ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

 ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టులాంటిదని అసిస్టెంట్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు నోడల్ ఆఫీసర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు,సఖి వన్ స్టాప్ సెంటర్, జిల్లా మహిళా సాధికారత కేంద్రం, బాలసదనం, సిపిఓ కార్యాలయ మహిళా ఉద్యోగులు ఓటరు చైతన్యంపై నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ కలెక్టర్ శ్రద్ధా శుక్ల హాజరై మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకునేలా చైతన్యం కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని చైతన్య వంతం చేస్తూ అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఓటరు చైతన్యంపై వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతి ఐసిడిఎస్ రాయపుర సెక్టార్ కు చెందిన మాధవి, తబిత, సబిత అందుకోగా, ద్వితీయ బహుమతి సోమిడీ సెక్టార్ కు చెందిన రఘు కుమారి, శ్రీదేవి, ఎం కవిత, తృతీయ బహుమతి వడ్డేపల్లి సెంటర్ కు చెందిన ఎన్. సునీత, జె.హేమలత, ఆర్ శ్రీలత బహుమతులు అందుకున్నారు. పలువురికి కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ముగ్గుల పోటీలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంస పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. మధురిమ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, జిల్లా ఆడిట్ ఆఫీసర్ నీరజ, డిసిపిఓ పి.సంతోష్ కుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్. ప్రవీణ్ కుమార్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు. తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: