పేద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:29:(మేడిగడ్డ టీవీ న్యూస్ ఛానల్):
గ్రహాంతర వాసులకు రామగుండంలో చోటు లేదు రామగుండం శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్,రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలమైన రాజకీయ శక్తి...60 వేల సాధారణ 15 వేల క్రీయశీల సభ్యులు కలిగి ఉంది బీఆర్ఎస్ పార్టీ...రామగుండం నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.గోదావరిఖని చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రామగుండం అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జి నారదాసు లక్ష్మణరావుతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడరు..టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి రామగుండం నియోజకవర్గంలో ఒక బలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఎదిగిందన్నారు.రామగుండం నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టానని, రోడ్లు,డ్రైనేజీలు,చౌరస్తాల సుందరీకరణ చేపట్టామన్నారు.ప్రజల అవసరాలను తీర్చుతూ ఈ ప్రాంతానికి మెడికల్ కళాశాల,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం,26 కోట్లతో సివిల్ జడ్జి కోర్టు భవనం ఈ ప్రాంతానికి మాంజూరు చేయుంచామని తెలిపారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంపదను పెంచుతూ పేదలకు పంచుతున్నారని అలాంటి కెసిఆర్ ని మూడవసారి ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలంతా సిద్ధపడ్డారని తెలిపారు.ఇంత చేస్తున్న ఓర్వలేని కొందరూ సోషల్ మీడియా వేదికగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని,తనకు సంబంధంలేని విషయాలను అంటగడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరన్నారు.ప్రశాంతంగా వుండే రామగుండంలో కిరాతక రాజకీయానికి తెరలేపుతూ ఒక అలజడిని సృష్టించాలని చూస్తున్నారని పేర్కొన్నారు,రామగుండం ప్రజలు చైతన్యవంతులని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే అబద్దపు ప్రచారాలను నమ్మరని పేర్కొన్నరు,ఈ విలేఖరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు,మాదాసు రామ్మూర్తి,నడిపెల్లి మురళీధర్ రావు,చెరుకు బుచ్చిరెడ్డి,నూతి తిరుపతి,తోడేటి శంకర్ గౌడ్,ఇంజపురి నవీన్ నారాయణదాసు మారుతీ,చల్లగురుగుల మొగిలి,పర్లపల్లి రవి,రాకం దామోదర్,జక్కుల తిరుపతి,చిప్ప రాజేశం,అమరేందర్,జక్కుల తిరుపతి,మహంకాలి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: