ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై మాజీ కార్పొరేటర్ యేలుగం లిలావతి సత్యనారాయణ మరియు యూత్ నాయకులు బాషకార్ల హరికృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ వరంగల్ జిల్లా యువ మోర్చా ఉపకోశాధికారి,వరంగల్ తూర్పు యువ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ జమరపు హనుమాన్  శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే  నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ హనుమాన్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన తాను చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరిన హనుమాన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీలో చేరిన వారందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు.

బీజేపీ పని అయిపోయిందని బీజేపీ నాయకత్వాన్ని వారి నాయకులే నమ్మే పరిస్థితి లేదని ఆ పార్టీలో ఉంటే ఎదుగుదల ఉండదని అందుకే రోజు రోజుకు మూకుమ్మడిగా బిఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు.

కేసీఆర్ నాయకత్వన కేటీఆర్ మార్గనిర్దేశంలో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు ఉంచామన్నారు 24అంతస్తుల హాస్పిటల్,7 గురుకులాలు, నూతన బస్ స్టేషన్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కలెక్టరేట్ ఇలా అభివృద్ధి చేసుకుంటూ సాగుతున్నామని ఎమ్మెల్యే అన్నారు.

బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనేది ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసని వారిని తిరస్కరించడానికీ ప్రజలు కంకనబద్ధులై ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు.

గతపాలకుల హయాంలో అభివృద్ధికి నోచుకోని ఓరుగల్లు తాను మేయర్ ఎమ్మెల్యే అయ్యాక 4వేల కోట్లతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే తెలిపారు.

నేడు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన హనుమాన్ మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ పట్ల అవలంభిస్తున్న తీరు వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకత్వం నచ్చక నేడు బిఆర్ఎస్ లో చేరడం జరిగిందని వరంగల్ తూర్పులో గులాబీ జెండా ఎగరెయ్యడానికి కంకణబద్ధులై పని చేస్తామని  రాబోవు ఎన్నికల్లో నరేందర్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: