ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా  నిర్వర్తించాలని 

 సీపీ అంబర్ కిషోర్ ఝా

అధికారులను ఆదేశించారు.

శనివారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో సీపీ హనుమకొండ, వరంగల్ కలెక్టర్ లతో జిల్లా ఇంటల్లేజెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ఎన్నికల మార్గదర్శకాలను అధికారులు సంపూర్ణ అవగాహనా కలిగి ఉండాలి అన్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడంతో జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని టీం లు  నిబద్ధతతో కలసి పనిచేస్తూ రోజు వారీ నివేదికలను అందించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో అక్రమ మద్యం, నగదు  పై గట్టి నిఘా ఉంచాలని, పట్టుకున్న నగదు జమకు సత్వరమే అకౌంట్ ఏర్పాటు  ఆదేశించారు. చెక్ పోస్ట్ లలో నిఘా పెంచి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని నగదు దొరికితే ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ కి అన్ని ఆధారాలతో సమర్పించాలని సూచించారు. సరి అయినా ఆధారాలు సమర్పించిన వారి నగదు ను నిబంధన ల ప్రకారం విడుదల చేయాలి అని అన్నారు.అక్రమ మద్యం , నల్ల బెల్లం, నాటు సారా పై గట్టి నిఘా ఉంచి నిరంతర తనిఖీలు చేపట్టాలని పట్టుబడిన వాహనాలను సీజ్ చేయాలని సూచించారు. అక్కౌంట్ బదిలీలను  అలాగే  లావాదేవీలు నిరంతర పరిశీలన చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు వాణిజ్య పరమైన లావాదేవీలపై నిరంతరం నిఘా ఉంచాలని , తనిఖీలు చేయాలని సూచించారు. సున్నిత మైన పోలింగ్, సమస్యత్మక పోలింగ్ కేంద్రల పై ప్రత్యేక శ్రద్ద వహించాలి అని అన్నారు. ఎన్నికల నిర్వహణ పై ఉన్నత స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని, అధికారులు ఎన్నికల విధులలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికి రాదని తెలిపారు.ఫిర్యాదులపై  నోడల్‌ అధికారులు ఎప్పటికప్పుడు స్పందించే విధంగా ఉండాలని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ మాట్లాడుతూ సీజ్ అయినా నగదు, బంగారం, మరియు ఇతరతర వస్తువులు స్వాధీనం చేసుకున్నప్పుడు సరి అయినా పత్రలతో రికార్డ్ లో నమోదు చేయాలి అన్నార. నామినేషన్ల పరిశీలన గట్టం పై పూర్తి అవగాహన ఉండాలి అన్నారు.

ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాలను లను పరిశీలించాలని వాటి లో ఉన్న శానిటైజేషన్, త్రాగు నీరు, విద్యుత్ మరే ఇతర సమస్యలు ఉన్నా తప్పకుండా వెంటెనే పరిష్కరించాలి అన్నారు . వచ్చే వారం రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వస్తారు కనుక అధికారులు సమగ్ర నివేదిక వివరాలతో సిద్దంగా ఉండాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు మహేందర్ జి, అశ్విని తానాజి, డి.అర్.ఓ. గణేష్, డీసీపీ భారి, లోకల్ బాడీ, ట్రైనీ  కలెక్టర్,  రెవెన్యూ, నోడల్, ఇంటెలిజెన్స్, ఎక్సర్సైజ్ , ట్రెజరీ, ఇన్కమే టాక్స్ అధికారులు, డీసీపీలు, ఏసీపిలు, తదితరులు హాజరు అయ్యారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: