మేడి గడ్డ టివి న్యూస్ అందోల్ నియోజక వర్గం ప్రతినిధి పవన్
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం వట్పల్లిలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో ఆలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ గాయకుడు గోరేటి వెంకన్న, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ మఠం బిక్షపతి, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ జెడ్పి చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు జమ్మిచెట్టుకు పూజలు చేసి మాట్లాడుతూ పాలపిట్ట లాంటి మంచి మనసున్న వ్యక్తి కేసీఆర్ అన్నారు.కాంగ్రెస్ అంటే నయవంచన టీఆర్ఎస్ అంటే ఒక నమ్మకం అన్నారు.ఆనాడు తెంగాణ కోసం 11 రోజులు ఆమరణ దీక్ష చేసి కేసీఆర్ ఢిల్లీమెడలు వంచిండని తెలంగాణను నిలబెట్టుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్షాలు ఆగం చేయాలని చూస్తున్నాయని కాంగ్రెస్ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యం పక్కనున్న కర్ణాటక పరిస్థితులే ఎగ్జాంపుల్ అని ఆరోపించారు.కాంగ్రెస్ అంటే నే ఝూటాకోర్ పార్టీ అని పల్లేరు మొలిచే నేలలో..కేసీఆర్ పసిడి సిరులు పండేలా చేసాడు అని విమర్శించారు.కాంగ్రేసోళ్లు సింగూర్ నీళ్లను ను హైదరాబాద్ కు తరలిస్తే.. ఇప్పుడు ఆ నీళ్లను మీ పంట పొలాలకు తెచ్చి ఉమ్మడి మెదక్ జిల్లాకు సస్యశ్యామలం చేసాడని అన్నారు.


Post A Comment: