పెద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:29:23(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్:బ్యూరోఆఫ్ తెలంగాణ):మంథని వాసులు"ఖని"లో నివాసం ఉంటున్న వారితోసమావేశంలో,జక్కుల సతీష్-రజిత వివాహదినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలో నివాసముంటున్న మంథనిప్రాంతవాసులతో గోదావరిఖనిలోని ఒక ఫంక్షన్ హాల్ లోనిర్వహించిన సమావేశానికి మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై"వివాహదినోత్సవంరోజున"వివాహితులైన జక్కుల సతీష్-రజితలను ఆశీర్వదించి.శుభాకాంక్షలు తెలిపారు,ఎన్నికల సమరం వేల మంథని నియోజకవర్గంలోని ప్రజలు ఉద్యోగాలుగా,వ్యాపారాల రీత్యా గోదావరిఖనిలో నివాసముంటున్న వారందరూ ఒక వేదికగా సమావేశమైన సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు,ఎన్నికల యుద్ధం మొదలైనది అందరూ అప్రమత్తంగా ఉండాలి,కాంగ్రెస్ వాళ్లు వచ్చి కళ్లి-బుల్ల మాటలు చెప్పి నక్క విన్యాసాలు ప్రదర్శించి,డబ్బు సంచులతో వచ్చి మాయ మాటలతో మభ్యపెడతారని 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మంథని మాయజ్వాల కారు చీకటిగానే మిగిలిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చి మంథని నియోజకవర్గ ప్రజల ముందు నిలబెడితే అందరూ ఒక తాటిగా గెలిపించుకున్నారని ఆ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే పదవి కాలంలో 30 ఏళ్ల చీకటిని తొలగించానని స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని తెచ్చానని ప్రజల సేవకుడిగా ఎన్నో సేవలు చేశానని,మళ్లీ 2018లో డబ్బు సంచులతో వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాయ మాటలకు మోసపోయి ఎమ్మెల్యేగా గెలిపిస్తే, మంథని నియోజకవర్గంలో ప్రజా పాలన కుంటు పడకూడదని సీఎం కేసీఆర్ జెడ్పీ చైర్మన్గా అవకాశం కల్పిస్తే సేవ చేస్తున్నానని,ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ప్రజా సమస్యలు తీర్చకుండా ప్రజలను గాలికి వదిలేసి హైదరాబాదులో ఉంటూ చుట్టపు చూపుగా వచ్చిపోయే శ్రీధర్ బాబు,మళ్లీ డబ్బు సంచులతో అన్నదమ్ములు ఇద్దరు వస్తున్నారు వారి పట్ల జాగ్రత్తగా ఉండి తిరస్కరించాలని,బిసి,బహుజన బిడ్డనైన పుట్ట మధును మీరంతా ఐక్యతతో ఎక్కడెక్కడ చుట్టాలు ఉంటే వారందరితో మాట్లాడుతూ కొంతటైం కేటాయించి ప్రభుత్వ పనితీరు చర్చ పెట్టాలని ప్రతి గడపగడపకు సంక్షేమ ఫలాలు,మేనిఫెస్టో తీసుకువెళ్లి ప్రజలకు వివరించి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మళ్లీ మీ సేవకునిగా ఉంటానని,అక్కరకు రాణి 6 గ్యారంటీల కాంగ్రెస్ మాయ మాటలకు మోసపోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ,కారు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసినారు,ఈ హాజరైన వారంతా ఐక్యతతో జై తెలంగాణ జై కేసీఆర్ జై జై పుట్ట మదన్న కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదించారు..

Post A Comment: