ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 25వ డివిజన్ కార్పొరేటర్ బసవరాజు శిరీష శ్రీమాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అఖిలభారత యాదవ సంఘం అధ్యక్షులు ప్రతాప్ యాదవ్, ధర్ములు కుమార్, కృష్ణమూర్తి శ్రీను, సునీల్, సది, షరీఫ్ తో పాటు సుమారు 40 మంది నేడు ఎల్లం బజార్ శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి సమీపంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని విస్మరించి అభివృద్ధి చేయకుండా వదిలేశారని తమ సొంత లాభం కోసం మాత్రమే పాటుపడ్డారు తప్ప ప్రజల బాగోగుల కోసం ఏ రోజు కృషి చేయలేదన్నారు.

తాను ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గానికి 4100కోట్ల అభివృద్ధి పనులను తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఒక వైపు విద్యా మరోవైపు వైద్యంతో పాటు యువతకు ఉపాధి కల్పించే దిశగా తాము అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

కరోనా కష్టకాలంలో 25వేల మందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశామని, ఉపాది శిక్షణలో భాగంగా యువతీ యువకులకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశానన్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు తాను వ్యక్తిగతంగా చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రజల బాగు కోరి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్న తనకు అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు.

సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్లో పనిచేసిన నాయకులను సైతం తమ వెంట వస్తున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వరంగల్ తూర్పు నియోజకవర్గం అందరి సహకారంతో గొప్పగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

రాబోవు ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి వరంగల్ తూర్పున గులాబీ జెండా ఎగరేయాల్సిందిగా కోరారు.

కార్యక్రమంలో కార్పొరేటర్ బసవరాజు శిరీష

 శ్రీమాన్, డివిజన్ అధ్యక్షులు అల్తాఫ్, జెడ్ఆర్సిసి మెంబర్ చింతాకుల సునీల్, గోరంట్ల రాజు,మాశుఖ్,అక్రమ్,మస్తాన్ గుమ్మడి శ్యాం, డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు హాజరయ్యారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: