పెద్దపల్లి:గోదావరిఖని:సెప్టెంబర్:29:23:(మేడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్):

రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఠాగూర్ మక్కన్ సింగ్ గెలుపు కోసం,కాంగ్రెస్ పార్టీ బూతు లెవెల్ ఏజెంట్స్,బిఎల్ఎ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్  ఏఐసీసీ నాయకులు మొహన్ జోషి,మాట్లాడారు,బీఆర్ఎస్ రాక్షస పాలన పోవాలంటే..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ను మీరంతా అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి,రామగుండం నియోజకవర్గ ప్రజలకు,బీఆర్ఎస్ అవినీతి పాలన దుర్మార్గానికి జరుగుతున్న ధర్మ యుద్ధమే ఈ ఎన్నికలు-మక్కన్ సింగ్,గోదావరిఖని,దుర్గనగర్ లోని ఆర్కే గార్డెన్ లో ఆదివారం రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో శిక్షణ తరగతులకు రామగుండం నియోజకవర్గoలోని 262 పోలింగ్ బూత్ లలో పాల్గొనబోయే కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ భారీ సంఖ్యలో హాజరైనారు,నవంబర్ 30న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు,కార్యకర్తలు సైనికులు లాగా పనిచేయాలి ఓటర్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మలుచుకునే ప్రయత్నం చేయాలి,న్యూటల్లో ఉన్న ఓటర్లను పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలి ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా వారిని నిరంతరం మోటివేట్ చేస్తూనే ఉండాలి,ఓటింగ్ జరుగుతున్న పోలింగ్ బూత్ లో ఎలక్షన్ జరిగే ముందు ఏ విధంగా బూతులేవల్ ఏజెండ్స్ జాగ్రత్తపడాలి,అబ్జర్వ్ చేయాలి ఏ విధంగా స్పందించాలి బూతు లెవల్ ఏజెంట్స్ బాధ్యతలు ఏమిటి  తప్పుడు పోలింగ్ జరగకుండా ఏ విధంగా స్పందించాలి అనే విషయాలతో పాటు,విధి విధానాల గురించి,ప్రతి ఒక్క అంశాన్ని బూతు లెవెల్ ఏజెంట్స్ కి తెలియజేసే విధంగా డిజిటల్ స్క్రీన్ పై మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ సమక్షంలో జరిగిన సమావేశానికి వేలాదిగా తరలివచ్చిన బిఎల్ఎ ఏజెంట్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు,మహిళా నాయకురాళ్లకు వివిధ కమిటీల అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు కార్పొరేటర్స్ కు,క్షుణ్ణంగా బూత్ లెవల్ ఏజెంట్స్ విషయాన్ని గుర్తు ఉంచుకొని తూచా తప్పకుండా పాటించగలరని మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ పేర్కొన్నారు.నిరంతరము ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై సింగరేణి పారిశ్రామిక,రామగుండం పారిశ్రామిక ప్రాంతము రైతన్నలకు విద్యార్థులకు కర్షకులకు వ్యాపారస్తులకు జరుగుతున్న అన్యాలపట్ల పోరాటం చేస్తూనే ఉన్నా,రేపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా రామగుండం నియోజకవర్గ ప్రజ సమస్యల పట్ల పోరాటం చేస్తూ,సేవ చేస్తూనే ఉంటా ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా రామగుండం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి చేతి గుర్తుకు ఓటు వేసి మక్కన్ సింగును భారీ మెజార్టీతో గెలిపించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేసినారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు 36వ డివిజన్ కార్పొరేటర్ బొంతల రాజేష్,కార్పొరేటర్స్,ఆయ విభాగాల అధ్యక్షులు,ఉపాధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు మహిళా సంఘం నాయకులు కార్యకర్తలు బిఎల్ఎ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

                                         

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: