ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్,ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా , అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, డిఆర్వో గణేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ సమగ్రతకు పాటుపడాలన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా దేశ సమైక్యతను కాపాడుకుందాం అని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: