ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారత ప్రధమ హోమ్ శాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. మంగళ వారం వల్లభాయ్ పటేల్ జయంతి “జాతీయ ఐక్యత దినోత్సవం” ను పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పి జాతీయ ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించి, పటేల్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించి, పోలీస్ అధికారులు, సిబ్బందితో ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ పోరాటమే ఊపిరిగా వల్లా భాయ్ పటేల్ ప్రస్థానం కొనసాగిందన్నారు. దేశ సమగ్రత కోసం శ్రమించిన ధీరుడు పటేల్ అని ఎస్పి తెలిపారు. చిన్నచిన్న రాజ్యాలను దేశంలో విలీనం చేసిన ఘనత ఉక్కుమని సర్దార్ పటేల్ కే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి (ఏఆర్ ) వేముల శ్రీనివాస్, డీఎస్పీ నారాయణ నాయక్, ఇన్స్పెక్టర్లు వేణుచందర్, సూర్య ప్రకాష్, రామ్ నర్సింహారెడ్డి, రవీందర్, డిపిఓ ఏఓ వసీం ఫర్జానా, సూపరింటెండెంట్ సోఫియా సుల్తానా, సిసి ప్రదీప్ కుమార్, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: