకుండా ప్రజలను గాలికి వదిలేసి హైదరాబాదులో ఉంటూ చుట్టపు చూపుగా వచ్చిపోయే శ్రీధర్ బాబు,మళ్లీ డబ్బు సంచులతో అన్నదమ్ములు ఇద్దరు వస్తున్నారు వారి పట్ల జాగ్రత్తగా ఉండి తిరస్కరించాలని,బిసి,బహుజన బిడ్డనైన పుట్ట మధును మీరంతా ఐక్యతతో ఎక్కడెక్కడ చుట్టాలు ఉంటే వారందరితో మాట్లాడుతూ కొంతటైం కేటాయించి ప్రభుత్వ పనితీరు చర్చ పెట్టాలని ప్రతి గడపగడపకు సంక్షేమ ఫలాలు,మేనిఫెస్టో తీసుకువెళ్లి ప్రజలకు వివరించి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మళ్లీ మీ సేవకునిగా ఉంటానని,అక్కరకు రాణి 6 గ్యారంటీల కాంగ్రెస్ మాయ మాటలకు మోసపోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ,కారు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసినారు,ఈ హాజరైన వారంతా ఐక్యతతో జై తెలంగాణ జై కేసీఆర్ జై జై పుట్ట మదన్న కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదించారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ


భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం బస్వరాజు పల్లె గ్రామంలో గడప గడపకు బిజెపి ప్రచారం లో పాల్గొన్న భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే  అభ్యర్థి డాక్టర్ చందుపట్ల కిర్తి రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందజేయడం బిజెపి లక్ష్యం అని అన్నారు అంతేకాకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కోనసాగించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిట్టబోయున సాంబయ్య  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న  మండల నాయకులు పాపిరెడ్డి  మాదస్ మొగిలి  రాష్ట్ర BJYM  నాయకులు మంద మహేష్ BJYM మండల అధ్యక్షులు అకూల శ్రీనివాస్  మరియు మహీళ మోర్చ అధ్యక్షురాలు బోల్లం అరుణా  జనగం శ్రీనివాస్ రాజయ్య శక్తి కేంద్ర ఇంచార్జీ మెట్టా కూమార్ బూత్ అధ్యక్షులు సుంకు తిరుపతి సైండ్ల తిరుపతి . శ్రీకాంత్  జిల్లా నాయకులు పొన్నాల కోమరయ్య  తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం గణపురం మండల కేంద్రము లో కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీ నుంచి 40 యువకులు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ లో. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి అధ్వర్యంలో చేరడం జరిగింది.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 పెద్దపల్లి:గోదావరిఖని:సెప్టెంబర్:29:(మేడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్):

ప్రజాసేవే నా ద్వేయం మీ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ తీసుకుంటా సమాజానికి మేలు చేయనోళ్లు కాంగ్రెస్‌ పార్టీ పాలకులు పేదవర్గాలకు సేవ చేయాలన్నదే నా ఆరాటం తపన,ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌,సేవాస్పూర్తితో పేద వర్గాలకు అందించే మీ సేవలకు తనవంతు సంపూర్ణ సహకారం అందిస్తామని పెద్దపల్లి జెడ్పి చైర్మన్,మంథని నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ హమీ ఇచ్చారు.మంథని మండలంలోని ఆర్ఎంపీ,పీఎంపీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి పలు విషయాలపై చర్చించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడరు,మంథని మండలంలోని ఆర్‌ఎంపీ,పీఎంపీలు గ్రామీణ ప్రాంతాల్లో అనేక సేవలు అందిస్తుంటారని,వారి సేవాస్పూర్తికి తగిన సహకారం అందిస్తానని అన్నారు.మంథని కేంద్రంగా ఆర్‌ఎంపీ పీఎంపీలకు సౌకర్యవంతంగా ఓ భవనం నిర్మిస్తామని,సమావేశాలు,ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకువీలుగా ఉండేలా చూస్తానన్నారు.అంతేకాకుండా ఆర్‌ఎంపీ,పీఎంపీలకు శిక్షణ కార్యక్రమాలకు సైతం తనవంతు సహకారం అందిస్తానన్నారు.పేదవర్గాలకు సేవ చేసేలా ఆలోచన చేయాలని,హైదరాబాద్‌లో ఓ స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చి ఆస్పత్రిని ఏర్పాటు చేసుకుని ఉచితంగా సేవలు అందిస్తోందని,వారి సేవలు ఎంతో గొప్పవన్నారు.అలాంటి సేవలు మంథనిలాంటి ప్రాంతంలో ఉంటే ఎంతో మంది పేదలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు,అనేక ఏండ్లు ఈ ప్రాంతంలో పరిపాలనచేసిన కాంగ్రెస్‌ పాలకులుప్రజలను పట్టించుకోలేదని,మీలాంటి వాళ్ల సమస్యలను విస్మరించారన్నారు.ఈ సమాజానికి ఏమీ చేయనోళ్లు ఎవరైనా ఉన్నారంటే వాళ్లు కాంగ్రెస్‌ పార్టీ వాళ్లేనని అన్నారు.తాను ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే అనేక సేవలు అందించామని,ప్రభుత్వం ద్వారా సంక్షేమఫలాలను అందించామని గుర్తు చేశారు.రాబోయే రోజుల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఇటు ప్రభుత్వం ద్వారా అటు తన సొంతంగా సేవలు అందించేలా ప్రత్యేకప్రణాళికలు చేసినట్లు తెలిపారు.సమాజానికి సేవ చేసే వాళ్లు అధికారంలో ఉంటే ఎంత ప్రయోజనం జరుగుతుందో ఆలోచన చేయాలన్నారు.ఆర్‌ఎంపీ పీఏంపీలు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని,ఎవరికి అవకాశం కల్పిస్తే మన ఆకలి,కష్టాలు తీర్చుతారనే విషయాలపై చర్చించాలని ఆయన ఈ సందర్బంగా కోరారు.పేదవర్గాలకు సేవ చేయాలన్నదే తన ఆరాటం,తపన అని ఆదిశగా తనకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.అనంతరం వారు జై తెలంగాణ జై పుట్ట మదన్న,కారు గుర్తుకే మన ఓటు అంటూ పూర్తి మద్దతు తెలిపారు..


                                        

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో యువత అంతా తన వైపే ఉన్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు కరీమాబాదులో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ యూత్ నాయకులు మండ సాగర్, యాట ప్రవీణ్(లడ్డు) ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని యువత నేడు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

90శాతం నిరుపేదలు ఉన్న ప్రాంతం ఈ నియోజకవర్గం మన తూర్పు

స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలలో 67 సంవత్సరాలు ఇతర రాజకీయ పార్టీలు పరిపాలించాయని అందులో ముఖ్యంగా కాంగ్రెస్ 55 సంవత్సరాలు 11సార్లు అధికారంలో ఉండి చేసింది ఏమీ లేదన్నారు వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పాలకులు ఆజాంజాయి మిల్స్ ని అమ్ముకుని కార్మికులను రోడ్డున పడేశారు దేశాయిపేటలోని తోళ్ళ పరిశ్రమ అంతరించిపోతుంటే చోద్యం చూశారన్నారు. నాడు ఉద్యమంలో తాము యువకులగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం పోరాడడం జరిగింది నాడు ఎట్లాగు మా జీవితాలు అయిపోయ్యాయని నేటి తరాలు బాగుండాలనే ఆనాడు ఉద్యమంలో తాము పోరాటాలు చేసి తెలంగాణ సిద్దించే వరకు కొట్లాడడం జరిగింది.

అజాంజాహి మిల్స్ కాంగ్రెస్ పాలకులు అమ్ముకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసుకున్నామని ఇప్పటికే మూడు కంపెనీలు ఏర్పాటు చేయడం జరిగిందని మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అన్నారు.

తనకు ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇస్తే 4100కోట్లతో అభివృద్ధి నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

నియోజకవర్గంలో ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశామని రింగ్ రోడ్డు చుట్టూ చుట్టూ కంపెనీలు నెలకొల్పుతామన్నారు.

నియోజకవర్గాల జిల్లా కేంద్రం నూతన కలెక్టరేట్, భారతదేశం అబ్భుర పడే విదంగా 1250కోట్లతో 24 అంతస్తులు హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నూతన బస్ స్టేషన్ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

గేటు ఇవతలి ప్రాంతంలో రోడ్డు పోసిన నాధుడు లేడు నేడు తాను ఎమ్మెల్యే అయ్యాక గొప్పగా రోడ్లన్నీ బ్రహ్మాండంగా పూర్తి చేస్తున్నామన్నారు.

ఎప్పుడో జమానాలో పోసిన రోడ్లు నేటి వరకు పరిపాలించిన నాయకులు ఒక్కరు కూడా పట్టించుకోలేదు తాను ఎమ్మెల్యే అయ్యాక చౌరస్తా బండి బజార్ ఇతర ప్రధాన రహదారులన్నీ నూనె పోసి ఎత్తుకునే విధంగా తయారు చేశామన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో అంతర్గత సిసి రోడ్లు పనులు జరుగుతున్నాయని ఇప్పటికే చాలా చోట్ల పూర్తయ్యాయని ఎమ్మెల్యే అన్నారు.

ప్రతి ఇంట్లో సంక్షేమం ప్రతి మూల సంతోషం అనే నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పాలన అందిస్తున్నారని 24 గంటల కరెంట్ రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసిఆర్ కిట్ ఆసరా పెన్షన్ ఇంటింటికి త్రాగునీరు ప్రతి చేనుకు సాగునీరు ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే అన్నారు.

వరద ముంపుకు గురికాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఉన్న కేటీఆర్ చేతుల మీదుగా 158కోట్లతో మిగతా డ్రైనేజ్ పనులకు ప్రారంభించుకోవడం జరిగిందని, మురికి నిరుని శుద్దిచేసే ప్లాంట్ సైతం నెలకొల్పడం జరిగిందన్నారు.

గతంలో పరిపాలించిన నాయకులు ఇక్కడ ఏం చేయలేదని ప్రజలకు తియ్యగా ముచ్చట్లు చెప్పి ఓట్లు దండుకున్నారన్నారు

కాంగ్రెస్ పార్టీకి 11సార్లు అవకాశం ఇస్తే ఎం చేయని వాళ్ళు ఇప్పుడేం చేస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే యువకులకు ఏ ఒక్కరు కోచింగ్ సెంటర్ ఏర్పాటుచేసి వారి ఉద్యోగ కల్పనకు దోహదపడలేదన్నారు.

తాను నియోజకవర్గ బిడ్డలు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఉద్యోగాలు సాధించాలని మహేశ్వరి గార్డెన్స్ కోచింగ్, భోజనం, మెటీరియల్ ఏర్పాటుచేసి 110రోజుల పాటు కోచింగ్ ఇవ్వడం జరిగింది.

పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే యోగుల కోసం తన కిట్టులో అందించడం జరిగిందని వారి వ్యాయామాలకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

కరోనా కష్టకాలంలో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు పంపిణీ చేసామన్నారు.

మొన్న దసరా బతుకమ్మ ఉత్సవాలు జరిగితే ఎన్నికల కోడ్ ఉండడం వల్ల నిర్వహణకు ఇబ్బంది తలెత్తితే తాను ఎన్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు.

ఇప్పుడు నాయకులం అంటూ మన చుట్టూ తిరిగే వాళ్ళు మన పండుగలప్పుడు సహాయం అందించకుండా ఎక్కడ పోయారని

కరోనా కష్ట కాలంలో మీరు గుర్తుకు రాలేదు

ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు గుర్తుకు రాలేదు

వర్షాలు పడి వరదలు వచ్చినప్పుడు మీరు గుర్తుకు రాలేదు

నేడు బతుకమ్మ దసరా ఉత్సవాలలో కూడా మీరు గుర్తుకు రాలేదు

దేనికి గుర్తు రానివాళ్లం ఓటు కోసం మాత్రం గుర్తుకు వస్తామా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

నమ్మకానికి మారుపేరు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అని భవిష్యత్ లో కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాది కల్పిస్తామన్నారు.

నిరుపేదలకు షాది ముబారక్, దళిత బంధు, గృహలక్ష్మీ అన్ని అందిస్తామని

ప్రభుతం జీవో ఇచ్చి సాంక్షన్ అయ్యి ఉన్నాయని ఎలెక్షన్ కోడ్ ఆగిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల్లో అపోలు సృష్టించిన వారు కళ్ళు తెరిచి దుపకుంటలో డబల్ బెడ్ రూమ్స్ ని రావాలన్నారు.

కాంగ్రెస్ వాళ్లు టికెట్ల దగ్గర తన్నుకునుడే ఎక్కువ మన గురించి ఏం పట్టించుకుంటారన్నారు

యువకులంతా తన వెంటే ఉన్నారని తనకు పదివేల మంది సైన్యమే ఉన్నారన్నారు

లేనిపోని ఆరోపణలు చేసి అబాసపాలు చేద్దామనుకునే వారిని సోషల్ మీడియా వేదికగా మా యువకులంతా తిప్పికొడతారన్నారు.

మొన్న జక్కలొద్ది దగ్గర రాజకీయం చేద్దామని వెళితే కేజిఎఫ్ సినిమా చూపించారని అటువైపు 30 మంది ఉంటే ఇటువైపు 3,000 మంది ఉన్నారు అన్నారు. 

ప్రజాస్వామ్యంలో మాకు సహాయం చేయాలని కోరితే తాము గులాబీ కండువా కప్పి కేసీఆర్ అండగా ఉంటారని తెలపడం జరిగిందన్నారు

నియోజకవర్గంలోని 41గుడిసె సెంటర్లకు నీళ్లు, రోడ్లు, కరెంటు ఇంటి నెంబర్ ఇలా సకల సదుపాయాలు అందించడం జరిగిందని అట్లాంటి అవసరమే జక్కలొద్ధిలో వచ్చిందని అక్కడి ప్రజలు మూకుమ్మడిగా 3000 కుటుంబాలు సుమారు 8000 ఓట్లు బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగిందన్నారు.

తాను 500 నౌకరి మొదలు పెట్టి కార్పొరేటర్ మేయర్ ఎమ్మెల్యేగా ఎదగడం జరిగిందని కష్ట పడ్డ సొమ్ముతోనే సేవ చేస్తున్నానన్నారు.

ఇప్పుడు ఇక్కడున్న వాళ్లు ఒకరు వర్ధన్నపేట మరొకరు వంచనగిరి అని ఇద్దరు స్థానికేతరులని ఇక్కడ స్థితిగతులు తెలియని వాళ్ళని మన గోసా తెలవని వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారన్నారు

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు పూటకో పార్టీ మారుతున్నారన్నారు. మొదటగా కాంగ్రెస్ తరవాత వైస్సార్సిపి తరవాత బిఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ ఇలా పూటకో పార్టీ మారే చరిత్ర వాళ్ళది ఇంకో వ్యక్తి మొదటగా తెలుగుదేశం తరవాత ప్రజారాజ్యం, మన తెలంగాణ, బిఆర్ఎస్, బీజేపీ ఇలా ఒక్కదగ్గర నిలకడ లేని నాయకులు ప్రజల కోసం నిలకడగా నిలబడతారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని ప్రజలకోసం పని చేస్తే ప్రజలే ఆశీర్వదిస్తారన్నారు.

తాను ఇక్కడే పుట్టానని జీవితకాలం ఇక్కడే ఉంటానని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల ఆపతి సంపదలో ఎప్పటికీ తోడుంటానని అర్థరాత్రి తలుపు తట్టిన మీకు సేవ చేస్తానన్నారు.

నేను గొంతు ఇప్పిడితే వారి బండారం బయటపడుతుందన్నారు.

ఒక విజన్ తో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా చూపానని సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ సాగుతున్న తరుణంలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు.

ఈ పిలగాడు ఎదిగితే ఎట్లా అని కొందరు ఉక్కుపాదం మోపితే కేసీఆర్ ఆశీర్వాదంతో మరో మారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ అందుకొని నేడు బరిలో ఉన్నానన్నారు.

పోయిన ఎన్నికలలో మెజారిటీ కంటే మరింత ఎక్కువ మెజారిటీ ఇచ్చి తనను గెలిపించాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు.

పార్టీలో చేరిన వారందరినీ కాపాడుకుంటానని బాసటగా అండగా నిలిచి అన్ని విధాలా తోడుంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లం పద్మరవి,ముష్కమల్ల అరుణ సుధాకర్, మాజీ కార్పొరేటర్ మెడిద మధుసూదన్, డివిజన్ అధ్యక్షులు మీరుపల్లి వినయ్,పొగాకు సందీప్ పూజారి విజయ్ బొరిగం నర్సింగం, బిఆర్ఎస్ నాయకులు మండల శ్యామ్, భూపాల్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు యూత్ నాయకులు హాజరయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని చార్బోలి నోబెల్ ఫంక్షన్లో జరిగిన చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

ఈ సందర్భంగా సిఐటియు ఉపాధ్యక్షులుగా మహమ్మద్ మహబూబ్ పాషా వారి బృందం సుమారు 50 మంది తో పాటు మైనారిటీ మహిళలు నేడు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

దేశంలో మైనార్టీ మహిళలకు షాదీ ముబారక్ ఇచ్చిన చరిత్ర ఏ నాయకుడికి లేదని అది కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యమైందన్నారు.

ఆసరా పెన్షన్ 2వేల నుండి 5వేలకు వికలాంగుల పెన్షన్ 4వేల నుండి 6వేలకు పెంచుతున్నారని

మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా మూడు వేల రూపాయలు అందించబోతున్నారని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే అందిస్తామని ముఖ్యమంత్రి  మేనిఫెస్టోలో చేర్చడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.

11 సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను ఓట్లుగా వాడుకున్నారే తప్ప వారి అభివృద్ధికి తోడ్పాటునందించలేదన్నారు.

మైనారిటీలను గొప్పగా ఆదుకొని వారి అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చింది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనన్నారు.

వరంగల్ తూర్పులో మైనార్టీలకు భారీగా నిధులు కేటాయించడం జరిగిందని మైనారిటీ బంధుతో సాయపడ్డామన్నారు.

రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని బలపరుస్తూ కారు గుర్తుపై ఓటు వేసి తనకు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,డివిజన్ ఇన్చార్జులు ముఖ్య నాయకులు హాజరయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 25వ డివిజన్ కార్పొరేటర్ బసవరాజు శిరీష శ్రీమాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అఖిలభారత యాదవ సంఘం అధ్యక్షులు ప్రతాప్ యాదవ్, ధర్ములు కుమార్, కృష్ణమూర్తి శ్రీను, సునీల్, సది, షరీఫ్ తో పాటు సుమారు 40 మంది నేడు ఎల్లం బజార్ శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి సమీపంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని విస్మరించి అభివృద్ధి చేయకుండా వదిలేశారని తమ సొంత లాభం కోసం మాత్రమే పాటుపడ్డారు తప్ప ప్రజల బాగోగుల కోసం ఏ రోజు కృషి చేయలేదన్నారు.

తాను ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గానికి 4100కోట్ల అభివృద్ధి పనులను తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఒక వైపు విద్యా మరోవైపు వైద్యంతో పాటు యువతకు ఉపాధి కల్పించే దిశగా తాము అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

కరోనా కష్టకాలంలో 25వేల మందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశామని, ఉపాది శిక్షణలో భాగంగా యువతీ యువకులకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశానన్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు తాను వ్యక్తిగతంగా చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రజల బాగు కోరి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్న తనకు అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు.

సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్లో పనిచేసిన నాయకులను సైతం తమ వెంట వస్తున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వరంగల్ తూర్పు నియోజకవర్గం అందరి సహకారంతో గొప్పగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

రాబోవు ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి వరంగల్ తూర్పున గులాబీ జెండా ఎగరేయాల్సిందిగా కోరారు.

కార్యక్రమంలో కార్పొరేటర్ బసవరాజు శిరీష

 శ్రీమాన్, డివిజన్ అధ్యక్షులు అల్తాఫ్, జెడ్ఆర్సిసి మెంబర్ చింతాకుల సునీల్, గోరంట్ల రాజు,మాశుఖ్,అక్రమ్,మస్తాన్ గుమ్మడి శ్యాం, డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు హాజరయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పేద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:29:(మేడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్):

గ్రహాంతర వాసులకు రామగుండంలో చోటు లేదు రామగుండం శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్,రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలమైన రాజకీయ శక్తి...60 వేల సాధారణ 15 వేల క్రీయశీల సభ్యులు కలిగి ఉంది బీఆర్ఎస్ పార్టీ...రామగుండం నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.గోదావరిఖని చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రామగుండం అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జి నారదాసు లక్ష్మణరావుతో కలిసి ఎమ్మెల్యే  మాట్లాడరు..టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి రామగుండం నియోజకవర్గంలో ఒక బలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఎదిగిందన్నారు.రామగుండం నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టానని, రోడ్లు,డ్రైనేజీలు,చౌరస్తాల సుందరీకరణ చేపట్టామన్నారు.ప్రజల అవసరాలను తీర్చుతూ ఈ ప్రాంతానికి మెడికల్ కళాశాల,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం,26 కోట్లతో సివిల్ జడ్జి కోర్టు భవనం ఈ ప్రాంతానికి మాంజూరు చేయుంచామని తెలిపారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్  సంపదను పెంచుతూ పేదలకు పంచుతున్నారని అలాంటి  కెసిఆర్ ని  మూడవసారి ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలంతా సిద్ధపడ్డారని తెలిపారు.ఇంత చేస్తున్న ఓర్వలేని కొందరూ సోషల్ మీడియా వేదికగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని,తనకు సంబంధంలేని విషయాలను అంటగడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరన్నారు.ప్రశాంతంగా వుండే రామగుండంలో కిరాతక రాజకీయానికి తెరలేపుతూ ఒక అలజడిని సృష్టించాలని చూస్తున్నారని పేర్కొన్నారు,రామగుండం ప్రజలు చైతన్యవంతులని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే అబద్దపు ప్రచారాలను నమ్మరని పేర్కొన్నరు,ఈ విలేఖరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు,మాదాసు రామ్మూర్తి,నడిపెల్లి మురళీధర్ రావు,చెరుకు బుచ్చిరెడ్డి,నూతి తిరుపతి,తోడేటి శంకర్ గౌడ్,ఇంజపురి నవీన్  నారాయణదాసు మారుతీ,చల్లగురుగుల మొగిలి,పర్లపల్లి రవి,రాకం దామోదర్,జక్కుల తిరుపతి,చిప్ప రాజేశం,అమరేందర్,జక్కుల తిరుపతి,మహంకాలి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి:గోదావరిఖని:సెప్టెంబర్:29:23:(మేడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్):

రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఠాగూర్ మక్కన్ సింగ్ గెలుపు కోసం,కాంగ్రెస్ పార్టీ బూతు లెవెల్ ఏజెంట్స్,బిఎల్ఎ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్  ఏఐసీసీ నాయకులు మొహన్ జోషి,మాట్లాడారు,బీఆర్ఎస్ రాక్షస పాలన పోవాలంటే..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ను మీరంతా అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి,రామగుండం నియోజకవర్గ ప్రజలకు,బీఆర్ఎస్ అవినీతి పాలన దుర్మార్గానికి జరుగుతున్న ధర్మ యుద్ధమే ఈ ఎన్నికలు-మక్కన్ సింగ్,గోదావరిఖని,దుర్గనగర్ లోని ఆర్కే గార్డెన్ లో ఆదివారం రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో శిక్షణ తరగతులకు రామగుండం నియోజకవర్గoలోని 262 పోలింగ్ బూత్ లలో పాల్గొనబోయే కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ భారీ సంఖ్యలో హాజరైనారు,నవంబర్ 30న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు,కార్యకర్తలు సైనికులు లాగా పనిచేయాలి ఓటర్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మలుచుకునే ప్రయత్నం చేయాలి,న్యూటల్లో ఉన్న ఓటర్లను పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలి ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా వారిని నిరంతరం మోటివేట్ చేస్తూనే ఉండాలి,ఓటింగ్ జరుగుతున్న పోలింగ్ బూత్ లో ఎలక్షన్ జరిగే ముందు ఏ విధంగా బూతులేవల్ ఏజెండ్స్ జాగ్రత్తపడాలి,అబ్జర్వ్ చేయాలి ఏ విధంగా స్పందించాలి బూతు లెవల్ ఏజెంట్స్ బాధ్యతలు ఏమిటి  తప్పుడు పోలింగ్ జరగకుండా ఏ విధంగా స్పందించాలి అనే విషయాలతో పాటు,విధి విధానాల గురించి,ప్రతి ఒక్క అంశాన్ని బూతు లెవెల్ ఏజెంట్స్ కి తెలియజేసే విధంగా డిజిటల్ స్క్రీన్ పై మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ సమక్షంలో జరిగిన సమావేశానికి వేలాదిగా తరలివచ్చిన బిఎల్ఎ ఏజెంట్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు,మహిళా నాయకురాళ్లకు వివిధ కమిటీల అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు కార్పొరేటర్స్ కు,క్షుణ్ణంగా బూత్ లెవల్ ఏజెంట్స్ విషయాన్ని గుర్తు ఉంచుకొని తూచా తప్పకుండా పాటించగలరని మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ పేర్కొన్నారు.నిరంతరము ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై సింగరేణి పారిశ్రామిక,రామగుండం పారిశ్రామిక ప్రాంతము రైతన్నలకు విద్యార్థులకు కర్షకులకు వ్యాపారస్తులకు జరుగుతున్న అన్యాలపట్ల పోరాటం చేస్తూనే ఉన్నా,రేపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా రామగుండం నియోజకవర్గ ప్రజ సమస్యల పట్ల పోరాటం చేస్తూ,సేవ చేస్తూనే ఉంటా ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా రామగుండం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి చేతి గుర్తుకు ఓటు వేసి మక్కన్ సింగును భారీ మెజార్టీతో గెలిపించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేసినారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు 36వ డివిజన్ కార్పొరేటర్ బొంతల రాజేష్,కార్పొరేటర్స్,ఆయ విభాగాల అధ్యక్షులు,ఉపాధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు మహిళా సంఘం నాయకులు కార్యకర్తలు బిఎల్ఎ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

                                         

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:29:(మేడీగడ్డ టీవీ న్యూస్ ఛానల్):

సోమారపు గెలుపు కోసం,కాంగ్రెస్ పార్టీ వీడి రామగుండం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు మద్దతుగా సుమారు 100 మంది ఆదివారం గోదావరిఖని గౌతమ్ నగర్ లోని సోమారపు సత్యనారాయణ స్వగృహంలో పాలకుర్తి మండలం,బసంత్ నగర్ కి చెందిన శెట్టి సంపత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు 100 మంది స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణ గెలువుకోసం కలిసి కట్టుగా పనిచేస్తామని తెలిపారు,గతంలో సత్యనారాయణ  అవినీతి రహిత పాలన అందించారని,అందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజా సేవ చేసిన నాయకుడిని సేవలు గడపగడపకు తిరిగి గెలిపించుకుంటామని పేర్కొన్నారు,కేవలం టూరిస్ట్ లాగా వచ్చే వాళ్లకు,అవినీతి పరులకు ఓట్ ద్వారా తగిన బుద్ది చెప్తామని,సూపరి పాలన అందాలంటే,రామగుండము అన్నిరంగాలలో అభివృద్ధి చెందాలంటే,సోమారపు సత్యనారాయని భారీ మెజారిటితో గెలిపిస్తామని తెలిపారు,ఈకార్యక్రమంలో ముదంగుల రాజం,జట్ పట్ కొమురయ్య,ముదంగుల చందు,జట్ పట్ రాజం,ధరంగుల కుమార్,ధరంగుల సాగర్,ముధంగుల అనిల్,జట్ పట్ శ్రీనివాస్,జట్ పట్ రమేష్,అధిక సంఖ్యలో వారి అనుచరులు తదితరులు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ



హైదరాబాద్,బీజేపీ కార్యాలయ

కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి  ఆధ్వర్యంలో మాజీ ఎంపీ శ్రీ గడ్డం వివేక్ గారు మరియు మాజీ మంత్రివర్యులు, బీజేపీ పార్టీ చేరికల కమిటీ అధ్యక్షులు శ్రీ ఈటెల రాజేందర్ , ఎంపీ శ్రీ లక్ష్మణ్  పిలుపు మేరకు మంథని నియోజకవర్గంలో హత్య రాజకీయాలు, అక్రమాలకు తావు లేకుండా రూపు మాపడానికి మంథని నియోజకవర్గంలో నూతన రాజకీయ ఒరవడికి నాంది పలకడానికి ఈ రోజు మంథని నియోజకవర్గానికి చెందిన చల్లా నారాయణ రెడ్డి  మరియు వారి అనుచరులు, ప్రజాప్రతినిధులు దాదాపు ఈ 300 మందితో ఈ రోజు భారత జనతా పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా  నిర్వర్తించాలని 

 సీపీ అంబర్ కిషోర్ ఝా

అధికారులను ఆదేశించారు.

శనివారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో సీపీ హనుమకొండ, వరంగల్ కలెక్టర్ లతో జిల్లా ఇంటల్లేజెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ఎన్నికల మార్గదర్శకాలను అధికారులు సంపూర్ణ అవగాహనా కలిగి ఉండాలి అన్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడంతో జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని టీం లు  నిబద్ధతతో కలసి పనిచేస్తూ రోజు వారీ నివేదికలను అందించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో అక్రమ మద్యం, నగదు  పై గట్టి నిఘా ఉంచాలని, పట్టుకున్న నగదు జమకు సత్వరమే అకౌంట్ ఏర్పాటు  ఆదేశించారు. చెక్ పోస్ట్ లలో నిఘా పెంచి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని నగదు దొరికితే ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ కి అన్ని ఆధారాలతో సమర్పించాలని సూచించారు. సరి అయినా ఆధారాలు సమర్పించిన వారి నగదు ను నిబంధన ల ప్రకారం విడుదల చేయాలి అని అన్నారు.అక్రమ మద్యం , నల్ల బెల్లం, నాటు సారా పై గట్టి నిఘా ఉంచి నిరంతర తనిఖీలు చేపట్టాలని పట్టుబడిన వాహనాలను సీజ్ చేయాలని సూచించారు. అక్కౌంట్ బదిలీలను  అలాగే  లావాదేవీలు నిరంతర పరిశీలన చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు వాణిజ్య పరమైన లావాదేవీలపై నిరంతరం నిఘా ఉంచాలని , తనిఖీలు చేయాలని సూచించారు. సున్నిత మైన పోలింగ్, సమస్యత్మక పోలింగ్ కేంద్రల పై ప్రత్యేక శ్రద్ద వహించాలి అని అన్నారు. ఎన్నికల నిర్వహణ పై ఉన్నత స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని, అధికారులు ఎన్నికల విధులలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికి రాదని తెలిపారు.ఫిర్యాదులపై  నోడల్‌ అధికారులు ఎప్పటికప్పుడు స్పందించే విధంగా ఉండాలని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ మాట్లాడుతూ సీజ్ అయినా నగదు, బంగారం, మరియు ఇతరతర వస్తువులు స్వాధీనం చేసుకున్నప్పుడు సరి అయినా పత్రలతో రికార్డ్ లో నమోదు చేయాలి అన్నార. నామినేషన్ల పరిశీలన గట్టం పై పూర్తి అవగాహన ఉండాలి అన్నారు.

ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాలను లను పరిశీలించాలని వాటి లో ఉన్న శానిటైజేషన్, త్రాగు నీరు, విద్యుత్ మరే ఇతర సమస్యలు ఉన్నా తప్పకుండా వెంటెనే పరిష్కరించాలి అన్నారు . వచ్చే వారం రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వస్తారు కనుక అధికారులు సమగ్ర నివేదిక వివరాలతో సిద్దంగా ఉండాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు మహేందర్ జి, అశ్విని తానాజి, డి.అర్.ఓ. గణేష్, డీసీపీ భారి, లోకల్ బాడీ, ట్రైనీ  కలెక్టర్,  రెవెన్యూ, నోడల్, ఇంటెలిజెన్స్, ఎక్సర్సైజ్ , ట్రెజరీ, ఇన్కమే టాక్స్ అధికారులు, డీసీపీలు, ఏసీపిలు, తదితరులు హాజరు అయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

పెద్దపల్లి:కమాన్ పూర్:అక్టోబర్:28:2023:మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి బీఆర్ఎస్‌ పార్టీలోకి బారీ చేరికల పర్వం కొనసాగుతోంది.కమన్ పూర్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుక్క చంద్రమౌళి,సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితుడై,పుట్ట మధుకర్ చేసే ప్రజాసేవను చూసి శనివారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినారు,మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ కండువా కప్పి భీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వనించారు.ఈ చేరికలో పాల్గొన్నవారు.కమాన్పూర్ మండల్ అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి,సీనియర్ నాయకులు ఇనుగంటి రామారావు,జూలపల్లి సర్పంచ్ గొల్లపల్లి శంకర్ గౌడ్,పెంచికలపేట సర్పంచ్ కొండ వెంకటేష్ గౌడ్,నాయకులు మెరుగు వెంకటేష్,గొల్లపల్లి లక్ష్మయ్యగౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా అన్నారు. శనివారం హనుమకొండ ఏకాశిల పార్క్ నుండి హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అంగన్వాడి టీచర్లు, మెప్మా, మున్సిపల్ సిబ్బందితో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా ముఖ్యఅతిథిగా హాజరై ఓటర్ ప్రతిజ్ఞ చేపించి, పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా మాట్లాడుతూ. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవవచ్చునని

తెలంగాణ రాష్ట్రం లో రాబోయే 8 నెలల్లో 4సార్లు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వస్తుందనీ ఓటు వేయడాన్ని ఓక బాధ్యత గా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనీ అన్నారు.

పోలింగ్ కేంద్రాలు మీ ఇంటికి కేవలం 2కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయనీ వికలంగులు, వృద్దులు ఓటు వేసేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందనీ అన్నారు. గత ఎన్నికలలో మన జిల్లా వ్యాప్తంగా 59% శాతం పోలింగ్ నమోదయిందనీ నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో పోలింగ్ 100% శాతాన్ని పెంచేందుకు ఈ రోజు ఓటర్ అవగాహన ర్యాలీ జరిగిందని ట్రైనీ కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మెప్మా పి.డి. భద్రు నాయక్, ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ హరి ప్రసాద్, మెప్మా డీ.ఎం.సీ. రజిత రాణీ, మెప్మా ఏ.డి.ఎం.సి. వెంకట్ రెడ్డి, సి.ఒలు శ్రీనివాస్ , నాగరాజు, రమేష్, శ్రీలత, స్వాతి ,సునీల్  మరియు అర్.పి పలు, పలు మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడి టీచర్లు, ఆయాలు,  పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

 సమాజంలో శాంతి స్థాపన కోసం, అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా పోలిసు శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ఓపెన్ హౌస్, మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా, ఎస్పి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల స్ఫూర్తితో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతామని, అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాలపై ఉందని తెలిపారు. ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. నూతన జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్, జయశంకర్ సెంటర్ మీదుగా 5 ఇంక్లైన్ నుంచి జిల్లా కేంద్రంలోని పోలీసు అమరవీరుల స్థూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ లో ఎస్పి స్వయంగా పాల్గొని పోలీసు సిబ్బంది, యువతలో ఉత్సాహం నింపారు. పోలీసు సేవలపై అవగాహనకే ఓపెన్ హౌస్ ఎస్పి కిరణ్ ఖరే పోలీస్ శాఖ అందిస్తున్న సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహిoచామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా అర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే పోలీస్ అధికారులు, ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని సందర్శించి, విద్యార్థులతో మమేకమయ్యారు. పోలీస్ శాఖ నిర్వహించే వివిధ ఆయుధాలు, అత్యాధునిక పరికరాల పట్ల అవగాహన కల్పించి, వారిలో స్ఫూర్తి నింపారు. పోలీస్ శాఖ కేసుల చేధనలో ఉపయోగించే సాంకేతికత, కమ్యూనికేషన్, బాంబు డిస్పోజల్, బాంబ్ డిటెక్షన్, వివిధ ఆయుధాలు, వేలిముద్రల సేకరణ, ఇతర పరికరాల గురించి వివరించారు ఈ ఓపెన్ హౌజ్ లో వివరించారు.

పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఎస్పి కిరణ్ ఖరే 

పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా పోలిసు శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటి వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించగా, ముఖ్య అతిధిగా హాజరైన ఎస్పి కిరణ్ ఖరే రక్తదానం చేసి బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని,

రెగ్యులర్ పోలీసింగ్ తో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు, రక్తం చాలా అవసరనని అన్నారు. పోలిసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో సుమారు 150 మంది పోలీసులు, యువత , ప్రజలు రక్తదానం చేసి, విజయవంతం చేయడం జరిగిందని ఎస్పి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఏ.ఆర్) వి. శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు, డాక్టర్లు నవీన్, కిరణ్, శ్రీనివాస్, జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, యువత, ప్రజలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై మాజీ కార్పొరేటర్ యేలుగం లిలావతి సత్యనారాయణ మరియు యూత్ నాయకులు బాషకార్ల హరికృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ వరంగల్ జిల్లా యువ మోర్చా ఉపకోశాధికారి,వరంగల్ తూర్పు యువ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ జమరపు హనుమాన్  శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే  నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ హనుమాన్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన తాను చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరిన హనుమాన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీలో చేరిన వారందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు.

బీజేపీ పని అయిపోయిందని బీజేపీ నాయకత్వాన్ని వారి నాయకులే నమ్మే పరిస్థితి లేదని ఆ పార్టీలో ఉంటే ఎదుగుదల ఉండదని అందుకే రోజు రోజుకు మూకుమ్మడిగా బిఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు.

కేసీఆర్ నాయకత్వన కేటీఆర్ మార్గనిర్దేశంలో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు ఉంచామన్నారు 24అంతస్తుల హాస్పిటల్,7 గురుకులాలు, నూతన బస్ స్టేషన్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కలెక్టరేట్ ఇలా అభివృద్ధి చేసుకుంటూ సాగుతున్నామని ఎమ్మెల్యే అన్నారు.

బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనేది ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసని వారిని తిరస్కరించడానికీ ప్రజలు కంకనబద్ధులై ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు.

గతపాలకుల హయాంలో అభివృద్ధికి నోచుకోని ఓరుగల్లు తాను మేయర్ ఎమ్మెల్యే అయ్యాక 4వేల కోట్లతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే తెలిపారు.

నేడు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన హనుమాన్ మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ పట్ల అవలంభిస్తున్న తీరు వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకత్వం నచ్చక నేడు బిఆర్ఎస్ లో చేరడం జరిగిందని వరంగల్ తూర్పులో గులాబీ జెండా ఎగరెయ్యడానికి కంకణబద్ధులై పని చేస్తామని  రాబోవు ఎన్నికల్లో నరేందర్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు.