మెడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్ బ్యూరో ఆఫ్ తెలంగాణ:పుట్ట రాజన్న

   



                              పెద్దపల్లి:గోదావరిఖని:రూరల్:అక్టోబర్:31:23:పూటకో మాట మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటాలు నమ్మవద్దని...సింగరేణి కార్మికుల పక్షపాతి సిఎం కేసీఆర్‌ అని..సింగరేణి కార్మికుని బిడ్డగా..కార్మికుల కష్టసుఖాలు తెలిసిన వాడిగా..ఉద్యమ నాయకుడిగా,మీకు మరింతసేవలందించడానికే తపన పడుతున్నానని కార్మికన్నాలు బిఆర్ఎస్ పార్టీకి మద్దతూగా నిలిచి నవంబర్ 30 వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని  రామగుండం నియోజకవర్గ అభ్యర్థి,ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు.సింగరేణి సంస్థ ఆర్జీ-2 పరిధి వకిల్ పల్లి సమీపంలో  సోమవారం నిర్వహించిన ప్రజా అంకిత యాత్ర నిర్వహించారు.కార్మికులను కలుసుకొని పేరుపేరునా పలకరించారు.వకీల్ పల్లె గని కార్మికులు30మంది బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకిఆహ్వానించారు,అనంతరం ఆయన మాట్లాడరు,కోల్ ఇండియాలో ఎక్కడా లేనివిధంగా ఉద్యోగ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దే నన్నారు.మారుపేర్ల సవరణ మినహా సాధారణ ఎన్నికలలో,గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవితక్క నెరవేర్చారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పోగొట్టిన వారసత్వ ఉద్యోగ హక్కును మెడికల్ ఇన్ వాలిడేషన్ పేరుతో తిరిగి పునరుద్ధరించడం జరిగిందన్నారు.సింగరేణి కార్మికులు దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులతో సమానమని,ఐటీ రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే,బిజెపి కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోద ముద్ర వేయలేదన్నారు.దానికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి,కుంభకోణాలను సాకుగా చూపి బొగ్గు గనులను వేలం పాట ద్వారా ప్రైవేటుపరం చేసే ఎంఎండిఆర్-2014 యాక్ట్ ను ప్రవేశపెట్టిందన్నారు.గనులను ప్రైవేటుపరం చేస్తే లాభాల వాటా కార్మికులకు ఎలా లభిస్తుందన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు ఆజ్యం పోస్తున్న కాంగ్రెస్,బిజెపి పార్టీలకు ఈ ఎన్నికలతో తగిన బుద్ధిచెప్పాలన్నారు.పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారన్నారు.సంపద పెంచాలి పేదలకు పెంచాలి అనే గొప్ప సంకల్పంతో పాలన చేస్తున్న కేసీఆర్ రాష్ట్ర సాధనలో ఏవిధంగా అండగా ఉన్నామో,భాగస్వాములమయ్యామో,బంగారు తెలంగాణ నిర్మాణంలో,అభివృద్ధిలో కూడా భాగస్వాములం కావాలని పిలుపునిచ్చారు.బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఐటీ మినహాయింపును సాధిస్తుందన్నారు.కష్టకాలంలో సంజీవని పోసి బ్రతికించిన ప్రజలకు,నాజీవితం ఉన్నంతవరకు సేవ చేస్తానని,సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.నియోజకవర్గంలో గతపాలకులు ఎవరూ చేయని అభివృద్ధిని చేసి చూపించానని సింగరేణి సీఎండితో మాట్లాడి పోతన కాలనీ-యైటింక్లైన్ కాలనీ మధ్య బ్రిడ్జి నిర్మాణం,వెజిటబుల్ మార్కెట్,కమ్యూనిటీ హాల్,ఆర్వో ప్లాంట్ వంటి మెరుగైన సౌకర్యాలనుకల్పించి.గతంలో గోదావరిఖనిలోని వైద్యశాలల్లో కనీసం వెంటిలేటర్ సౌకర్యం కూడా ఉండేది కాదని,కార్మికులకు ఏ జబ్బు వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్స్ కి రెఫర్ చేయాల్సిన పరిస్థితి ఉండేదని,కోట్లాది రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లకు ధారా దత్తం చేయాల్సి వచ్చిందన్నారు.ఒక్క కోవిడ్ సమయంలోనే 75 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థ కార్మికుల కోసం సంస్థ ఖర్చు చేసిందన్నారు.దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికులకు,ప్రజలకు అనారోగ్యపరమైన ఏఅవస్థ వచ్చినా ఏప్రైవేటు హాస్పిటల్ ను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రం కాకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి మెప్పించి,గోదావరిఖనిలో మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగిందన్నారు.330పడకలు,60 మంది నిష్ణాతులైన ప్రొఫెసర్లు,సింగరేణి కార్మికులకు స్పెషల్ వార్డు,పిల్లలకు ఎంబిబిఎస్ సీట్లలో ఐదు శాతం కోటాను ముఖ్యమంత్రి కేసీఆర్,వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుతో ప్రకటింపజేసిన విషయం గుర్తు తెచ్చుకోవాలన్నారు.నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం ఐటి,ఇండస్ట్రియల్ పార్కులను కూడా త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఇటీవల గోదావరిఖనికి వచ్చిన ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో శంకుస్థాపన చేసినప్పుడు,రామగుండంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే,రామగుండంను దత్తత తీసుకొని సకల సౌకర్యాలు సమకూరుస్తానని మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని ప్రతి ఒక్కరు నెమరు వేసుకోవాలని.నా జీవితం ఉన్నంతవరకు మీ సంక్షేమం కోసమే పరితపించే నన్ను,కారు గుర్తుకు ఓటు వేసి మరొకమారు ఎమ్మెల్యేగా గెలిపించి మీకు సేవ చేసే అదృష్టాన్ని కలిగించాలని,తద్వారా కెసిఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ ప్రచారంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మూల విజయరెడ్డి,ఆర్జీ-2ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్,బిఆర్ఎస్,టీబీజీకేఎస్ నాయకులు జహిద్ పాషా,భానకర్ తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో వకిలపల్లి గని కార్మికులు సుజిత్ రెడ్డి,పాల్ రవికుమార్,శ్రావన్ కుమార్,దీక్షిత్,జంపన్న,వెంకటేష్,రాజేశ్వర్,తిరుపతి,ఆజాద్ వినోద్,సుభాష్ శ్రావన్,రాజ్ కుమార్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: